వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి రెండు రోజులకు ముగ్గురు మృత్యువాత ..గల్ఫ్ దేశాల్లో ఏపి కార్మీకుల దుస్థితి

|
Google Oneindia TeluguNews

పోట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళుతున్న కార్మికుల్లో విషాదం చేసుకుంటుంది..పని చేసుకుని కొంత డబ్బు సంపాదిస్తామనే ఆశతో గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారు ప్రతి రెండు రోజులకు ముగ్గురు చొప్పున మృత్యువాత పడుతున్నారు..గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లిన కార్మికులు వివిధ కారణాలతో చనిపోతున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలియ చేస్తున్నాయి..ఇలా మొత్తం మూడు సంవత్సరాల్లో 1600మందికి పైగా ఆంధ్ర కార్మీకులు మృత్యువాత పడ్డారు.

 మూడు సంవత్సరాల్లో 1656 మంది కార్మికుల మృతి

మూడు సంవత్సరాల్లో 1656 మంది కార్మికుల మృతి

బతుకు దెరువు కోసం స్వదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్లడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంలో కొనసాగుతోంది..ముఖ్యంగా ఎదో ఒక పని చేసుకునేందుకు గల్ఫ్ దేశాలకు అనేక మంది కార్మికులు వెళుతున్నారు..అయితే బతుకుదామని వెళ్లిన వారు దేశంగాని దేశంలో ప్రాణాలు విడుస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రం నుండి వెళ్లిన వారు మొత్తం మూడు సంవత్సరాల్లో 1650 మంది కార్మీకులు వివిధ కారణాలతో మృత్యువాత పడుతున్నారు.కాగా వీరంతా కూడ 30 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే.

కువైట్‌లో ఎక్కువ మరణాలు

కువైట్‌లో ఎక్కువ మరణాలు

ఇక ప్రధానంగా ఎక్కువగా మరణాలు కువైట్, సౌదీ అరేబియా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తర్వాత ఒమన్ ,ఖతార్, బహ్రెయిన్ దేశాల్లో ఈ మరణాలు సంభవించినట్టు చెప్పారు..కాగా మూడు సంవత్సరాల్లో కువైట్‌లో 488 మంది కార్మికులు చనిపోగా,సౌదీ అరేబీయాలో 478,యూఏఈలో 351, ఒమన్‌లో 153,ఖతార్‌లో 108, బహ్రెయిన్‌లో 78,మృత్యువాత పడ్డట్టు మంత్రి ప్రకటించారు.ముఖ్యంగా వీరంతా ఆత్మహత్యలు చేసుకోవడంతో పాటు రోడ్డు ప్రమాదాలు సంభవించడం ఎక్కవ పని గంటలు ఉండడం, మరియు సరైన వైద్య అందకపోవడం, సన్‌స్ట్ర్రోక్, వేడిమీ వల్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రి వీ మురళిధరన్ పార్లమెంట్‌లో మచీలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి లేవ నెత్తిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.

కడప, చిత్తూరు, గోదావరి జిల్లాల నుండి వలసలు

కడప, చిత్తూరు, గోదావరి జిల్లాల నుండి వలసలు

ఇక గల్ఫ్ దేశాలకు ఎక్కువగా వెళుతున్న వారిలో కడప, చిత్తూరు, ఉభయ గోదావరి జిల్లాల వారు ఉన్నట్టు మంత్రి తెలిపారు. వీరిలో ఎక్కువగా క్లీనింగ్ స్టాఫ్ మరియు ఇతర చిన్న చిన్న పనుల కోసం వెళుతున్నట్టు ఆయన ప్రకటించారు.ఇక అక్కడ ఆత్మహత్యకు పాల్పడుతున్నవారు కుటుంభ సమస్యలు, చేసిన అప్పులు తీర్చలేక పోవడంతో తిరిగి ఇంటికి వచ్చేందుకు వెనకడుగు వేస్తున్నట్టు గల్ఫ్‌లో సేవలు అందించే స్వచ్ఛంధ సంస్థలు చెబుతున్నాయి..ఈనేపథ్యంలోనే ప్రతి నెల విజిటింగ్ వీసాల పేరుమీద 500 మంది వెళుతున్నట్టు వారు తెలిపారు.

English summary
Three persons from Andhra Pradesh die in Gulf countries every two days, mostly due to suicides illnesses and road accidents underscoring the pressures and conditions under which thousands from the state work there.Over the past three years, 1,656 workers from the state died in the Gulf, according to data released by the ministry of external affairs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X