• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అందుకే మన కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయాన్ని తీసుకుంది: మోడీ పథకానికి మహేష్ బాబు ప్రచారం

|

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్తగా కనిపించారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి బ్యాక్ అండ్ బ్యాక్ ఇండస్ట్రీ హిట్లను ఇస్తోన్న ఏకైక స్టార్ హీరో మహేష్ బాబు. సినిమాల్లోనే కాకుండా..వ్యాపార ప్రకటనతోనూ రాణిస్తున్నారు ఈ సూపర్ స్టార్. 30కి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలకు సంబంధించిన అడ్వర్టయిజ్ మెంట్లలో నటించారు. అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న నటుల్లో టాప్ లో కొనసాగుతున్న మహేష్ బాబుకు సామాజిక అంశాల పట్ల చైతన్యం ఎక్కువే. అందుకే- రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆయా గ్రామాలకు మౌలిక సదుపాయలను కల్పించడానికి సొంత డబ్బులను వినియోగిస్తున్నారు.

సెంట్రల్ ట్యాక్స్ యాడ్ లో..

సెంట్రల్ ట్యాక్స్ యాడ్ లో..

క్లోజప్, థమ్సప్, సంతూర్, ప్రొవోగ్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మహీంద్రా ట్రాక్టర్స్, బైజూస్ వంటి ఎన్నో సంస్థలు మహేష్ బాబుపై వాణిజ్య ప్రకటనలను చిత్రీకరించాయి. తాజాగా- కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జాబితాలో చేరింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మహేష్ బాబుపై ఓ చిన్న అడ్వర్టయిజ్ మెంట్ ను చిత్రీకరించింది. కేంద్ర ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్సులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తూ రూపొందంచిన యాడ్ ఇది. ఇందులో మహేష్ బాబు కనిపిస్తారు. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ హైదరాబాద్ జోన్ కు చెందిన అధికారులు ఈ అడ్వర్టయిజ్ మెంట్ ను రూపొందించారు.

వాణిజ్య పన్నుల వివాదాల పరిష్కారానికి..

నిమిషం 40 సెకెన్ల పాటు ఉండే ఈ యాడ్ లో అనేక విషయాలను ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే పన్నులు, కస్టమ్స్ సంబంధిత వివాదాలను పరిష్కరించుకోవడానికి కేంద్ర వాణిజ్య పన్నుల మంత్రిత్వ శాఖ కొత్తగా ఓ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం పేరు సబ్ కా విశ్వాస్. కస్టమ్స్, వాణిజ్య పన్నులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకోవడానికి ఉద్దేశించిన పథకం అది. ఈ పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి మహేష్ బాబుతో ఓ ప్రకటనను రూపొందించింది.

మంచి నిర్ణయం ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుందంటూ..

మంచి నిర్ణయం ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుందంటూ..

`మంచి నిర్ణయం ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుంది. అందుకే మన కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయాన్ని తీసుకుంది.. అంటూ మహేష్ బాబు కనిపిస్తారు ఈ ప్రకటనలో. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్ సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశ పెడుతున్న సమయంలో ప్రస్తావించిన ఈ పథకం వివరాలను ఇందులో పొందుపరిచారు. కస్టమ్స్, వాణిజ్య పన్నులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల కలిగే లబ్ది గురించి ఈ వీడిాయోలో వివరించారు. బ్యాక్ గ్రౌండ్ లో ఓ ఫిమేల్ వాయిస్.. ఈ పథకం వల్ల పన్నుదారులకు కలిగే ప్రయోజనాల గురించి పేర్కొనడం వినిపిస్తుంది. సెంట్రల్ ఎక్సైజ్ వివాదాల్లో సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వ్యాపారులకు ఇదొక మంచి అవకాశం అని మహేష్ బాబు వివరిస్తారు.

30కి పైగా అడ్వర్టయిజ్ మెంట్లలో..

30కి పైగా అడ్వర్టయిజ్ మెంట్లలో..

మహేష్ బాబు ఇప్పటికే 30కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. ఈ స్థాయిలో వాణిజ్య ప్రకటనల్లో నటించిన ఘనత టాలీవుడ్ లో మరే ఇతర హీరోలకూ లేదు. ఈ రికార్డ్ మహేష్ బాబు పేరిట మాత్రమే నమోదైంది. ప్రకటనల ద్వారా అత్యధికంగా ఆదాయాన్ని అందుకున్న హీరోల జాబితాలోనూ మహేష్ నంబర్ వన్ గా నిలిచారు. టోటల్ సౌత్ ఇండియా లోనే మహేష్ టాప్ రేంజ్ లో కొనసాగుతున్నారు. మ స్థానం లో ఉన్నాడు. ఆయన బ్రాండ్ వాల్యూ కి దరిదాపుల్లో కూడా మరే హీరో లేరంటే సూపర్‌స్టార్ క్రేజ్ ఎంటో తెలుస్తుంది. సినిమాలు, యాడ్స్ రెండింటిని మహేష్ సమంగా ప్లాన్ చేసుకుంటాడు. అందుకే ఈ రెండు రంగాల్లోనూ ఆయన టాప్ లో ఉన్నారని చెబుతున్నారు ఘట్టమనేని కుటుంబం అభిమానులు.

English summary
Tollywood Super Star Mahesh Babu bite in a Central Government Scheme Tollywood actor Mahesh Babu has hailed the central scheme i.e Sabka Vishwas (Legacy Dispute Resolution) Scheme, 2019, stating that it is good opportunity for businessmen and others who have been facing legal complications on this aspect for many years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more