వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత: రాయలసీమ మాండలికాలకు కేరాఫ్‌గా

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రముఖ టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున ఆయన గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుకు గురయ్యారు. బాత్‌రూమ్‌లో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలిండానికి ప్రయత్నించినప్పటికీ.. ఫలితం రాలేదు. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినస్పటి నుంచి ఆయన గుంటూరులో నివసిస్తున్నారు. సినిమా షూటింగ్స్ లేకపోవడం వల్ల ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ తెల్లవారుజామున ఆయన గుండెపోటుకు గురయ్యారు. తుదిశ్వాస విడిచారు.

రాయలసీమ మాండలికాలను తెలుగు తెరకు పరిచయం చేసిన నటుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన స్వస్థలం.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్ల. సినిమాల్లోకి రాకముందు జయప్రకాష్ రెడ్డి పోలీసుశాఖలో పనిచేశారు. రాయలసీమ మాండలికానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. పలు ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ సినిమాల్లో నటించారాయన. వెంకటేష్ నటించిన బ్రహ్మపుత్రుడు సినిమాతో ఆయన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దర్శకరత్న దాసరి నారాయణ రావును ఆయనను ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

Tollywood actor Jayaprakash Reddy passes away after a massive Heart Stroke

Recommended Video

Mahesh Babu గొప్ప మనసు.. చిట్టి గుండెకు శస్త్ర చికిత్స! || Oneindia Telugu

ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, జయం మనదేరా, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి వంటి అనేక సినిమాల్లో నటించారు. బుర్రమీసాలు, పంచెకట్టుతో రాయలసీమ శైలిని ప్రతిబింబించారు. ఆయన నటించిన చివరి సినిమా మహేష్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు. ఇందులో విలన్ ప్రకాశ్ రాజ్ తండ్రిగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించారు. విలనిజంతో పాటు హాస్యాన్ని కూడా ఆయన పండించారు. ఎవడిగోల వాడిది, సీమ టపాకాయ్, నమో వెంకటేశ, రెఢీ వంటి సినిమాల్లో విలనిజంతో పాటు హాస్యాన్ని పండించారు. జయప్రకాశ్ రెడ్డి హఠాన్మరణం పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తోంది.

English summary
Tollywood Actor Jayaprakash Reddy passed away after undergoing a massive heart stroke.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X