వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్తుల కేసు: వైయస్ జగన్ జైలు నుంచి బెయిల్ వరకు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్ జగన్ నిరుడు మే 27వ తేదీన అరెస్టయ్యారు. అక్రమాస్తుల కేసులో ఆయనను సిబిఐ అరెస్టు చేసి మర్నాడు కోర్టులో హాజరు పరిచింది. ఆయనపై కేసు దాఖలై, బెయిల్ వచ్చే వరకు వివరాలు ఇలా ఉన్నాయి.

అక్టోబర్ 2010 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెంది సాక్షి దినపత్రిక, సాక్షిటీవి లలో పెట్టుబడులపై విచారణ కోరుతూ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టుకు లేఖ.

YS Jaganmohan Reddy

జనవరి24, 2011: శంకరరావు లేఖను సుమోటోగా స్వీకరించి ప్రతివాదులకు నోటీసులు
జనవరి 31: జగన్ ఆస్తులను జప్తుచేసేలా కోరుతూ హైకోర్టుకు మరికొన్ని ఆధారాల సమర్పణ
ఫిబ్రవరి09: శంకర్రావు మరో అఫిడవిట్, 333 పేజీల డాక్యుమెంట్స్‌ సమర్పణ
మార్చి 14: జగన్ ఆస్తులపై సీబిఐ, ఏసిబి దద్యాప్తు కోరుతూ టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, పి. అశోక్‌గజపతిరాజు, బెరైడ్డి రాజశేఖరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు.
ఏప్రిల్ 08: సోనియా కోరిక మేరకే జగన్‌పై ఆరోపణలు చేశాం, కేసులూ వేశాం.. విలేకరుల సమావేశంలో తెలిపిన మంత్రి శంకర్రావు
జులై 11: ఎమ్మార్‌పై సీబిఐ తో ప్రాథమిక విచారణకు ఆదేశం.
12-07-11 - వైఎస్. జగన్, సాక్షి పెట్టుబడులపై సీబిఐ తో ప్రాథమిక విచారణకు ఆదేశం.
22-07-11 - హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ జగన్ వేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
26-07-11 - సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సీబిఐ నివేదిక
01-08-11 - హైకోర్టుకు సీబిఐ రెండో నివేదిక
04-08-11 - ముగిసిన వాదనలు, తీర్పు వాయిదా
10-08-11 - ఎమ్మార్, జగన్ ఆస్తులపై సీబిఐ తో పూర్తిస్థాయి విచారణకు హైకోర్టు ఆదేశం.
18-08-11 - జగన్ గారి సంస్థలుమరియు సాక్షికార్యాలయాలపై సీబిఐ దాడులు.
30-08-11 - వైఎస్ జగన్మోహన రెడ్డి పై కేసు నమోదు చేసిన ఈడీ.
04-11-11 - గాలి జనార్ధనరెడ్డి మైనింగ్ కేసులో సాక్షిగా సీబీఐ ముందు వై.ఎస్. జగన్ హాజరు.
02-01-12 - జగన్ ఆస్తులకేసులోజగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయసాయి రెడ్డి అరెస్టు
25-01-12 - ైఎమ్మార్ కేసులో వైఎస్ బంధువు సునీల్ రెడ్డి అరెస్టు.
12-03-12 - వైఎస్‌ఆర్ హయాంలో జారీ అయిన 26 జీవోలకు సంబంధించి న్యాయవాది పి.సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్‌లకు నోటీసుల జారీ.
31-03-12 - జగన్ ఆస్తుల కేసులో మొదటి చార్జ్‌షీటు దాఖలు చేసిన సీబిఐ.
13-04-12 - విజయసాయి రెడ్డి కి బెయిల్ మంజూరు.
20-04-12 - విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు.
23-04-12 - జగన్ ఆస్తుల కేసులో రెండో చార్జ్‌షీటు దాఖలు చేసిన సీబిఐ.
30-04-12 - విజయసాయి రెడ్డి కి తిరిగి బెయిల్ మంజూరు చేసిన సీబిఐ కోర్టు.
07-05-12 - జగన్ ఆస్తుల కేసులో మూడో చార్జ్‌షీటు దాఖలు చేసిన సీబిఐ.
