వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి బంద్ : వైసిపి..జ‌న‌సేన దూరం, ఉద్యోగ‌-ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు: హోదా కోస‌మే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

On Special Status Implementation Demand Hoda Sadhana Samithi Called For AP Bandh | Oneindia Telugu

ఏపికి ప్ర‌త్యేక హోదా అమ‌లు డిమాండ్ చేస్తూ ఏపి బంద్ ప్రారంభ‌మైంది. కేంద్రం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టే రోజున కేంద్ర తీరుకు నిర‌స‌న‌గా ఢిల్లీకి సెగ‌లు తాకేలా ఏపి బంద్ నిర్వ‌హించాల‌ని ప్ర‌జా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ఉద్యోగ - ప్ర‌జా సంఘాలు మ‌ద్ద‌తు ప‌లికాయి. వైసిపి..జ‌న‌సేన‌..బిజెపి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించాయి.

హోదా కోసం రోడ్డెక్కిన సంఘాలు..
రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ రాజ్య‌స‌భ వేదిక‌గా ఏపికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ హోదా నిర్ణ‌యాన్ని అమ‌లు చేయాల‌ని..విభజన చట్టంలోని హామీలు అమలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ సాధన సమితి పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. ఈ బంద్‌కు తెదేపా, కాంగ్రెస్‌, వామపక్షాలతో పాటు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్‌కు సంఘీభావంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరుకానున్నారు.

To day AP Bandh : Demanding Special Status

లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ప్రైవేటు పాఠశాల, కళాశాల సంఘాలు కూడా బంద్‌కు సంఘీభావం తెలిపాయి. బంద్‌ సందర్భంగా జరిగే ర్యాలీలు, నిరసన ప్రదర్శనల్లో తెదేపా నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొంటారు. ఉద్యోగులు కూడా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్నట్లు అమరావతి ఉద్యోగ ఐకాస అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఏపీఎన్‌జీవో సంఘం బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

వైసిపి..జ‌న‌సేన దూరం..
ఏపి బంద్ కు భాజపా, వైకాపా, జనసేన దూరంగా ఉండనున్నాయి. తెదేపా మద్దతు తెలిపే బంద్‌లలో తాము పాల్గొనే ది లేదని వైకాపా ఇప్పటికే సష్టం చేసింది. అత్యవసరమైతే తప్ప బంద్‌లో పాల్గొనకూడదనేది తమ పార్టీ విధానమని, ఈ బంద్‌లో తాము పాల్గొనడం లేదని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. బంద్‌ దృష్ట్యా శుక్రవారం జరగాల్సిన ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షను వాయిదా వేసినట్లు ఇంటర్‌ బోర్టు కార్యదర్శి ఉదయలక్ష్మి తెలిపారు. వాయిదా వేసిన పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు. రెండో తేదీనుంచి షెడ్యూల్‌ ఉన్న ప్రకారమే పరీక్షలు జరుగుతాయి. ఏయూ పరిధిలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. విజ‌య‌వాడ లో జ‌రిగే నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో హోదా స‌మితి నేత‌లు.. రాజ‌కీయ‌ల పార్టీల నాయ‌కులు పాల్గొంటున్నారు. ఇదే స‌మ‌యంలో..శుక్ర‌వారం నుండి ఈ నెల 12 వ తేదీ వ‌ర‌కు నిర‌స‌న‌లు కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. 11న ఢిల్లీలో ముఖ్య‌మంత్రి నాయ‌క‌త్వంలో నిర‌స‌న దీక్ష చేప‌ట్ట‌నున్నారు. 12 న రాష్ట్రప‌తిని క‌లవాల‌ని నిర్ణ‌యించారు.

English summary
On Special Status implementation Demand Hoda sadhana Samithi called for AP Bandh. YCP, Jansena, Bjp note supporting this Bandh call. Emplloyees associations supporting this bandh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X