• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూ

|

పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అనుబంధ సంస్థలో ఉద్యోగం చేస్తూ.. ఆదర్శ పురుషుడిలా ప్రేమ వివాహం చేసుకున్న ఆ వ్యక్తి.. నాలుగు నెలలు తిరిగేలోపే తన అసలు రంగును బయటపెట్టుకున్నాడు. అదనపు కట్నం కోసం భార్యను తీవ్రంగా వేధించగా, ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందన్న ఆక్రోషంతో తాళి కట్టిన భార్యను వేశ్యగా చిత్రీకరించాడు. భార్య అందాలే పెట్టుబడిగా ఆన్ లైన్ లో వ్యాపారం ప్రారంభించాడు. ఓయో రూములో ఆమెను కలవాలంటే గంటకు రూ.3వేలు చెల్లించాలంటూ వాట్సాప్ గ్రూపుల్లో భార్య నగ్న చిత్రాలను షేర్ చేశాడు. తిరుపతిలో సంచలనం రేపిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..

రామతీర్థం విధ్వంసం: మరో సంచలనం -జగన్‌పై మోదీకి వైసీపీ ఎంపీ ఫిర్యాదు -కేంద్ర బృందాలురామతీర్థం విధ్వంసం: మరో సంచలనం -జగన్‌పై మోదీకి వైసీపీ ఎంపీ ఫిర్యాదు -కేంద్ర బృందాలు

టీటీడీ కాలేజీలో ఉద్యోగి..

టీటీడీ కాలేజీలో ఉద్యోగి..

చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని తిమ్మనాయుడుపాలెంకు చెందిన రేవంత్‌కుమార్‌.. టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్‌జీఎస్‌ కాలేజీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 13న పలమనేరుకు చెందిన ఓ యువతిని అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పేరుకు ప్రేమ పెళ్లే అయినా, కూతురు బాగుండాలనే ఉద్దేశంతో ఆమె తల్లిదండ్రులు రూ. 10 లక్షల విలువైన బంగారం, రూ. 10 లక్షల నగదును కట్నంగా రేవంత్ కు చదివించుకున్నారు. పైకి ఆదర్శవంతుడిగా బిల్డప్ ఇచ్చే రేవంత్.. ఇంట్లో మాత్రం రాక్షసుడిగా ప్రవర్తించేవాడు. పెళ్లి జరిగిన మూడు రోజుల నుంచే భార్యకు నరకం చూపించడం మొదలుపెట్టాడు..

భార్య ఉండగానే మరో మహిళతో..

భార్య ఉండగానే మరో మహిళతో..

బాబు బంగారం అనే ఇమేజ్ కోసమే ప్రేమ వివాహం చేసుకున్న రేవంత్.. భార్యను ప్రతిరోజూ బెల్టుతో కొట్టడం, కాల్చడం లాంటి కీచక చర్యలకు పాల్పడుతూ పైశాచికానందం పొందేవాడు. అదనపు కట్నం, బంగారం తీసుకురావాలని తీవ్రంగా వేధించేవాడు. భార్యతో సంసారం చేయడం ఇష్టం లేదని, లైంగికపరంగా ఆమెను అవమానిస్తూ, మరో మహిళతో వివాహేతర సంబంధం నెరిపేవాడు రేవంత్. భార్య ఇంట్లోనే ఉన్నప్పటికీ... నగదు, నగలతో ఆమె ఎవరితోనో వెళ్లిపోయిందంటూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. ఈ క్రమంలో..

భార్య నగ్న ఫోటోలతో వ్యాపారం..

భార్య నగ్న ఫోటోలతో వ్యాపారం..

రేవంత్ కుమార్ వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో ఇక తట్టుకోలేక ఆ బాధిత మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంటికి తిరిగి రావాల్సిందిగా రేవంత్ అడిగినా ఆమె నో చెప్పింది. దీంతో ఉన్మాదిలా మారిపోయిన రేవంత్.. భార్యతో పడక గదిలో ఉన్న ఫొటోలను, ఆమె నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. ఆమెనొక కాల్‌గర్ల్‌గా చిత్రీకరించాడు. ఓయో రూములో ఆమెను కలవాలంటూ గంటకు రూ.3వేలు ఖర్చవుతుందని వ్యాపార ప్రకటన తరహాలో నీచానికి దిగాడు. ఈ విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకున్న భార్య.. బుధవారం భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది.

పోలీసుల సాయంతో రేవంత్ వేషాలు..

పోలీసుల సాయంతో రేవంత్ వేషాలు..

ప్రేమ పెళ్లి చేసుకుని, తనను అడుగడుగునా అవమానించిన భర్త రేవంత్‌ను కఠినంగా శిక్షించాలని బాధిత డిమాండ్‌ చేస్తోంది. గతంలో గర్భిణిగా ఉన్నప్పుడు కడుపులో బిడ్డకు లింగనిర్ధారణ పరీక్షలు చేయించి గర్భాన్ని తీయించాడని ఆమె ఆరోపించింది. గతంలో ఓసారి తిరుపతిలోని ‘దిశ' పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం రాలేదని, పోలీసు శాఖలో రేవంత్ బంధువులు, తెలిసినవాళ్లు తన ఫిర్యాదును తొక్కిపట్టేశారని, ఎఫ్ఐఆర్ లో కూడా తాను చెప్పిన అంశాలు కాకుండా రేవంత్ వెర్షన్ ను నమోదు చేసుకున్నారని బాధితురాలు ఆరోపించింది. ఐతే భార్య వస్తున్న విషయాన్ని ముందుగానే పసిగట్టిన రేవంత్ ఇంటికి తాళం వేసి పరారైనట్లు తెలుస్తోంది.

 శాడిస్టు భర్త ఆడియో కలకలం..

శాడిస్టు భర్త ఆడియో కలకలం..

‘‘నన్ను కాదని వెళ్లిపోయిన నీకు ఏ గతి పట్టిస్తానో చూడు.. నీకు రేటు కూడా ఫిక్స్ చేశాను.. గంటకు రూ.3 వేల చోప్పున ఓయో రూములో పడు..టావని మెసేజ్ లు పెట్టాను. నా పంతం ఎలాంటిదో చూస్తావుగా..'' అంటూ శాడిస్టు భర్త రేవంత్ తన భార్య, బంధువులతో ఫోన్లో మాట్లాడిన ఆడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అయింది. కాగా, పోలీసులు మాత్రం దర్యాప్తు సజావుగానే సాగుతొందని అంటున్నారు. రేవంత్ పై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. విచారణ జరిపి తప్పు చేసిన వారిని శిక్షిస్తామన్నారు.

సీఎం కేసీఆర్ మరో భారీ బాంబు -ఉద్యోగుల దిమ్మతిరిగేలా న్యూ ఇయర్ గిఫ్ట్ -లాక్‌డౌన్ నష్టాన్ని భరిస్తూ..సీఎం కేసీఆర్ మరో భారీ బాంబు -ఉద్యోగుల దిమ్మతిరిగేలా న్యూ ఇయర్ గిఫ్ట్ -లాక్‌డౌన్ నష్టాన్ని భరిస్తూ..

English summary
revanth kumar, a resident of thimminaidupalem in tirupati city, booked for harassing wife. the accused allegedly shares wife's nude photos in whatsapp groups and created her as a call girl. victim blames police for not taking action agains sadist husband
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X