07-05-12 - మే 28న కోర్టుకి హాజరు కావాలంటూ జగన్ కు సమన్లు జారీ చేసిన సీబిఐ కోర్టు.
08-05-12 - వైఎస్‌ఆర్‌కు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న సూరీడు వాంగ్మూలం నమోదుకు సీబీఐకి కోర్టు అనుమతి
08-05-12 - జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రాల బ్యాంకు ఖాతాలను (ఎస్‌బిఐ, ఓబీసీ) ఫ్రీజ్ చేసిన సీబిఐ.
09-05-12 - జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రాలకు చెందిన మరో రెండు బ్యాంకు ఖాతాలను (ఓబీసీ, ఐఓబీ) స్తంభింపచేసిన సీబీఐ.
10-05-12 - సాక్షి మీడియాకు ప్రభుత్వ ప్రకటనలను నిలిపివేస్తూ జీవో 2097ను జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం.
14-05-12 - ఖాతాల స్తంభనపై జగతి పబ్లికేషన్స్ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సీబిఐ కోర్టు.
15-05-12 - పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అధికారి బ్రహ్మానందరెడ్డి అరెస్టు.
17-05-12 - సాక్షి మీడియాకు ప్రభుత్వ ప్రకటనలను నిలిపివేస్తూ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేస్తూ విచారణను జూన్ 16కు వాయిదా వేసిన హైకోర్టు.
17-05-12 - పారిశ్రామికవేత్త నిమ్మగ డ్డ ప్రసాద్, అధికారి బ్రహ్మానందరెడ్డిలను 10రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించిన సీబిఐ కోర్టు.
18-05-12 - సాక్షి మీడియా, సునీల్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌ల ఆస్తుల జప్తునకు అనుమతిస్తూ మూడు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం.
21-05-12 - సాక్షి మీడియా, సునీల్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌ల ఆస్తుల జప్తునకు అనుమతి కోరుతూ సీబీఐ వేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సిటీ సివిల్ కోర్టు. పిటిషన్ సవ్యంగా లేదని, అనేక తప్పులున్నాయని, వాటిని సరిచేసి తిరిగి దాఖలు చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది.
21-05-12 - జగన్ గారి తరపున ఆయన వ్యక్తిగత న్యాయవాది హాజరుకు చేసిన అభ్యర్ధనను తిరస్కరించిన సీబిఐ కోర్టుమే 28న కోర్టుకి జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని తెలిపింది.
21-05-12 - సాక్షి మీడియాకు ప్రభుత్వ ప్రకటనలను నిలిపివేస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు సింగిల్ జడ్జి సస్పెండ్ చేయటంపై ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఎదుట సవాలు చేసిన ప్రభుత్వం.
22-05-12 - జగన్ ఆస్తుల కేసులో మూడో చార్జ్‌షీటు తప్పులతడకగా ఉందని పేర్కొంటూ సీబిఐకి తిప్పి పంపిన కోర్టు. ఎమ్మార్ లో అనుబంధ ఛార్జిషీటును కూడా తప్పులు సరిచేసి సమర్పించాలంటూ తిప్పిపంపిన కోర్టు.
23-05-12 - ఆస్తుల కేసులో 25న తమముందు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ జగన్ కు (ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా రెంటచింతలలో) సమన్లు అందజేసిన సీబిఐ.
23-05-12 - జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రాల బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేస్తూ కొన్ని షరతులతో ఖాతాల నిర్వహణకు అనుమతించిన హైకోర్టు.
24-05-12 - జగన్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సీబిఐ కోర్టు.
24-05-12 - జగన్ ఆస్తుల కే సులో మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు.
25-05-12 - ఆస్తుల కేసులో సీబీఐ ముందు హాజరైన వైఎస్ జగన్ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 06.20 వరకు విచారణ.
26-05-12 - రెండో రోజు సీబీఐ ముందు హాజరైన వైఎస్ జగన్. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 06.10 వరకు విచారణ..
27-05-12 -వైఎస్ జగన్ అరెస్ట్. మూడో రోజు సీబీఐ ముందు హాజరైన జగన్‌ను ఉదయం 10.30 నుంచి సాయంత్రం వరకు విచారణ చేసిన సీబీఐ అధికారులు రాత్రి 07.20 సమయంలో అరెస్టు చే సినట్లు ప్రకటించారు.
