తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీటీడీ కీలక నిర్ణయం: తిరుమల లడ్డు ధర పెంపు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

తిరుపతి: శ్రీవారి ప్రసాదాల్లో భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డు ధరను పెంచాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన పాలకమండలి సమావేశం చేసిన తీర్మానాలను చైర్మన్‌, కార్యనిర్వహణాధికారి (ఈవో) సాంబశివరావు మీడియాకు వెల్లడించారు.

స్వామివారి అర్జిత సేవల రుసుములతో సహా గదుల, కల్యాణమంటపాల అద్దెలు కూడా పెంచాలని నిశ్చయించింది.

ఈ మేరకు పి.సుధాకర్‌యాదవ్‌, సండ్ర వెంకటవీరయ్య, సాయన్న, శేఖర్‌, డీపీ అనంత, రాఘవేంద్రరావు, భానుప్రకాష్‌రెడ్డి, జేఈవోలు శ్రీనివాసరాజు, భాస్కర్‌, ఎఫ్‌ఏసీఏవో బాలాజీలతో ఓ కమిటీని టీటీడీ ఏర్పాటు చేసింది.

తిరుమల లడ్డు ధర పెంపు

తిరుమల లడ్డు ధర పెంపు

అన్ని అంశాలపై అధ్యయనం చేసి, పదిహేను రోజుల్లో తగిన ప్రతిపాదనలతో నివేదిక ఇవ్వాలని టీటీడీ బోర్డు కోరింది.

తిరుమల లడ్డు ధర పెంపు

తిరుమల లడ్డు ధర పెంపు

దీంతో పాటు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 3.5 ఎకరాల్లో రూ.13.98 కోట్లతో శ్రీవారు, శ్రీమహాగణపతి ఆలయాలు నిర్మిస్తారు.

తిరుమల లడ్డు ధర పెంపు

తిరుమల లడ్డు ధర పెంపు

తిరుమలలో కొత్తగా నిర్మించిన గోవిందసాయి విశ్రాంతి భవనం మాస్టర్‌ సూట్‌కు రూ.6వేలు, సాధారణ సూట్‌కు రూ.2,500, గ్రౌండ్‌ఫ్లోర్‌ (సెల్లార్‌)లో రూ.750 చొప్పున అద్దె వసూలు చేస్తారు.

తిరుమల లడ్డు ధర పెంపు

తిరుమల లడ్డు ధర పెంపు

తమిళనాడులోని అరవింద నేత్ర వైద్యశాల శాఖ ఏర్పాటు కోసం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వద్ద ఎకరాకు ఏటా రూ. లక్ష లీజుతో ఏడెకరాలను కేటాయిస్తారు.

తిరుమల లడ్డు ధర పెంపు

తిరుమల లడ్డు ధర పెంపు

ఎస్వీ భక్తి చానల్‌ ఉద్యోగ నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఎందుకు పాటించలేదని బోర్డు సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ఈ సమావేశంలో ప్రశ్నించారు.

తిరుమల లడ్డు ధర పెంపు

తిరుమల లడ్డు ధర పెంపు

ఖమ్మంలోని టీటీడీ సమాచార కేంద్రంలో కడపకు చెందిన వ్యక్తి పనిచేయడం ఏంటని, స్థానికులకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనిపై వారంలోగా నివేదిక ఇవ్వాలని కోరారు.

English summary
'Tirupati Laddu' may get lighter or costlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X