తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జిఎస్టీ ఎఫెక్ట్: టిటిడిపై ఏటా రూ. వంద కోట్ల భారం, లడ్డూపై నో ఎఫెక్ట్

జిఎస్టీ ఎఫెక్ట్ టిటిడిపై పడింది. ధార్మిక సంస్థగా ఉన్న తమను పన్ను నుండి మినహాయించాలని కేంద్రానికి టిటిడి విన్నవించినా ఫలితం లేకపోయింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుపతి: జిఎస్టీ ఎఫెక్ట్ టిటిడిపై పడింది. ధార్మిక సంస్థగా ఉన్న తమను పన్ను నుండి మినహాయించాలని కేంద్రానికి టిటిడి విన్నవించినా ఫలితం లేకపోయింది. జిఎస్టీ ఎఫెక్ట్ కారణంగా ప్రతి ఏటా టిటిడిపై వందకోట్ల రూపాయాల భారం పడే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. అయితే లడ్డూలు మాత్రం జిఎస్టీ ఎఫెక్ట్ పరిధిలోకి రావు. దీంతో తిరుపతి లడ్డూలు ఇక పాత ధరలకే లభ్యం కానున్నాయి.

దేశవ్యాప్తంగా ఓకే పన్ను విధానం అమలుచేసే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని అమలు చేసింది. రెండు రోజుల క్రితం పార్లమెంట్ సెంట్రల్ హల్ లో జిఎస్టీని రాస్ట్రపతి, ప్రధానమంత్రి మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

జిఎస్టీ అమలు వల్ల అంతగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయాన్ని కాంగ్రెస్, వామపక్షాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే జిఎస్టీని అమలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని కేంద్రం ప్రకటించింది.

Recommended Video

అయితే ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విధానం అమల్లోకి వచ్చినందున అసలు ఏ రకమైన లాభ, నష్టాలున్నాయనే విషయమై ఆచరణలో స్పష్టం కానుంది.

అయితే జిఎస్టీ నుండి తమను మినహయించాలని టిటిడి కేంద్రాన్ని కోరుతోంది. దీని కారణంగా ఏటా కోట్లాది రూపాయాల భారం టిటిడి పై పడనుంది.సేవా థృక్పథంతో వ్యవహరిస్తున్నందున మినహయింపులు ఇవ్వాలని కేంద్రాన్ని ఆర్థిస్తోంది టిటిడి.

ఏటా వంద కోట్లు అదనంగా టిటిడిపై భారం

ఏటా వంద కోట్లు అదనంగా టిటిడిపై భారం

జిఎస్టీ అమలు తర్వాత ప్రతిఏటా టిటిడిపై వంద కోట్ల భారం పడనుంది. తాజాగా జిఎస్టీ అమలు చేయడం వల్ల టిటిడి అధికారుల అంచనా మేరకు వంద కోట్ల భారం పడనుందని అధికారులు భావిస్తున్నారు. జిఎస్టీ పరిధిలోకి వచ్చే వస్తువుల ధరలు పెరగడం వల్ల టిటిడిపై ఈ భారం పడనుంది. అయితే తాము వ్యాపారం చేయడం లేదని సేవాభావంతో పనిచేస్తున్నందున జిఎస్టీని తమకు మినహయించాలని టిటిడి కేంద్రాన్ని కోరింది. కానీ, ఈ విషయమై కేంద్రం మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

వ్యాట్ పరిధిలోకి రాని టిటిడి

వ్యాట్ పరిధిలోకి రాని టిటిడి

తిరుమల దేవస్థానం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.కానీ, వ్యాపార థృక్పథంతో పనిచేయడం లేదు. ఈ విషయమై పన్ను చెల్లింపు విషయంలో టిటిడికి ఏపీ ప్రభుత్వం కొన్ని మినహయింపులను ఇచ్చింది. దీంతోనే ఇప్పటివరకు టిటిడి పన్ను పరిధిలోకి రాకుండా ఉంది. తాజాగా జిఎస్టీని అమలు చేయడం వల్ల టిటిడి ఇక నుండి పన్నులు చెల్లించాల్సిన పరిస్థితులు అనివార్యంగా మారాయి.అన్నదానం కోసం ఉపయోగించే బియ్యం, పప్పు ధాన్యాలు, శనగలను వ్యాట్ నుండి మినహయించారు.దీంతో వ్యాట్ పరిధిలోకి టిటిడి రాలేదు. మరో వైపు శనగలను జిఎస్టీ నుండి మినహయించడంతో లడ్డూలపై భారం పడదు.

అద్దె గదులను రెస్ట్ హౌజ్ లుగా మార్చాలి

అద్దె గదులను రెస్ట్ హౌజ్ లుగా మార్చాలి

తిరుమలకు ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు దైవదర్శనం కోసం వస్తుంటారు. వారు స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తారు.అయితే స్వామివారిని దర్శనం చేసుకొనేందుకుగాను గదుల్లో ఉంటారు.అయితే భక్తుల కోసం అద్దె గదులున్నాయి.అయితే కొన్ని గదుల్లో ఉచితంగానే భక్తులకు కేటాయిస్తారు. మరికొన్ని గదులను నామమాత్రపు ధరలకు అద్దెకు కేటాయిస్తారు. అయితే వీటిని జిఎస్టీ పరిధిలోకి రానున్నాయి. అయితే అద్దెగదులను రెస్ట్ హౌజ్ లుగా మార్చితే ఇబ్బందులుండవు. జిఎస్టీని మినహయించవచ్చని కేంద్రాన్ని టిటిడి కోరింది. కానీ, జిఎస్టీ కౌన్సిల్ నుండి స్పందన లేకపోయింది.

తలనీలాలు, సుగంధ ద్రవ్యాలపై పన్ను

తలనీలాలు, సుగంధ ద్రవ్యాలపై పన్ను

తలనీలాల విక్రయం ద్వారా ప్రతిఏటా టిటిడికి 150 కోట్ల ఆదాయం వస్తోంది. అయితే జిఎస్టీ పరిధిలోకి రావడం వల్ల దీనికి పన్ను చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.నిత్యపూజల్లో సుగంధ ద్రవ్యాల్లో 5 శాతం పన్ను చెల్లించాల్సి న పరిస్థితి నెలకొంది. నెయ్యి, డ్రైఫ్రూట్స్ ను టిటిడి వాడుతోంది. అయితే వీటిపై జిఎస్టీ భారం అదనంగా మారనుంది. అంతేకాదు టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించే ఆసుపత్రులపై మందుల కొనుగోలు భారం కూడ టిటిడిపై పడే అవకాశం లేకపోలేదు.

English summary
The impact of GST was felt in the temple cities of Tirumala and Tirupati. Lord Venkateswara, the richest deity in world, attracts crores of tourists every year and the GST slabs will adversely affect pilgrims coming to Tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X