వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown: పాలట్యాంకర్‌లో విద్యార్థులు, తనిఖీ చేయడంతో దొరికిపోయి తిరుగుపయనం..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. సరిహద్దుల గుండా పాలు, కూరగాయాలు, నిత్యావసర సరుకులను మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ పొడిగించడంతో ఎలాగైనా ఇంటికి వెళ్లాలనుకునేవారు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. మిర్యాలగూడ వరకు ఎలాగోలా వచ్చిన ముగ్గురు విద్యార్థులు.. తర్వాత పాల ట్యాంకర్ ఎక్కారు. కానీ పోలీసులు తనిఖీ చేయడంతో అడ్డంగా దొరికిపోయారు.

పాలట్యాంకర్ సరిహద్దు చెక్ పోస్ట్ దాటి వెళుతోంది. పొందుగుల వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. పాల ట్యాంకర్ ఓపెన్ చేసి.. చూడగా ముగ్గురు విద్యార్థులు కనిపించారు. వారిని వివరాలు తెలుసుకోగా.. తమది ఏపీ అని మిర్యాలగూడ వరకు కాలినడకన వచ్చామని చెప్పారు. అక్కడే పాల ట్యాంకర్ ఎక్కామని పేర్కొన్నారు.

three students Caught by milk van in andhra pradesh

Recommended Video

Lockdown : Students In Hyderabad Donating Food & Grocery For 1500 People In Balanagar

విద్యార్థుల స్వస్థలం ప్రకాశం జిల్లా సింగరాయకొండ అని తెలిసింది. హైదరాబాద్‌లో ఉంటున్న వీరు.. ఇంటికి వద్దామనుకొన్నారు. అలా బయల్దేరి రాగా.. మిర్యాలగూడ వద్ద పాల ట్యాంకర్ డ్రైవర్‌తో మాట్లాడారు. ముందుగానే డ్రైవర్‌కు నగదు అందజేసి.. అందులో కూర్చొన్నారు. ముగ్గురు విద్యార్థులను తిరిగి హైదరాబాద్ పంపించివేశారు. పాల ట్యాంకర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ట్యాంకర్ సీజ్ కూడా చేశారు. అక్రమ మార్గంలో ఎవరూ రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

English summary
three students Caught by milk van in andhra pradesh pondugula police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X