తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనాపై అవగాహనకు సర్వైవ్‌ కోవిడ్‌ 19 గేమ్... ఆడితే అర్ధమవుతుందట !!

|
Google Oneindia TeluguNews

కరోనాపై అవగాహన కోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి.అయినా సరే ప్రజల్లో అవగాహన ఎంతగా ఉంది అంటే వైన్స్ తెరవగానే ఒకరిమీద ఒకరుపడుతూ మద్యం కొనుగోలు చేసేంతగా అవగాహన ఉంది . రోజూ ప్రచారం చేసినా , డప్పు చాటింపు వేయించినా, సెలబ్రిటీలు నడుం బిగించి జాగ్రత్తలు చెప్పినా వినని వారి కోసం ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ ఓ గేమ్ రూపొందించారు ఏపీకి చెందిన ఐఐటీ ప్రొఫెసర్ ల బృందం .

కరోనాతో బ్యాంక్ మేనేజర్ మృతి ... టెన్షన్ లో బ్యాంక్ సిబ్బందికరోనాతో బ్యాంక్ మేనేజర్ మృతి ... టెన్షన్ లో బ్యాంక్ సిబ్బంది

కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రపంచంలోనే తొలిసారి ఓ గేమ్‌ రూపొందించింది తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ శ్రీధర్ బృందం. సర్వైవ్‌ కోవిడ్‌ 19తో రూపొందించిన ఈ గేమ్‌ను రెండు సార్లు ఆడితే చాలు కరోనా జాగ్రత్తలపై అవగాహన కలుగుతుందంటున్నారు ప్రొఫెసర్ శ్రీధర్. కరోనా వ్యాధి ఇప్పట్లో మనల్ని వీడదని ప్రపంచ ఆరోగ్య సంస్థనే ప్రకటన చేసిన వేళ స్వీయ నియంత్రణ , ప్రధాని మోడీ చెప్పినట్టు ఆత్మ నిర్బంధం అవసరం .

Tirupati IIT professor Sridhar team created Survive Covid 19 game

ఇక కరోనా పై ఎంత చెప్పినా అవగాహన రాని, మాకు రాదులే అని అర్ధం చేసుకోకుండా తిరిగే యువతను టార్గెట్ చేసి గేమ్ రూపొందించారు . కరోనాపై పోరాటంలో భాగస్వామ్యం అయ్యేందుకు, వ్యాధి బారిన పడకుండా ప్రజలను రక్షించేందుకు ఈ గేమ్‌ తయారుచేశామంటున్న ప్రొఫెసర్‌ శ్రీధర్.కరోనాపై అవగాహన కల్పించేందుకు సర్వైవ్ కోవిడ్ 19 గేమ్‌ మరింత డెవలప్ చేస్తామని ఆయన పేర్కొన్నారు .

English summary
Tirupati IIT professor Sridhar team created the world's first game to create awareness on Corona. The game, created with Survive covid 19, is a t game that will raise awareness of corona care if paly for two times , Professor Sridhar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X