తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం : తిరుపతి 'రుయా'లో ఆక్సిజన్ అందక 11 మంది మృతి... పలువురి దిగ్భ్రాంతి...

|
Google Oneindia TeluguNews

తిరుపతి రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం తలెత్తడంతో 11 మంది మృతి చెందారు. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రాక 5 నిమిషాలు ఆలస్యం కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది నిమిషాల వ్యవధిలో ఆక్సిజన్‌ను పునరుద్దరించకపోయి ఉంటే ప్రాణ నష్టం ఇంకా ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ మాట్లాడుతూ... సోమవారం(మే 10) రాత్రి 8గంటల నుంచి 8.30గంటల సమయంలో ఆక్సిజన్ ప్రెజర్ సమస్య ఏర్పడినట్లు చెప్పారు. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రాక కాస్త ఆలస్యం కావడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 11 మంది మృతి చెందినట్లు తెలిపారు. మిగతా రోగుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆస్పత్రిలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని... ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు.

Tirupati: 11 COVID patients die in Ruia Hospital due to disruption in oxygen supply

అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న పేషెంట్లను 30 మంది వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. రుయా ఆస్పత్రిలో విషాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

హోంమంత్రి సుచరిత రుయా ఆస్పత్రి విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రుయా ఆస్పత్రి ఘటనపై స్పందించారు. ఆక్సిజన్ అందని కారణంగా కోవిడ్ పేషెంట్లు చనిపోవడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. 'రాయలసీమ ప్రజల వైద్య అవసరాలకు కేంద్రమైన రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా,వైద్యపరమైన మౌలిక వసతులు సరిగా లేవని రోగులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. కర్నూలు,హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు ఆక్సిజన్ అందక చనిపోయారు. అయినప్పటికీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోలేదు. ఇలాంటి విపత్కర సమయంలో విమర్శలు వద్దని సంయమనం పాటిస్తున్నాం. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి విషాదకర ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలి.' అని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన రోగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలన్నారు. చేతకాని పాలనతో ప్రజల ప్రాణాలు తీస్తున్న జగన్‌పై కేసు నమోదు చేయాలన్నారు.

Recommended Video

#WATCH Railway Constable Saves Woman From Falling Under Train - VIDEO Viral || Oneindia Telugu

English summary
At least 11 patients died at a hospital in Andhra Pradesh's Tirupati due disruption in oxygen supply. The tragic incident took place at SVR Ruia Hospital on Monday night.According to reports, the hospital was running short on oxygen and a tanker with supply from Chennai was awaited. However, the tanker got delayed due to some issue triggering panic amid the hospital management and family members of patients.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X