• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇంకా ఆగని తిరుపతి రచ్చ-ఎన్ఐఏ దర్యాప్తు కోరిన రఘురామ- సైబర్‌ క్రైమ్‌ కౌంటర్‌

|

తిరుపతి ఉపఎన్నిక పోలింగ్‌ పూర్తయి ఆరు రోజులు గడుస్తున్నా ఇంకా దాని ప్రకంపనలు మాత్రం ఆగడం లేదు. ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న పలు పరిణామాలపై అధికార, విపక్ష పార్టీల మధ్య కోల్డ్‌ వార్‌ సాగుతోంది. దీంతో ఈ వ్యవహారం కాస్తా కేంద్రం దృష్టికీ వెళ్లింది. ఇటు రాష్ట్రంలోనూ విచారణల పర్వం కొనసాగుతోంది. అటు హైకోర్టులో బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ దాఖలు చేసిన కేసుపై రేపోమాపో విచారణ జరగబోతోంది. దీంతో తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులోపే అనూహ్య పరిణామాలు తప్పేలా లేవు.

 తిరుపతిపై రోజుకో రచ్చ

తిరుపతిపై రోజుకో రచ్చ


తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్‌ శాతం తగ్గుతుందన్న అనుమానాల నేపథ్యంలో భారీ ఎత్తున నకిలీ ఓటర్లన పార్టీలు తిరుపతికి తరలించడంతో మొదలైన ఈ రచ్చ.. ఆ తర్వాత వారిని బీజేపీ, టీడీపీ అభ్యర్ధులు స్వయంగా పట్టుకోవడం వరకూ వెళ్లాయి. దీనిపై ఏపీ పోలీసులు కానీ, ఎన్నికల ప్రధానాధికారి కానీ స్పందించకపోవడం విశేషం. అసలేమీ జరగనట్లుగా వీరు నటిస్తున్నా అటు హైకోర్టులో కేసుతో పాటు కేంద్రానికీ ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో అధికార పార్టీ కూడా విపక్షాలను టార్గెట్‌ చేసి డిఫెన్స్‌లోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది.

నకిలీ ఓట్లపై ఎన్ఐఏ దర్యాప్తు కోరిన రఘురామ

నకిలీ ఓట్లపై ఎన్ఐఏ దర్యాప్తు కోరిన రఘురామ


తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా విచ్చలవిడిగా బయటపడిన నకిలీ ఓట్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అదీ నేరుగా బీజేపీ, టీడీపీ అభ్య్రర్ధులు నేరుగా నకిలీ ఓటర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా అక్కడ ఏమీ జరగనట్లుగా పోలీసులు, ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ వ్యవహరించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇదే క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ)తో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. ఇందులో బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ స్వయంగా దొంగ ఓట్లు పట్టుకున్న వ్యవహారాన్ని ప్రస్తావించారు.

నకిలీ ఓట్లపై హైకోర్టు విచారణ

నకిలీ ఓట్లపై హైకోర్టు విచారణ

అటు తిరుపతి పోలింగ్ సందర్భంగా నకిలీ ఓట్లను స్వయంగా పట్టుకున్న బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ వీటిపై తాను స్వయంగా ఫిర్యాదు చేసినా స్ధానిక పోలీసులు కానీ, ఎన్నికల ప్రధానాధికారి కానీ స్పందించకపోవడంపై హైకోర్టును ఆశ్రయించారు. తిరుపతికి భారీ ఎత్తున నకిలీ ఓటర్లను తరలించిన విధానంపైనా ఆమె హైకోర్టుకు ఆధారాలు సమర్పించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ లేదా సోమవారం విచారణ జరిపే అవకాశముంది. తన పిటిషన్‌లో ఉపఎన్నిక రద్దు చేసి రీపోలింగ్‌ పెట్టాలని రత్నప్రభ కోరారు. దీంతో ఈ వ్యవహారంలో హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది.

సైబర్ క్రైమ్‌తో వైసీపీ సర్కార్‌ కౌంటర్‌

సైబర్ క్రైమ్‌తో వైసీపీ సర్కార్‌ కౌంటర్‌

తిరుపతి ఉపఎన్నికలో నకిలీ ఓట్ల వ్యవహారం కాస్తా రచ్చ రేపుతున్న నేపథ్యంలో అధికార వైసీపీ విపక్షాలపై కౌంటర్‌ అటాక్‌కు దిగింది. విపక్షాలను డిఫెన్స్‌లోకి నెట్టేందుకు ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్ధి గురుమూర్తిపై వారు పెట్టిన సోషల్‌ మీడియా పోస్టులపై సైబర్‌ క్రైమ్‌తో విచారణ చేయిస్తోంది. ఇప్పటికే ఓసారి టిడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీటికి టీడీపీ స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈసారి స్పందించకపోతే అరెస్టుల వరకూ వెళ్లే అవకాశాలున్నాయి. అదే జరిగితే తిరుపతి ఉపఎెన్నికపై రచ్చ మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
tirupati bypoll tremours continues even six days after polling as ysrcp rebel mp raghurama krishnam raju seek nia inquiry on fake votes and ap cyber crime probe continues on tdp leaders postings on social media against ysrcp candidate gurumurthy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X