28-05-12 - వైఎస్ జగన్‌ను కోర్టులో ప్రవేశ పెట్టిన సీబీఐ. జగన్‌కు 14రోజుల జుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించిన సీబీఐ కోర్టు.జూన్ 11న కోర్టులో హాజరు పర్చాలని ఆదేశం.
29-05-12 -సీబీఐ ఈరోజు మూడో ఛార్జిషీటుని కోర్టులో మళ్ళీదాఖలు చేసింది. తప్పుల తడకగా ఉందని ఇంతకుముందు ఒకసారి ఈ ఛార్జిషీటునిసీబీఐ కోర్టు వాపస్ చేసిన విషయం తెలిసిందే.
29-05-12- అరెస్టు చట్టవిరుద్దమని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు.
01-06-12 - బెయిల్‌కు నిరాకరిస్తూ, జగన్‌ పిటిషన్‌ను కొట్టివేసిన సీబీఐ కోర్టు.
02-06-12 - వైఎస్ జగన్‌ను 5 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించిన హైకోర్టు.
08-06-12 - జగన్ సీబీఐ కస్టడీని మరో రెండు రోజులు పొడిగించిన హైకోర్టు.
11-06-12 -జగన్ కు జూన్ 25 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సీబీఐ కోర్టు. సాధారణ ఖైదీలను తరలించే పోలీసు వ్యానులో కోర్టుకి తీసుకురావడంపై జడ్జికి ఫిర్యాదు చేసిన జగన్.
21-06-12- బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు.
21-06-12 - సీబీఐ జేడీ ఫోన్ కాల్స్ జాబితాను బయట పెట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు
25-06-12 - జగన్ జ్యుడీషియల్ రిమాండ్‌ను జూలై 4 వరకు పొడిగించిన సీబీఐ కోర్టు.
03-07-12 - మొదటి ఛార్జిషీటుకి అనుబంధంగా మరో ఛార్జిషీటును దాఖలు చేసిన సీబీఐ.
04-07-12 - జగన్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు.
04-07-12 - జగన్ జ్యుడీషియల్ రిమాండ్‌ను జూలై 18 వరకు పొడిగించిన సీబీఐ కోర్టు.
09-07-12 - బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జగన్.
13-07-12 - చంచల్‌గూడ జైల్లో జగన్‌ను విచారించిన ఈడీ అధికారులు.
28-07-12 - అదనపు సమాచారం జతచేస్తూ సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన జగన్.
09-08-12 - తన అరెస్టును సవాల్ చేస్తూ జగన్ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
13-08-12 - జగన్ ఆస్తుల కే సులో నాలుగో చార్జ్‌షీటు దాఖలు చేసిన సీబిఐ. వాన్‌పిక్ భూముల వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాదరావును 5వ నిందితుడిగా పేర్కొన్న సీబిఐ.
04-10-12 - మనీ లాండరింగ్‌కు సంబంధించి జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్‌ఫ్రాకు చెందిన 51 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్టు తెలియచేస్తూ ఢిల్లీలో ఒక నోట్ విడుదల చేసిన ఈడీ. హెటిరోకు చెందిన 35 ఎకరాలు, రూ.3 కోట్లు, అరబిందో ఫార్మాకు చెందిన రూ.3 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, అరబిందోకు అనుబంధ సంస్థ ఏపీఎల్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన 96 ఎకరాల భూమి ఈ అటాచ్‌మెంట్‌లో ఉన్నట్టు తెలిపిన ఈడీ.
05-10-12 - జగన్ గారి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ సీబీఐ విచారణ పూర్తయిన తర్వాతే బెయిల్ కోరాలని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు.
16-11-12 - బెయిల్ కోరుతూ సీబీఐ కోర్టులో రెండు పిటిషన్‌లు దాఖలు. ఒక సాధారణ, మరొక స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జగన్.
28-11-12 - జగన్ స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన సీబీఐ కోర్టు.
30-11-12 - సీబీఐ కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో తిరిగి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్.
