వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయన ఇక్కడ...ఈయన అక్కడ...ఎపిలో నేటి రాజకీయ విచిత్రం...

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు ఒక చిత్రం చోటు చేసుకుంది. ఒకరకంగా 2018 నూతన సంవత్సరం ఆరంభంలో ఇదే తొలి రాజకీయ విచిత్రం గా అభివర్ణించవచ్చు...అదేమిటంటే...

ఎపి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయన ప్రత్యర్థి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు లో సాగుతుంటే మరోవైపు సిఎం చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమం కోసం ప్రతిపక్ష నేత జగన్ స్వస్థలం పులివెందుల లోఅడుగుపెట్టారు.
ఇక్కడ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు వైఫల్యాలను జగన్ ఎండగడుతుంటే, అక్కడ పులివెందులలో జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శనాస్త్రాలను సంధించారు.

అక్కడ సిఎం చంద్రబాబు...

అక్కడ సిఎం చంద్రబాబు...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గా ఉండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల, కడప జిల్లాలకు చెయ్యలేని పనులను తాను చేస్తున్నానని అన్నారు. 2019లో పులివెందులలో టిడిపి గెలవాలనే ధ్యేయంతో చంద్రబాబు ఇటీవల కాలంలో కడప జిల్లాలో తన పర్యటనల సంఖ్యను పెంచినట్లు తెలుస్తోంది.

పులివెందులలో చంద్రబాబు...

పులివెందులలో చంద్రబాబు...

ఒకవైపు జగన్ చిత్తూరు జిల్లా ప్రజాసంకల్ప యాత్రలో చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో సిఎం చంద్రబాబు ప్రతిపక్షనేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు వచ్చి తాను చేస్తున్నఅభివృద్ధి గురించి వివరించి చెప్పడం ఒక విశేషం గా చెప్పుకోవచ్చు. చంద్రబాబు పులివెందులలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి హాజరయ్యారు.

సిఎం సొంత జిల్లాలో జగన్...

సిఎం సొంత జిల్లాలో జగన్...

ఇక ఇక్కడ ప్రతిపక్షనేత జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు 51వ రోజుకి చేరుకుంది. బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా జమ్మిలవారిపల్లి నుంచి వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభించారు. తెలుగుదేశం వైఫల్యాలను, ప్రజలకు జరుగుతున్నఅన్యాయాలను విమర్శించడమే ఆయన తన ప్రజాసంకల్పయాత్రలో ప్రధాన ఎజండాగా పెట్టుకున్నారు. అలాగే జగన్ తాను ముఖ్యమంత్రి అయితే ఏమి చేస్తాడో ఆ కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. సిఎం సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమి చేయలేదని, అందుకే తన యాత్రకు ప్రజల వివరీతంగా వస్తున్నారని, వారంతా మార్పు కోరుతున్నారని జగన్ చెప్పుకొస్తున్నారు.

ఇదే నేటి రాజకీయ విచిత్రం...

ఇదే నేటి రాజకీయ విచిత్రం...

ఒకవైపు ప్రతిపక్షనేత ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఆయన మీద తీవ్ర విమర్శలు చేస్తుండటం, అదే సమయంలో మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షనేత జగన్ సొంత నియోజకవర్గంలో పర్యటించి జగన్ పై విమర్శలు గుప్పించడం ఒకే రోజు చోటు చేసుకోవడం ఇక చిత్రమైతే అవి రెండు కొత్త సంవత్సరం ఆరంభంలోనే చోటు చేసుకోవడం మరో విచిత్రంగా అభివర్ణించవచ్చు.

English summary
Today one strange incident happened in Andhra Pradesh politics. This is the first political peculiar incident happened in the New Year 2018 starting time ... one side AP opposition leader Jagan Mohan Reddy padayatra and another side his rival Chief Minister Chandrababu Naidu is in jagan's homeland in Pulivendula.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X