India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: చీరాల బీచ్ వద్ద నందమూరి ఫ్యామిలీ సందడి: భార్యతో కలిసి ఓపెన్ టాప్ జీప్‌లో బాలయ్య

|
Google Oneindia TeluguNews

ఒంగోలు: టాలీవుడ్ బాక్సాఫీస్‌ మీద అఖండ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై ఏడు వారాలు దాటిన తరువాత కూడా క్రేజ్ తగ్గట్లేదు. కలెక్షన్ల జోరు తగ్గుముఖం పట్టట్లేదు. సంక్రాంతి పండగ నాడు అఖండ కలెక్షన్లు మరింత పెరిగాయి. అక్కినేని నాగార్జున-నాగచైతన్య నటించిన మల్టీస్టారర్ మూవీ బంగార్రాజు మినహా చెప్పుకోదగ్గ భారీ బడ్జెట్ సినిమాలేవీ ఈ సంక్రాంతికి విడుదల కాకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద అఖండ జైత్రయాత్ర..అఖండంగా సాగుతోంది. టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిందీ మూవీ.

ఈ సినిమా విజయాన్ని హీరో కమ్ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఎంజాయ్ చేస్తోన్నారు. అఖండ ఇచ్చిన జోష్‌లో మునిగి తేలుతున్నారు. సంక్రాంతి పండగ సందడి కూడా దీనికి తోడైంది. ఈ సంవత్సరం సంక్రాంతి పండగను ఆయన ప్రకాశం జిల్లా కారంచేడులో జరుపుకొంటోన్నారు. భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞతో కలిసి రెండు రోజుల ముందే ఆయన కారంచేడులో తన సోదరి, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్జా జాతీయ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో దిగారు.

బాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు జయకృష్ణ, సోదరి లోకేశ్వరి, ఉమామహేశ్వరి కుటుంబాలు ప్రస్తుతం పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు నివాసంలో సరదాగా గడిపాయి. సంక్రాంతి పండగ నాడు బాలకృష్ణ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. గుర్రంపై స్వారీ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పండగ సంబరాల్లో మునిగిపోయారు. బాలకృష్ణ, మోక్షజ్ఞను చూడటానికి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పురంధేశ్వరి ఇంటికి చేరుకున్నారు.

 Tollywood actor Balakrishna was spotted spending some time with family at Chirala beach in Prakasam

ఈ సెలబ్రేషన్స్‌కు కొనసాగింపుగా- ఇవ్వాళ నందమూరి కుటుంబం మొత్తం చీరాల బీచ్‌కు వెళ్లింది. ఉదయమే వారంతా వాహనాల్లో బీచ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఓపెన్ టాప్ జీప్‌ను నడిపారు. భార్య వసుంధర ఫ్రంట్‌సీట్‌లో కూర్చోగా.. తాను వేగంగా జీప్‌ను డ్రైవ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నందమూరి కుటుంబ సభ్యుల రాకతో చీరాల బీచ్ సందడిగా మారింది. బాలకృష్ణను చూడటానికి స్థానికులు ఎగబడ్డారు.

English summary
Tollywood actor Nandamuri Balakrishna was spotted spending some time with family at Chirala beach in Prakasam. His wife Vasundhara and sister Purandeswari participated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X