03-12-12 - 26 వివాదాస్పద జీవోలకు సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్స్ దాఖలు చేసిన 6 మంత్రులు, 7 అధికారులు(శ్రీలక్ష్మి మినహా). జీవోల జారీలో ఎలాంటి నిబంధనలూ ఉల్లంఘించలేదని, అవి మంత్రిమండలి సమిష్టి నిర్ణయాలని, వాటికి తమ వ్యక్తిగత బాధ్యత లేదని అఫిడవిట్స్‌లో పేర్కొన్న మంత్రులు.
05-12-12 - సీబీఐ కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్
05-12-12 - పెట్టుబడుల కేసులో సీబీఐ కోర్టు ముందు హాజరైన జగన్, రిమాండ్ డిసెంబర్ 19 వరకు పొడిగింపు.
18-12-12 - వాన్‌పిక్ వ్యవహారంలో నిందితుడైన మాజీ మంత్రి మోపిదేవికి శబరిమలై వెళ్ళేందుకు తాత్కాలికి బెయిల్ మంజూరు చేసిన సీబీఐ కోర్టు.
19-12-12 - జగన్‌ని తాము అరెస్టు చేసింది వాన్‌పిక్ కేసులోనేనని హైకోర్టులో కొత్త వాదన వినిపించిన సీబీఐ
21-12-12 - వాన్‌పిక్ కేసులో ఐఆర్‌ఏఎస్ అధికారి కె.వి.బ్రహ్మానందరెడ్డిని అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరపడానికి కేంద్రం అనుమతి.
21-12-12 - వాన్‌పిక్ కేసులోమంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి తిరస్కరిస్తూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైలును, అడ్వొకేట్ జనరల్ వద్ద న్యాయ సలహా తీసుకోవాలని సూచిస్తూ తిప్పి పంపిన గవర్నర్.
24-12-12 - సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద చట్టబద్ద బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ సాంకేతిక కారణాలతో కొట్టివేసిన హైకోర్టు.
08-01-13 - మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద రెండో విడతగా జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను, రాంకీ ఫార్మా సంస్థకు చెందిన 143.74 కోట్ల విలువ చేసే ఆస్తులను ఆటాచ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఈడీ.
21-01-13 - వాన్‌పిక్ కు సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావులను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తీర్పునిస్తూ, అభియోగాలను విచారణకు స్వీకరించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.
24-01-13 - బెయిల్ కోరుతూ జగన్మోహన రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన రాష్ట్ర హైకోర్టు.
20-02-13 - జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రాలతో పాటు అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్ లిమిటెడ్‌లకు చెందిన ఆస్తుల అటాచ్‌మెంట్ కోసం ఈడీ జారీచేసిన ఉత్తర్వులకు ఢిల్లీలోని పీఎంఎల్‌ఏ న్యాయ నిర్ణాయక సంస్థ సమర్ధన.
22-02-13 - వివాదాస్పద జీవోల కేసు విచారణను(సుప్రీంకోర్టులో)వేరొక ధర్మాసనానికి బదిలీ చేస్తూ జస్టిస్ ఠాకూర్ ఆదేశం.
13-03-13 - జగన్ ఆస్తుల కే సులోఅభియోగాల నమోదుకు అనుమతిచ్చిన సీబీఐ కోర్టు.
22-03-13 - వైఎస్ జగన్మోహన రెడ్డికంపెనీలలో పెట్టుబడుల కేసులో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావును సీబీఐ అధికారులు ఈరోజు విచారించారు.
02-04-13 - మొదటి చార్జిషీట్‌కి అనుబంధంగా సప్లిమెంటరీ చార్జిషీట్‌ని ప్రత్యేక కోర్టులో సమర్పించిన సీబీఐ. దీనిలో అరబిందో, హెటిరో, ట్రిడెంట్ ఫార్మా కంపెనీల ఉల్లంఘనలు పేర్కొన్నట్లు సమాచారం.
02-04-13 - జగతి పెట్టుబడుల కేసులో ఈడీ విచారణకు హాజరైన విజయసాయు రెడ్డి.
08-04-13 - ఐదో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ. దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ యాడు దాల్మియాను మూడో నిందితునిగా, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నాలుగో నిందితురాలిగా పేర్కొన్న సీబీఐ.
