తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనసేన పార్టీలోకి టీడీపీ ఎమ్మెల్యే: తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ ఏం చెప్పారంటే?

|
Google Oneindia TeluguNews

రుపతి: ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో తెలుగుదేశం పార్టీ తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ కనిపించలేదు. ఇది చర్చనీయాంశంగా మారింది. కొందరైతే ఆమె పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలోకి వెళ్తారని భావించారు. ఈ మేరకు ప్రచారం సాగింది. దీనిపై సుగుణమ్మ స్పందించారు.

తాను ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. తెలుగుదేశంపై ఉన్న నమ్మకంతో తన భర్త దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ ఆ పార్టీలో చేరారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఆయన తిరుపతిలో భారీ మెజార్టీతో గెలుపొందారని గుర్తు చేశారు.

Tirupati MLA Sugunamma says she will not leave Telugudesam

ఆయన మృతి తర్వాత టీడీపీ తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశమిచ్చిందని, ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీకి మంచి పేరు తీసుకు వస్తున్నానని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు కొందరు తనపై ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దన్నారు.

<strong>టిక్కెట్ లేదు కానీ: తేల్చేసిన అంబటి, అన్యాయం చేశారు.. మాట్లాడతా: వంగవీటి ఆగ్రహం</strong>టిక్కెట్ లేదు కానీ: తేల్చేసిన అంబటి, అన్యాయం చేశారు.. మాట్లాడతా: వంగవీటి ఆగ్రహం

కాగా, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటనకు స్థానిక ఎమ్మెల్య అయిన సుగుణమ్మ గైర్హాజరుకావడం చర్చనీయంశమైంది. గత కొంతకాలంగా తిరుమల అధికారుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సుగుణమ్మ ఏకంగా ముఖ్యమంత్రి పర్యటనకు డుమ్మా కొట్టడం ద్వారా తన నిరసన తెలిపినట్లు భావించారు.

శ్రీవారి బ్రహోత్సవాల సందర్భంగా వెంకటేశ్వరునికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళ్లిన చంద్రబాబు పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ కనిపించలేదు. దీంతో చంద్రబాబు కూడా ఆమె గైర్హాజరుపై ఆరా తీశారట.

English summary
Tirupati MLA Sugunamma said that she will not leave Telugudesam. She was absent in AP CM Chandrababu Naidu's Tirumala tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X