• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

tirumala: బిచ్చగాడి ఇంట్లో రూ.10లక్షలు -అంతా స్వాధీనం చేసుకున్నTTD - అసలేం జరిగిందటే..

|

కలియుగ వైకుంఠంగా, ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుమలలో అనూహ్య సంఘటన వెలుగులోకి వచ్చింది. వడ్డీకాసులవాడి సమక్షంలో ఓ బిచ్చగాడు లక్షాధికారి అయిన వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శ్రీవారి ఆలయన్ని, అక్కడికి వచ్చే భక్తులను నమ్ముకుని కొన్ని వందల మంది అనాథలు, బిచ్చగాళ్లు తిరుమలలో కాలం వెళ్లదీస్తున్నక్రమంలో ఓ యాచకుడి ఇంట్లో ఏకంగా రూ.10లక్షలు దొరకడం స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే..

 ఎంపీ రఘురామ వివాదంలో మరో ట్విస్ట్ -జగన్ సర్కారుపై సుప్రీంకోర్టుకు ఆ రెండు ఛానళ్లు -ఎదురుదెబ్బ? ఎంపీ రఘురామ వివాదంలో మరో ట్విస్ట్ -జగన్ సర్కారుపై సుప్రీంకోర్టుకు ఆ రెండు ఛానళ్లు -ఎదురుదెబ్బ?

అతని పేరు శ్రీనివాస చారి..

అతని పేరు శ్రీనివాస చారి..

దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఆలయమైన తిరుమల సహా కొండ కింద తిరుపతిలోనూ వేల మంది యాచకులు, అనాథలు జీవనం సాగిస్తున్నారు. కరోనా లాక్ డౌన్, కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో భక్తుల నిలిచిపోవడం లేదా తగ్గిన క్రమంలో అనాథలు, బిచ్చగాళ్లు, నిరుపేదల కోసం టీటీడీ స్వయంగా రోజుకు వేలకొద్దీ ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడం, తుడా, మున్సిపల్ విభాగాలు సైతం తోచినరీతిలో సహాయపడుతుండటం తెలిసిందే. కాగా, తిరుమలలోనే ఉంటూ యాచక వృత్తిని కొనసాగించిన శ్రీనివాసాచారి అనే వ్యక్తి ఇంట్లో రూ.10లక్షలు బయటపడ్డాయి..

బట్టలు చించుకున్న రఘురామ -సుప్రీం షాక్ -సాయిరెడ్డి జారుడు బండ ఫిలాసఫీ -జగన్‌కు చంద్రబాబు సిఫార్సా?బట్టలు చించుకున్న రఘురామ -సుప్రీం షాక్ -సాయిరెడ్డి జారుడు బండ ఫిలాసఫీ -జగన్‌కు చంద్రబాబు సిఫార్సా?

విజిలెన్స్ తనిఖీలో షాకింగ్..

విజిలెన్స్ తనిఖీలో షాకింగ్..

తిరుమలలో యాచన చేస్తూ జీవనం సాగించిన శ్రీనివాసాచారి.. 2007లో తిరుమల సమీపంలోని శేషాచలనగర్‌లో ఓ ఇంటిని(ఇంటి నెం.75ను) పొందాడు. యాచనతోపాటు తిరుమలలో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ అతను భారీగా నగదును పోగు చేసుకున్నాడు. తాను సంపాదించిన సొమ్మును ఇంట్లోనే ట్రంకు పెట్టెలో భద్రపరుచుకుంటూ వచ్చాడు. అయితే, గత సంవత్సరం ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు వారసులు ఎవరూ లేరు. శ్రీనివాసాచారికి కేటాయించిన ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు సోమవారం విజిలెన్స్ అధికారులు వెళ్లగా, ఇంట్లోని ట్రంకు పెట్టెల్లో భారీ మొత్తంలో డబ్బులు బయటపడ్డాయి..

  'Anjanadri' In Tirumala is Hanuman''s Birthplace ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? || Oneindia Telugu
  బిచ్చగాడి డబ్బు టీటీడీ ట్రజరీకి..

  బిచ్చగాడి డబ్బు టీటీడీ ట్రజరీకి..

  శేషాచలనగర్ లోని శ్రీనివాసాచారి ఇంట్లో టీటీడీ విజిలెన్స్ అధికారులు, సిబ్బంది తనిఖీలు చేయగా, రెండు ట్రంకు పెట్టెల్లో చిల్లర నగదు, కరెన్సీ నోట్లు పెద్దఎత్తున కనిపించాయి. ఇందులో రద్దు చేసిన రూ.1,000 నోట్లు, పాత నోట్లు ఉండటం విశేషం. వాటి విలువ సుమారు రూ.10లక్షలు వరకు తేలింది. ఆ మోత్తాన్నీ స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు.. సదరు నగదును టీటీడీ ట్రెజరీకి తరలించారు.

  English summary
  in a surprising incident, Rs 10 lakh was found in the house of a beggar in Thirumala on monday. the lone begger named Srinivasa chari was died las year due to illness. when ttd officials tried to take over his house, which was ttd property, officials found huge money in trunk box. the tirumala tirupati devasthanam has ceased all the amount and send it to td treasury.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X