తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏడుకొండల వాడికి రూ. 4కోట్ల ‘పెద్ద’ కష్టం: ఆర్బీఐ తీర్చేనా..?

తిరుమల ఏడుకొండ‌ల వాడికి పాత పెద్ద నోట్ల రూపంలో చాలా పెద్ద కష్టమే వచ్చి పడింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించని నేపథ్యంలో నల్ల కుబేరులు తమ వద్ద ఉన్న నల్ల ధనం(పాత పెద్ద నోట

|
Google Oneindia TeluguNews

తిరుప‌తి: తిరుమల ఏడుకొండ‌ల వాడికి పాత పెద్ద నోట్ల రూపంలో చాలా పెద్ద కష్టమే వచ్చి పడింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించని నేపథ్యంలో నల్ల కుబేరులు తమ వద్ద ఉన్న నల్ల ధనం(రద్దయిన పెద్ద నోట్లు)ను భారీ మొత్తంలో హుండీల్లో స‌మ‌ర్పించుకున్నారు.

ప్ర‌భుత్వం విధించిన డిసెంబ‌ర్ 30 డెడ్‌లైన్ త‌ర్వాత ఈ రెండు నెల‌ల్లో శ్రీవారికి రూ.4 కోట్ల విలువైన పాత 500, వెయ్యి నోట్లు రావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్రకారం డెడ్‌లైన్ త‌ర్వాత పాత నోట్లు ప‌ది కంటే ఎక్కువ ఉండ‌కూడ‌దు. దీంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈ పాత నోట్ల‌ను ఏం చేయాలో తెలియ‌క త‌ల ప‌ట్టుకుంది.

Tirupati Temple's Big Problem: Rs. 4 Crore In Old Notes

ఈ నోట్ల‌ను ఏం చేయాలో చెప్పాలంటూ కేంద్ర ప్ర‌భుత్వం, ఆర్బీఐకి లేఖ రాసింది. వారి స్పంద‌న కోసం ఎదురుచూస్తున్న‌ట్లు ఓ టీటీడీ అధికారి వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ 30 డెడ్‌లైన్ త‌ర్వాత దేశం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చే భ‌క్తులు కొత్త నోట్ల‌తోపాటు పాత నోట్లను కూడా హుండీల్లో వేస్తున్నారు.

ఇలా రూ.4 కోట్ల‌కుపైగా పాత నోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ ఈవో సాంబ‌శివ‌రావు వెల్ల‌డించారు. ఆర్బీఐ ఏదైనా సానుకూల నిర్ణయం తీసుకుంటే తప్ప.. తిరుమలకు ఈ పెద్ద కష్టం తీరేట్లు కనిపించడం లేదు.

English summary
The famous hill shrine of Lord Venkateswara in Tirupati in Andhra Pradesh is trapped in a quirky situation of sorts and is now seeking providential assistance for a way out. It has received a whopping four crores in demonetised notes of Rs. 500 and Rs. 1,000 from devotees in the last two months - past the deadline for their exchange.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X