Tirumala: స్వర్ణ రథంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి, తిరుగిరుల్లో గోవింద.... గోవిందా !
తిరుమల/తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల స్వామి సన్నిధానంలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా గోవిందా గోవిందా అంటూ భక్తులు పులకించిపోయారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకని తిరుమలలో శ్రీవారి రథోత్సవం రంగరంగ వైభవంగా నిర్వహించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ దంపతులతో పాటు టీటీడీ అధికారులు, శ్రీవారి భక్తులు స్వామి స్వర్ణ రథోత్సవం ఊరేగింపులో పాల్టొన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ దంపతులు శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గురువారం తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి నిర్వహించారు. వేలాది మంది శ్రీవారి భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్బంగా శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
Sabarimala:
శబరిమలలో
మకరవిళక్కు
ప్రారంభం,
లక్ష
మంది
భక్తుల
కోసం
ఏర్పాట్లు,
మకరజ్యోతి!

వైకుంఠ ఏకాదశి పర్వదినం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల స్వామి వారిని దర్శించుకోవాలని కోట్లాది మంది స్వామి భక్తులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే పాపాలు అన్ని తొలగిపోతాయని శ్రీవారి భక్తులకు నమ్మకం.

మాములుగా ఈ రోజు తిరుమలలో
సర్వసధారంగా వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారి భక్తులతో కిక్కిరిసిపోతుంది. అయితే గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తు కొంత మందికి మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి టీటీడీ అధికారులు అవకాశం కల్పించారు.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి
గురువారం తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రంగరంగ వైభవంగా స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి బంగారు రథంపై తిరువీధుల్లో విహరించారు. తిరువీధుల్లో భక్తులు గోవిందా గోవిందా అంటూ స్వామివారిని స్మరించుకున్నారు. బంగారు రథం మీద ఊరేగుతున్న శ్రీవారిని చూడటానికి భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూసి స్వామిని దర్శించుకుని తరించిపోయారు.

శ్రీవారి సేవలో సీజేఐ
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ దంపతులు తిరుమల చేరుకున్నారు. గురువారం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ దంపతులు తరువాత స్వర్ణ రథం ఊరేగింపులో పాల్గొన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ దంపతులు శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ దంపతులకు టీటీడీ అధికారులు దగ్గరుండి స్వామి వారి దర్శనం చేయించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.

కోవిడ్ నియమాలతో భక్తులకు నిరాశ
కరోనా వైరస్ థర్డ్ వేవ్ సందర్బంగా శ్రీవారిని దర్శించుకోవడానికి కొన్ని వేల మందికి సాధ్యం కాలేదు. వైకుంట ఏకాదశి సందర్బంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి ముందులాగా కాకుండా తక్కువ మంది భక్తులకు అవకాశం చిక్కింది. కోవిడ్ నియమాలు పాటిస్తూ టీటీడీ అధికారులు తిరుమలలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం చిక్కిన భక్తులు మాత్రం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పులకించిపోయారు.