వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో టెన్త్ పరీక్షలు నిలిపివేయండి, విద్యార్థులను ప్రమోట్ చేయండి: తులసీరెడ్డి

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విజృంభించడంతో ఇప్పటికే కేజీ నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్ చేశారు. కానీ పదో తరగతి పరీక్షలను మాత్రం నిర్వహిస్తామని ప్రకటించారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న తనేపథ్యంలో.. టెన్త్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. అందరూ విద్యార్థులను ప్రమోట్ చేసింది. ఇదే బాటన తమిళనాడు కూడా పయనించింది. ఇప్పుడు ఏపీలో కూడా పరీక్షలు నిర్వహించొద్దని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

కరోనా విషయంలో మా ఆదేశాలు పాటించరా?: తెలంగాణ సర్కారుకు హైకోర్టు తీవ్ర హెచ్చరికకరోనా విషయంలో మా ఆదేశాలు పాటించరా?: తెలంగాణ సర్కారుకు హైకోర్టు తీవ్ర హెచ్చరిక

పరీక్షల కన్న పిల్లల ప్రాణాలే ముఖ్యమని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రస్తావించారు. తెలంగాణ మాదిరిగా ఏపీలో పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని కోరారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గడం లేదు అని.. అందుకు పరీక్షలను నిలిపివేసి.. విద్యార్థులను ప్రమోట్ చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు.

to promote ssc students in inter: tulasi reddy

Recommended Video

Cancel Exams : Telangana, Andhra Students Demand Cancellation Of Exams

అగ్రవర్ణాలలో ఉండే పేదలకు విద్యా, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్ కల్పిచాలని కోరారు. రిజర్వేషన్లపై ఈడబ్ల్యూఎస్ కల్పిస్తూ పార్లమెంట్ 103వ సవరణ చేశారని గుర్తుచేశారు. దీనిని కేంద్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగాల్లో గతేడాది జనవరి 14వ తేదీ నుంచి అమలు చేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం విద్యారంగంలో అమలు చేస్తుందని.. కానీ ఉద్యోగ నియామకాల్లో మాత్రం చేయడం లేదన్నారు. దీనిపై వెంటనే జీవో ఇవ్వాలని.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

English summary
to promote ssc students in intermediate appcc working president tulasi reddy ask andhra pradesh government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X