వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్య: నొచ్చుకున్న రోశయ్య, పరువునష్టం దావా

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు గవర్నర్ గవర్నర్ కొణిజేటి రోశయయ్ బుధవారం నాడు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇళంగోవన్ పైన పరువు నష్టం దావా వేశారు. ఓ ప్రాంతీయ టీవీ షోలో తన పైన చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన కేసు వేశారు.

మద్రాసు హైకోర్టులో ఈ పరువు నష్టం దావా వేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంఎల్ జెగన్ వివరించారు. విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతుల నియమానికి సంబంధించి ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చిన ముడుపులను రోశయ్య తీసుకున్నారని ఇళంగోవన్ గత ఏడాది ఆరోపించారు.

 TN Governor K Rosaiah files defamation case against Elangovan

ఒక్కో వైస్ ఛాన్సులర్ పోస్టుకు పదిహేను కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. అందులో పది కోట్ల రూపాయలు జయలలితకు వచ్చి, ఐదు కోట్లు గవర్నర్ తన వద్దే ఉంచుకున్నారని ఆరోపించారని తెలుస్తోంది. ఈ సంచలన వ్యాఖ్యలపై రోశయ్య నొచ్చుకున్నారు. తన న్యాయవాది ద్వారా దావా వేశారు.

ఓ ప్రాంతీయ టీవీ ఛానల్‌కు ఇళంగోవన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు అవాస్తవమని, ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు అపకీర్తి తెచ్చేలా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆయన పైన పరువు నష్టం దావా వేసినట్లు చెప్పారు.

English summary
Tamil Nadu governor K Rosaiah on Wednesday filed a defamation case against EVKS Elangovan for his remarks made in a TV show in a regional channel, according to report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X