10-04-13 - ఏడు అంశాలపై ఒకే తుది చార్జిషీటు దాఖలు చేస్తామని సుప్రీంకోర్టుకు సీబీఐ హామీ ఇచ్చి ఇప్పుడు ఒక్క దాల్మియా సిమెంట్స్ అంశంపై మాత్రమే మరో చార్జిషీటు దాఖలు చేయటం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ కోర్టులో విడివిడిగా మెమోలు దాఖలు చేసిన వైఎస్ జగన్మోహన రెడ్డి, విజయసాయిరెడ్డి.
12-04-13 - బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్. తుది చార్జిషీటు విషయంలో సీబీఐ సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి మళ్లీ అదనపు చార్జిషీట్లు దాఖలు చేస్తోందని పిటిషన్‌లో పేర్కొన్న జగన్.
27-04-13 - దాల్మియా సిమెంట్స్ పై వేసిన చార్జిషీట్‌నే తుది చార్జిషీట్‌గా పరిగణించాలని కోరుతూ వైఎస్ జగన్మోహన రెడ్డి, విజయసాయిరెడ్డి వేసిన మెమోలను కొట్టివేసిన సీబీఐ కోర్టు.
30-04-13 - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసును స్వయంగా కోర్టే పర్యవేక్షించాలంటూ న్యాయవాది రంగారావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు.
02-05-13 - విజయసాయి రెడ్డికి దిగువ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దుచేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై ముగిసిన వాదనలు, తీర్పు వాయిదా.
06-05-13 - వైఎస్ జగన్మోహన రెడ్డి బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన ధర్మాసనం.
09-05-13 - జగన్ బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ సీబీఐ విచారణ పూర్తయిన తర్వాతే బెయిల్ కోరాలని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు. నాలుగు నెలల్లో విచారణ పూర్తిచేయాలని సీబీఐకి ఆదేశం. విజయసాయి రెడ్డికి దిగువ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ జూన్ 5వ తేదీ లోపు లొంగిపోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు. నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్‌ కూడా కొట్టివేత.
31-05-13 - ఈడీ 3వ అటాచ్‌మెంట్... జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.66 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను (ఓబీసీ-జూబ్లీహిల్స్ బ్రాంచ్) అటాచ్ చేసినట్లు ప్రకటించిన ఈడీ.
07-06-13 - సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ మహారాష్ట్రకు బదిలీ. ఇన్‌చార్జిగా తమిళనాడుకు చెందిన సీబీఐ జేడి అరుణాచలం నియామకం.
11-07-13 - పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు (తన మామ అంత్యక్రియలు నిర్వహించడం కోసం) 13 రోజుల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సీబీఐ కోర్టు.
26-07-13 - సీసీ నెంబర్ 9 చార్జిషీట్‌కు అనుబంధంగా సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించకూడదని కోరుతూ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కు కొట్టివేస్తూ అనుబంధ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.
05-08-13 - 26 వివాదాస్పద జీవోలకు సంబంధించి మంత్రులపై సీబీఐ విచారణ కోరుతూ న్యాయవాది పి.సుధాకర రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.
10-09-13 - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కే సులో మరో మూడు చార్జ్‌షీట్లు దాఖలు చేసిన సీబిఐ. పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, భారతి సిమెంట్స్‌పై వేర్వేరుగా చార్జ్‌షీట్స్. పలువురు ఐఏఎస్‌లను కూడా నిందితులుగా చేర్చిన సీబీఐ.
11-09-13 - సుప్రీంకోర్టు సీబీఐకి ఇచ్చిన గడువు ముగిసినందున బెయిల్ ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్.
17-09-13 - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కే సులో మరో రెండు చార్జ్‌షీట్లు దాఖలు చేసిన సీబిఐ. లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఇందూ టెక్ అంశాలపై అభియోగాలు. మంత్రి గీతారెడ్డితో పాటు, మాజీ మంత్రులు ధర్మాన, సబితలను కూడా నిందితుల జాబితాలో చేర్చిన సీబీఐ.
23-09-13 తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
English summary
YSR Congress Party President YS Jaganmohan Reddy granted bail in DA case on monday, He has been arrested on may 27, 2012 and has been granted bail today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X