వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీని అక్కడా కొడదాం: చంద్రబాబు సరికొత్త వ్యూహాలు! దానికి కాంగ్రెస్ మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నీతి అయోగ్ భేటీలో తొలిసారి ముఖాముఖిగా కలుసుకోబోతున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సహా పలు అంశాలపై ప్రధానిని నిలదీసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. మరోవైపు, కేంద్రంపై ఇతర ప్రాంతీయ పార్టీలు, బీజేపీయేతర సీఎంలతో వ్యూహాలు రచిస్తున్నారు.

ఇందులో భాగంగా వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరాయి విజయన్, కర్ణాటక సీఎం కుమారస్వామిలతో కలిసి ఆయన అడుగులు వేస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు తమ ఐక్యతను చాటేందుకు త్వరలో జరిగే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికను ఒక అవకాశంగా మార్చుకోవాలని నిర్ణయించాయి.

విపక్షాల అభ్యర్థి గెలిచినా, గెలవకపోయినా బీజేపీ గెలుపు తేలిక కాదు

విపక్షాల అభ్యర్థి గెలిచినా, గెలవకపోయినా బీజేపీ గెలుపు తేలిక కాదు

ఢిల్లీలో శనివారం జరిగిన 4గురు సీఎంల ఆంతరంగిక సమావేశంలో ఈ అభిప్రాయానికి వచ్చారు. ఆ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిస్తే గట్టి పోటీ ఇవ్వగలమని, అన్నీ కలిసొస్తే ఎన్డీయే అభ్యర్థిని ఓడించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఆ ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి గెలిచినా గెలవకపోయినా బీజేపీకి మాత్రం అంత తేలిగ్గా గెలుపు లభించకుండా చూడాలన్న నిర్ణయానికి వచ్చారు.

యూపీఏ, ఎన్డీయేలలో లేని పార్టీల ఏకీకరణ కోసం అడుగులు

యూపీఏ, ఎన్డీయేలలో లేని పార్టీల ఏకీకరణ కోసం అడుగులు

శనివారం రాత్రి నలుగురు సీఎంలు ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదివారం జరిగే నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చించారు. భావసారూప్యం కలిగిన నాయకులంతా ఏకతాటి పైకి వచ్చామని, తమలో ఎవరికి ఇబ్బంది వచ్చినా సంఘటితంగా కదులుతామని వారు చెప్పకనే చెప్పారు. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపారు. ఎన్డీయే, యూపీయేలలో లేని పార్టీల ఏకీకరణ దిశగా వారు అడుగులు వేస్తున్నారు.

ఆ భేటీకి శనివారం నాటి భేటీ కొనసాగింపు

ఆ భేటీకి శనివారం నాటి భేటీ కొనసాగింపు


ఇటీవల కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో చంద్రబాబు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, వామపక్ష పార్టీల నాయకులతోను సమావేశమయ్యారు. ఎన్డీయే, యూపీయే కూటమిలో లేని ప్రాంతీయ పార్టీల మధ్య బంధం బలోపేతం చేసి, అందర్నీ ఒక తాటిపై నడిపించేందుకు చంద్రబాబు చొరవ తీసుకోవాలని నాడు మమత, మాయావతి సహా పలువురు నాయకులు కోరారు. దానికి ఆయనా అంగీకరించారు. ఆ ప్రయత్నాలకు శనివారం నాటి భేటీ కొనసాగింపుగా భావించవచ్చు.

 రెండు వ్యూహాలు.. దానికి కాంగ్రెస్ మద్దతు

రెండు వ్యూహాలు.. దానికి కాంగ్రెస్ మద్దతు


కేంద్రంతో ప్రత్యక్ష పోరాటం విభజన చట్టంలోని అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేసిందని చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్రంతో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. ఆ ప్రయత్నంలో భాగంగానే భావసారూప్యంగల పార్టీల్ని సంఘటితం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నీతి ఆయోగ్‌ సమావేశం రాజకీయాలకు అతీతంగా జరిగేదైనప్పటికీ దానికో రాజకీయ ప్రాధాన్యం తెస్తున్నారు. ఢిల్లీ వెళ్లడానికి ముందే తమతో కలసి వచ్చే సీఎంలతో మాట్లాడారు. ఆయన ద్విముఖ వ్యూహంతో ఢిల్లీకి వెళ్లారు. విభజన హామీల అమలుపై రాష్ట్రానికి జరిగిన అన్యాయంతో పాటు, మోడీ ప్రభుత్వ వైఫల్యాలు, దేశవ్యాప్తంగా నెలకొన్న సమస్యల్ని నీతి ఆయోగ్ సమావేశంలో ఎండగట్టడంమొదటి వ్యూహం. దీనికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంల మద్దతూ తీసుకోనున్నారు. రెండోది ఎన్డీయే, యూపీయే కూటమిలో లేని పార్టీల్ని సంఘటితం చేయడం. రెండో వ్యూహంలో భాగంగా సీఎంల భేటీ జరిగింది.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu to raise special status issue during Niti Aayog meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X