వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సీఎం కాక ముందే నవరత్నాలలో మూడు రత్నాలు రాలిపోయాయి -అయ్యన్న పాత్రుడు ఫైర్

|
Google Oneindia TeluguNews

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మంది పడ్డారు. సీఎం కాక ముందే జగన్ నవరత్నాలలో మూడు రత్నాలు రాలిపోయాయని ఆయన విమర్శలు గుప్పించారు.

నేడు ఏపీలో కేసీఆర్... షెడ్యూల్ ఇదేనేడు ఏపీలో కేసీఆర్... షెడ్యూల్ ఇదే

నవరత్నాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు

నవరత్నాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవర్నతాల్లో మూడు రత్నాలు ప్రమాణస్వీకారానికి ముందే రాలిపోయాయని ఆరోపించిన ఆయన పింఛన్లు రూ.3వేలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ ఇక ఆ హామీ తర్వాత ఎప్పుడో చేస్తానని చెప్పడం ఆశ్చర్యంగా అనిపించిందని అన్నారు .

నవరత్నాలలో మూడు రత్నాలు రాలిపోయాయని ఫైర్ అయిన అయ్యన్న పాత్రుడు

నవరత్నాలలో మూడు రత్నాలు రాలిపోయాయని ఫైర్ అయిన అయ్యన్న పాత్రుడు

ఇక మరోవైపు పోలవరం తమ బాధ్యత కాదని కేంద్రం చూసుకుంటుందని జగన్ ప్రకటించడం చూస్తుంటే మరోహామీకి నీళ్లొదిలేసినట్లేనని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను అడుగుతూనే ఉంటా తప్ప ఏమీ చేయలేమంటూ జగన్ చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు.ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే నవరత్నాల్లో మూడు హామీలకు తిలోదకాలిచ్చిన జగన్ ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకెన్ని హామీలను తుంగలో తొక్కుతారోనని అయ్యన్నపాత్రుడు మండిపాటుకు గురయ్యారు .

ఎన్నికల్లో కూడా ఏదో జరిగిందని అనుమ్మనాలు వ్యక్తం చేసిన అయ్యన్న పాత్రుడు

ఎన్నికల్లో కూడా ఏదో జరిగిందని అనుమ్మనాలు వ్యక్తం చేసిన అయ్యన్న పాత్రుడు

తాజాగా ఎన్నికల ఫలితాలపైన అనుమానాలు వ్యక్తం చేసిన అయ్యన్న పాత్రుడు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికల్లో ఏదో జరిగిందని లేకపోతే టీడీపీకి ఇంత ఘోరమైన పరిస్థితా అంటూ విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధికి కనీసం 50, 60 సీట్లు అయినా రావా? అని కార్యకర్తలతో అన్నారు. ఎక్కడో ఏదో జరిగిందని లేకపోతే ఇంతలా ఓడిపోమన్నారు. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే కాదని ప్రతీ ఒక్కరి అభిప్రాయమన్నారు. ఎన్నికల్లో ఓటమిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన చూసి తాను తట్టుకోలేకపోయానని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ గెలిచిన నాలుగు ఎంపీ స్థానాల్లో కూడా ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.

English summary
Former minister Ayyanna pathrudu made sensational comments on YCP prestigious scheme "Nava rathnaalu ". The Jaganmohan Reddy, the chief minister of the AP, said that three gemstones in the miners had gone before the swearing-in. He promised that he would make Rs 3,000 pensions, before elections and now he is saying that he will make it done in future. This made Ayyanna pathrudu to surprise . Jagan also said that the Center will be looking forward to Polavaram and it is not their responsibility. Ayyanna Pathrudu sarcastically commented that Jagan keeps on asking about special status , than asking nothing he can do said Ayyanna Pathrudu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X