వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలిటికల్ పంచ్.. కేసీఆర్ మాటేమిటి!: వైసిపి మధు, జగన్ ఎంతిస్తున్నారు.. రవికిరణ్‌తో పోలీసులు

ఏపీ శాసన మండలిని కించపరిచేలా సోషల్ మీడియాలో అభ్యంతరకర చిత్రాలను వ్యాప్తి చేసిన కేసులో రవి కిరణ్‌తోపాటు వైసిపి ఐటీ విభాగం బాధ్యుడు మధుసూదన్ రెడ్డిని మంగళవారం తుళ్లూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు సుదీర్ఘం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: ఏపీ శాసన మండలిని కించపరిచేలా సోషల్ మీడియాలో అభ్యంతరకర చిత్రాలను వ్యాప్తి చేసిన కేసులో రవి కిరణ్‌తోపాటు వైసిపి ఐటీ విభాగం బాధ్యుడు మధుసూదన్ రెడ్డిని మంగళవారం తుళ్లూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు సుదీర్ఘంగా విచారించారు.

పొలిటికల్ పంచ్... ట్విస్ట్: ప్రశాంత్ కిషోర్ సూచన జగన్‌ని దెబ్బతీసిందా? పొలిటికల్ పంచ్... ట్విస్ట్: ప్రశాంత్ కిషోర్ సూచన జగన్‌ని దెబ్బతీసిందా?

ఉదయం పది గంటలకు రావాల్సిన ఇరువురు మధ్యాహ్నం ఒకటి గంటల సమయంలో విచారణకు హాజరయ్యారు. తొలుత మధుసూదన్ రెడ్డిని గుంటూరు రూరల్‌ ఏఎస్పీ వైటీ నాయుడు, తుళ్లూరు ఏఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ గంటన్నరపాటు విచారించారు. వాంగ్మూలం నమోదు చేశారు.

వైసిపికి పని చేస్తున్నారా? ఏం చెల్లిస్తున్నారు?

వైసిపికి పని చేస్తున్నారా? ఏం చెల్లిస్తున్నారు?

ఈ సందర్భంగా రవికిరణ్‌కు వైసిపికి మధ్య సంబంధాలు, అతడు పార్టీకి ఏమైనా సేవలందిస్తున్నారా? ఆయన వైసిపి ఐటీ విభాగంలో ఎంత కాలంగా పని చేస్తున్నారు? ప్రతిఫలంగా పార్టీ నుంచి ఆయనకు ఏం చెల్లిస్తారు? అనే అంశాలపై ప్రశ్నించి వివరాలు రాబట్టారు. రవికిరణ్‌కు పార్టీతో సంబంధం లేదని, ఆయనకు ఎలాంటి బాధ్యతలు లేవని, మధుసూదన్ సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది.

రవికిరణ్‌ను ఏడుగంటల పాటు విచారించారు

రవికిరణ్‌ను ఏడుగంటల పాటు విచారించారు

అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో రవికిరణ్‌ను విచారణకు పిలిచిన అధికారులు రాత్రి తొమ్మిది గంటల వరకూ దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణలో భాగంగా తాను వైసిపిపై అభిమానంతోనే వ్యంగ్య చిత్రాలు గీస్తున్నానని, ఆ పార్టీ నుంచి పారితోషికం ఏమీ పొందలేదని చెప్పాడని తెలుస్తోంది.

పారితోషికంపై అప్పుడు అలా ఎందుకు చెప్పావు

పారితోషికంపై అప్పుడు అలా ఎందుకు చెప్పావు

గతంలో విచారణ సందర్భంగా వైసిపి పారితోషికం ఇస్తుందని ఎందుకు చెప్పావని ప్రశ్నించారని తెలుస్తోంది. చిత్రాలను ఎక్కడి నుంచి సేకరిస్తారు? వాటిని అభ్యంతరకరంగా మార్ఫింగ్‌ చేయాలని ఎవరు చెబుతారు? శాసనమండలిపై అభ్యంతరకరంగా ప్రచారం చేయాలని ఎవరు సూచించారు? వ్యంగ్య చిత్రాలను వైకాపాకే అందిస్తారా? అనే అంశాలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టారు. ఈ నెల 30వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని రవికిరణ్‌, మధుసూధన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు.

వైసిపితో సంబంధం లేదు: మధుసూదన్

వైసిపితో సంబంధం లేదు: మధుసూదన్

ఇంటూరి రవి కిరణ్‌కు వైసిపితో ఎలాంటి సంబంధమూ లేదని, వైయస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానంతోనే ఆయన వ్యంగ్య చిత్రాలు వేసి తమకు ఇస్తుంటారని, వాటిలో తమకు నచ్చినవి తీసుకుని తామే పార్టీ ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా వ్యాప్తి చేస్తుంటామని, ఇప్పటి వరకూ రవికిరణ్‌ ఫేస్‌బుక్‌లో 2500 పోస్టులు పెట్టారని, వాటిపైన ఎలాంటి అభ్యంతరాలు రాలేదని, కేవలం శాసనమండలికి సంబంధించిన చిత్రం పైనే అభ్యంతరం వచ్చిందని, ఆ చిత్రాన్ని తాము ముందే గుర్తించి బాగోలేదని చెప్పగా వెంటనే దాన్ని ఫేస్‌బుక్‌ నుంచి తొలగించాడని మధుసూదన్ రెడ్డి చెప్పారు.

కేసీఆర్, జగన్‌పై పోస్టులు పెట్టినప్పుడు...

కేసీఆర్, జగన్‌పై పోస్టులు పెట్టినప్పుడు...

గతంలో తమ పార్టీ అధినేత జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ శాసన సభలను కించపరుస్తూ టిడిపి సోషల్ మీడియా విభాగం చేసిన పలు అభ్యంతరక పోస్టింగులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని మధుసూదన్ రెడ్డి అన్నారు. విచారణ పేరిట ప్రభుత్వం బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతోందని, వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు.

నెటిజన్లు మరింత రెచ్చిపోతారని..

నెటిజన్లు మరింత రెచ్చిపోతారని..

బెదిరింపుల పేరిట అణిచివేయాలని చూస్తే నెటిజన్లు మరింత రెచ్చిపోతారని మధుసూదన్ రెడ్డి అన్నారు. రవికిరణ్ పెట్టిన పోస్టింగుపై రాద్దాంతం చేస్తున్న ప్రభుత్వం తమ ఫిర్యాదుపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.

రవికిరణ్‌పై ఒత్తిడిపై ఒత్తిడి చేశారా?

రవికిరణ్‌పై ఒత్తిడిపై ఒత్తిడి చేశారా?

రవికిరణ్‌ను పోలీసులు దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించారు. వైసిపితో సంబంధాలు ఉన్నాయని అంగీకరించాలని ఆయనపై పోలీసులు ఒత్తిడి చేశారని వైసిపి ఆరోపిస్తోంది.

English summary
Thullur Police on Tuesday inquiried Inturi Ravikiran for 7 hours in Police Station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X