
సీఎం వైఎస్ జగన్ కు తిరుపతి ఎంపీ సీటును కానుకగా ఇస్తాం : మంత్రి అనిల్ కుమార్ యాదవ్
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల రాజకీయం నామినేషన్ల దాఖలు తో హీట్ ఎక్కింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల బరిలోకి వెళుతున్నారు. ఈరోజు వైసిపి అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి తిరుపతి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని వైసీపీ మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ గురుమూర్తి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తిరుపతి ఉప ఎన్నిక పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ
అభ్యర్థిగా
గురుమూర్తి
నామినేషన్
దాఖలు
,తిరుపతి
ఉపఎన్నిక
లో
గెలుపు
లాంఛనమే
:
వైసీపీ
మంత్రులు

సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా అత్యధిక మెజార్టీతో తిరుపతి ఎంపీ సీటు
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వబోతున్నామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. వైయస్ జగన్ ఆశీస్సులతో గురుమూర్తి నామినేషన్ దాఖలు చేశారని, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నామినేషన్ దాఖలు చేసినా వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారని ఆయన పేర్కొన్నారు.
తిరుపతి ప్రజలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విపరీతమైన నమ్మకం ఉందని, ఆ నమ్మకం కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

టీడీపీ చేతులెత్తేసింది .. సుపరిపాలన , అభివృద్ధి , పథకాలే వైసీపీని గెలిపిస్తాయి
గత ఎన్నికల్లో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఎన్నికల్లోనూ ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే చేతులెత్తేసింది అని పేర్కొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ సక్సెస్ ఫార్ములాని వివరించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో ఐదు లక్షల భారీ మెజారిటీతో విజయం సాధిస్తాం
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలలోనూ ఐదు లక్షల భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల తరహాలో ఇప్పుడు కూడా వైసిపికి విజయం రిపీట్ అవుతుందని, ఇటీవల ఎన్నికల ఫలితాలే మళ్ళీ పునరావృత్తం అవుతాయని అనిల్ కుమార్ యాదవ్ ధీమాతో ఉన్నారు .
ప్రజల
తీర్పు
అదే
విధంగా
ఉంటుందని
మంత్రి
అనిల్
కుమార్
యాదవ్
అభిప్రాయం
వ్యక్తం
చేశారు
.