• search
 • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుమలలో 11వ తేదీ నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం: ఇప్పట్లో తలనీలాలను సమర్పించుకోలేం

|

తిరుపతి: ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాదిమంది భక్తులు ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. సాక్షాత్ శ్రీమహావిష్ణువు స్వరూపుడైన తిరుమల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి సన్నహాలు పూర్తయ్యాయి. సోమవారం నుంచి భక్తుల రాకకు అనుమతి ఇవ్వనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. తొలి మూడురోజుల పాటు ట్రయల్ రన్‌ను నిర్వహించబోతున్నారు. 8, 9, 10 తేదీల్లో ఈ ట్రయల్ రన్ కొనసాగుతుంది. టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, తిరుమల స్థానికులతో ఈ ట్రయల్ రన్‌ను నిర్వహిస్తారు.

  TTD Issued Guidlines For devotees To Visit Tirumala From June 8

  తిరుమలలో ఆధ్యాత్మిక సౌరభం ఆరంభం: శ్రీవారికి జ్యేష్టాభిషేకం: గోవిందుడి నామస్మరణతో

   లోటుపాట్లు, భక్తుల సంఖ్యను నిర్ధారించడానికి

  లోటుపాట్లు, భక్తుల సంఖ్యను నిర్ధారించడానికి

  ట్రయల్ రన్ సందర్భంగా క్యూ కాంప్లెక్సులు, వసతి గదుల కేటాయింపులు, భౌతిక దూరాన్ని పాటించడం..వంటి అంశాల్లో తలెత్తిన లోటుపాట్లను సరి చేసుకుంటారు. అలాగే ఒకరోజులో ఎంతమందికి దర్శనాన్ని కల్పిస్తారనే విషయాన్నీ నిర్ధారించుకుంటారు. గంట సమయాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నారు టీటీడీ అధికారులు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి.. ఒక గంట కాలంలో ఎంతమందికి శ్రీవారి దర్శనాన్ని కల్పించగలిగామనే విషయాన్ని బేరీజు వేసుకుని ఒక రోజులో పూర్తిస్థాయిలో భక్తుల సంఖ్యను ఖాయం చేస్తారు.

  ఆన్‌లైన్ ద్వారా మాత్రమే

  ఆన్‌లైన్ ద్వారా మాత్రమే

  రోజులో 14 గంటల పాటు మాత్రమే దర్శన సమయాన్ని ఖాయం చేయవచ్చని తెలుస్తోంది. కాగా.. ఆన్‌లైన్ ద్వారా స్వామివారి దర్శనానికి అవసరమైన టికెట్లను బుక్ చేసుకున్న వారికి మాత్రమే కొండపైకి అనుమతి ఇస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవడం సాధ్యం కాని భక్తుల కోసం తిరుపతిలో ఓ రిజిస్ట్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, అక్కడ టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు. ఏ రాష్ట్రం నుంచి వచ్చే భక్తులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తప్పనిసరిగా అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

  కల్యాణకట్ట తాత్కాలిక మూసివేత

  కల్యాణకట్ట తాత్కాలిక మూసివేత

  కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా కల్యాణకట్టను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పరిస్థితులు కుదుట పడిన తరువాతే పునరుద్ధరిస్తామని అన్నారు. తలనీలాల సమర్పణ ఉండబోదని ఆయన పరోక్షంగా స్పష్టం చేసినట్టయింది. అర్చకుల నుంచి తీర్థం, చఠారిని స్వీకరించడం ఉండదని అన్నారు. అలాగే- కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లలో భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని చెప్పారు.

   వృద్ధులు, పిల్లలకు నో ఛాన్స్

  వృద్ధులు, పిల్లలకు నో ఛాన్స్

  కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. 65 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వృద్ధులు, పదేళ్ల లోపు పిల్లలకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. దీనికి అనుగుణంగా ఆన్‌లైన్ టికెట్లను జారీ చేసే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో ఉన్నవారు తిరుమలకు రావొద్దని ఆయన సూచిం

  English summary
  Tirumala Tirupati Devasthanams has issued seperate guidlines for devotees, who visits Tirumala from June 8. TTD Chairman YV Subbareddy told that each and every person who visits Tirumala should wear Mask. TTD will allow Lord Venkateswara's darshan on Online tickets only and Kalyana katta will closed for temporary basis.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more