వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూత్ ఓట్లు 18 లక్ష‌లు : క‌్యూ లైన్లు లేవు..ఓట‌ర్ల‌ కోసం టోకెన్లు : రాష్ట్రంలో 3.69 కోట్ల ఓట‌ర్లు..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. ఏపిలో మ‌రి కొద్ది రోజుల్లో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కానుంది. దీని కోసం ఎన్నిక‌ల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏపిలో మొత్తంగా 3.69 కోట్ల ఓట‌ర్లు ఉన్న‌ట్లు ఇసి ప్ర‌క‌టించింది. ఈ సారి ఎన్నిక‌ల్లో కొత్త‌గా 18 ల‌క్ష‌ల యువ ఓట‌ర్లు ఉన్న‌ట్లు గుర్తించారు. ఇక‌, పోలింగ్ బూత్ ల‌కోసం నిరీక్షించ‌కుండా కొత్త గా టోకెన్ల‌ను ప్ర‌వేశ పెడుతున్నారు..

కొత్త‌గా యువ‌త ఓట్లు 18 ల‌క్ష‌లు..కానీ.

కొత్త‌గా యువ‌త ఓట్లు 18 ల‌క్ష‌లు..కానీ.

ఏపిలో 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయసు గల యువత 18 లక్షల మంది ఉండ‌గా, వారిలో కేవలం 5.39 లక్షల మంది ఓట ర్లుగా నమోదయినట్లు ఎన్నిక‌లఅధికారులు తేల్చారు.. అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు అవ గాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్న‌ట్లు సీఈవో ద్వివేదీ ప్ర‌క‌టించారు. ఓటర్‌ గుర్తింపు కార్డు ఉంటే సరిపోదని, ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలని చెప్పారు. పేరు లేకపోతే వెంటనే ఓటర్‌గా నమోదు చేసుకోవాలన్నారు.
రాష్ట్రంలో పెన్షన్‌ తీసుకునే దివ్యాంగులు 6.19 లక్షల మంది ఉన్నారని, అయితే ఓటర్లగా 3.29 లక్షల మంది మాత్రమే నమోదయ్యారని గోపాలకృష్ణ ద్వివేదీ చెప్పారు. దివ్యాంగులుగా నమోదు చేయించుకునే వారికి వాహన సౌకర్యం, పో లింగ్‌ బూత్‌ వద్ద వీల్‌ చైర్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తామని, ప్రస్తుత సాధారణ ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులందరి సెల్‌ఫోన్‌ నెంబర్లతో ఒక యాప్‌ని రూపొందిస్తున్నామని చెప్పారు.

క్యూలు ఉండ‌వు..టోకెన్ల ద్వారా..

క్యూలు ఉండ‌వు..టోకెన్ల ద్వారా..

ఈసారి ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్లకు మరిన్ని ఎక్కువ సౌకర్యాలు కల్పించనున్నట్లు ద్వివేదీ తెలిపారు. ఓటింగ్‌ శాతం పెంచడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని 45,920 పోలింగ్‌ కేంద్రాల వద్ద టాయిలెట్స్, కుర్చీలు, వీల్‌ చైర్స్, మంచినీరు వంటి వాటిని అందుబాటులో ఉంచుతామని, ఓటర్లు బారులు తీరకుండా ఓటు వేసే విధంగా టోకెన్‌ విధానం ప్రవేశపెడతామని చెప్పారు. గతంలో మధ్యప్రదేశ్‌లో టోకెన్‌ విధానం ప్రవేశపెట్టారని, అక్కడ పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం పెరిగిందని గుర్తుచేశారు. ఈ విధానం వల్ల ఓటర్‌కు సమయం ఆదా అవుతుందని ద్వివేది అంచనా వేస్తున్నారు. ఇది ఏపిలో తొలిసారిగా ప్ర‌తిసాదిస్తున్నారు. ప్ర‌ధానంగా పోలింగ్ శాతం పెంచేందుకు ఇటువంటి మ‌రిన్ని నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని భావిస్తున్నారు.

మొత్తం 3.69 ఓట్ల ఓట‌ర్లు..

మొత్తం 3.69 ఓట్ల ఓట‌ర్లు..

ప్రస్తుతం రాష్ట్రంలో ఈవీఎంల పనితీరుపై పరిశీలన జరుగుతోందని ద్వివేది వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో రాజకీ య పార్టీల ప్రతినిధులు సైతం పాలుపంచుకునే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. తుది ఓటర్ల జాబితాను జనవరి 11న విడుదల చేశామని, ఆ జాబితాలో ఓటర్లను తొలగించడం గానీ, జత చేయడం గానీ ఇప్పటివరకు చేయలేదన్నా రు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.69 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 9 లక్షల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, వాటిలో కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఇచ్చిన ఫామ్‌-6 దరఖాస్తులు 7.36 లక్షల వరకు ఉన్నట్లు వివరించా రు. బూత్‌స్థాయి అధికారులు వాటిని పరిశీస్తున్నారని, పది రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఈ పరిశీలనలో రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా పాల్గొనాలని కోరారు.

English summary
Elections commission concentrated on elections in AP. EC announced total 3.69 cr voters in AP..in that 18 Lakh new voters. CEO says token system introducing in AP in coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X