వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీఆర్సీ నుండి నారా లోకేశ్ బహిష్కరణ..! వైసీపీ నేతల సంచలన నిర్ణయం : సీఎంపై వ్యాఖ్యల ఎఫెక్ట్..!

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి నారా లోకేశ్ ను వైసీపీ వెంటాడుతోంది. కొద్ది రోజులు క్రితం స్పీకర్ కు ఆయన రాసిన లేఖలో స్పీకర్ ఛైర్ ను కించ పరిచేలా లోకేశ్ వ్యవహరించారంటూ వైసీపీ నేతలు స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసారు. ఇప్పుడు, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ హోదాలో గుంటూరు జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో పాల్గొనే అవకాశం లేకుండా డీఆర్సీ తీర్మానం చేసింది. ఆయనను ఈ సమావేశాలకు రాకుండా బహిష్కరిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ పైన ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమావేశంలో ప్రకటించారు. అయితే ఈ రకమైన నిర్ణయం న్యాయ పరంగా చెల్లుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వేరే వారికి పుట్టిన బిడ్డకు..: వైఎస్ జగన్ కు నారా లోకేష్ చురకలు

లోకేశ్ పైన బహిష్కరణ వేటు...

లోకేశ్ పైన బహిష్కరణ వేటు...

టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ పైన గుంటూరు జిల్లా వైసీపీ నేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోకేష్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గుంటూరు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తారంటూ గతంలోనే లేఖ ఇచ్చారు. దీంతో..జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అధ్యక్షతన నిర్వహించే జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు.. ఎంపీలు..ఎమ్మెల్సీలు..ఎమ్మెల్యేలు..ప్రజా ప్రతినిధులు హాజరవుతారు. అయితే, శనివారం ఈ సమావేశంలో అధికార వైసీపీకి చెందిన నేతలు అనూహ్య రీతిలో ఒక తీర్మానం ప్రతిపాదించి..మెజార్టీ ఉండటంతో ఆమోదించారు. అందులో డీఆర్సీ సమావేశానికి హాజరు కాకుండా ఎమ్మెల్సీగా ఉన్న లోకేశ్ పైన బహిష్కరణ వేటు వేస్తూ ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది.

సీఎం పైన వ్యాఖ్యల ఫలితమే..

సీఎం పైన వ్యాఖ్యల ఫలితమే..

నారా లోకేష్ మీద ఇటువంటి అనూహ్య నిర్ణయం తీసుకోవటం వెనుక వైసీపీ నేతలు విచిత్ర వాదన తెర మీదకు తెచ్చారు. లోకేష్ తాజాగా సీఎం జగన్‌ ఓ సైకో అంటూ చేసిన వ్యాఖ్యలపైన సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. డీఆర్సీ సభ్యుడిగా ఉన్న లోకేష్‌ను సమావేశాలకు రాకుండా బహిష్కరించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. డీఆర్సీ నుంచి బహిష్కరించేందుకు మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో లోకేష్‌పై బహిష్కరణ వేటుపడినట్లుగా ప్రకటించారు. ఆ సమయంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రంగనాథ్‌రాజు తో పాటుగా జిల్లా అక్కడే ఉన్నారు. అయితే, అసలు ఈ రకమైన తీర్మానం చేసి..ఎమ్మెల్సీ సమావేశాలకు హాజకు కాకుండా నిర్ణయించే అధికారాల పైన ఇప్పుడు టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు.

అసెంబ్లీలోనూ ఫిర్యాదు ఇలా..

అసెంబ్లీలోనూ ఫిర్యాదు ఇలా..

లోకేశ్ మీద తాజాగా వైసీపీ శాసనసభ పక్షం స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. స్పీకర్ తమ్మినేని సీతారాం అగ్రిగోల్డ్ లో అవకతవకల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. దీనికి స్పందనగా ఎమ్మెల్సీ లోకేశ్ ఆయనకు లేఖ రాసారు. ఆ లేఖలో స్పీకర్ స్థాయిని తగ్గించే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేసారు. ఆయనతో సహా.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు..మాజీ విప్ కూన రవి కుమార్ పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, ఇప్పుడు ఏకంగా డిఆర్సీ సమావేశాల నుండే లోకేశ్ ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో తాజాగా జరిగిన ఎన్నికల్లో మూడు లోక్ సభ స్థానాల్లో రెండు స్థానాలు వైసీపీ గెలుచుకుంది. అదే విధంగా మొత్తంగా 17 అసెంబ్లీ స్థానాల్ల రెండు మాత్రమే టీడీపీ గెలవగా.. 15 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. దీంతో.. డీఆర్సీ సమావేశంలో వైసీపీకి సంఖ్యా బలం ఏకపక్షంగా ఉంది. ఇప్పుడు లోకేశ్ బహిష్కరణ నిర్ణయం పైన టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.


English summary
Guntur DRC memebers unanimously passed reolution that expelled nara Lokesh form DRC. Due to Lokesh comments on CM Jagan YCP Mla's proposed this resolution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X