తిరుపతి బై పోల్: లక్షా16వేల ఓట్ల మెజార్టీతో సుగుణమ్మ గెలుపు(పిక్చర్స్)
చిత్తూరు:తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ ఘన విజయం సాధించారు. లక్షా 16వేల 524 ఓట్ల భారీ మెజార్టీతో ఆమె గెలుపొందారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేవలం 9,628 ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోయారు.
ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ.. ఈ విజయం ప్రజలదేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పారని అన్నారు. నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తన భర్త హామీలను నెరుస్తానని, ఆయన ఆశయ సాధన కోసం పని చేస్తానని సుగుణమ్మ తెలిపారు. మహిళల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పారు.
స్థానిక ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో సోమవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 11.45 గంటల ప్రాంతంలో ముగిసింది. కాగా, మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మ మొదట్నుంచి ఆధిక్యాన్ని చాటుకున్నారు. 16వ రౌండ్లో ఆమె లక్ష ఓట్ల ఆధిక్యాన్ని నమోదు చేశారు. 12వ రౌండ్లో ఆమె 65వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. ఎనిమిదో రౌండ్లో సుగుణమ్మ 50వేల ఓట్ల ఆధిక్యంతో కొనసాగారు. రెండో రౌండ్‌లో 13,363 ఓట్ల ఆధిక్యాన్ని చాటుకున్నారు. రెండో రౌండ్‌లో 20,213 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.
మూడో రౌండ్లోనూ ఆధిక్యాన్ని చాటుకున్న సుగుణమ్మ.. నాలుగో రౌండ్లో 25,825 ఓట్ల ఆధిక్యాన్ని నమోదు చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీదేవి కేవలం 3వేల ఆధిక్యంలో కొనసాగారు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించిన ఓట్ల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఫిబ్రవరి 13న తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.

సుగుణమ్మ
తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ ఘన విజయం సాధించారు.

సుగుణమ్మ
లక్షా 16వేల 524 ఓట్ల భారీ మెజార్టీతో ఆమె గెలుపొందారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేవలం 9,628 ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోయారు.

సుగుణమ్మ
ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ.. ఈ విజయం ప్రజలదేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పారని అన్నారు.

సుగుణమ్మ
నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తన భర్త హామీలను నెరుస్తానని, ఆయన ఆశయ సాధన కోసం పని చేస్తానని సుగుణమ్మ తెలిపారు. మహిళల అభివృద్ధికి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.

కాంగ్రెస్ అభ్యర్థి
స్థానిక ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో సోమవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 11.45 గంటల ప్రాంతంలో ముగిసింది. కాగా, మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది.












Click it and Unblock the Notifications