వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరుణ్ టు లక్ష్మీ: పవన్ ప్రసంగంకు స్టార్స్ ఫిదా(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రసంగంపై టాలీవుడ్ ప్రముఖులు భిన్నంగా స్పందించారు. అయితే, ఎక్కువ మంది ఆయన ప్రసంగం బాగుందని కొనియాడారు. రామ్ గోపాల్ వర్మ అయితే పవన్‌ను ఆకాశానికెత్తేశారు.

రామ్ గోపాల్ వర్మ, సమంత, నాని, హరీష్ శంకర్, మంచు లక్ష్మీ ప్రసన్న, మంచు మనోజ్, నితిన్, బ్రహ్మాజీ, రఘు కుంచె, దిల్ రాజు తదితరులు స్పందించారు. కొందరు ఆకట్టుకోలేదని కూడా చెప్పారు.

తాను ప్రజల మనిషిని అని చెబుతున్న పవన్ కళ్యాణ్... ప్రజల మధ్యన కాకుండా ఓ స్టార్ హోటల్లో తన జనసేన పార్టీని ప్రారంభించడమేమిటని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే, మొత్తానికి ఎక్కువ మంది పవన్ ప్రసంగం ఆకట్టుకుందని చెప్పారు.

శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల

'పవన్ కళ్యాణ్‌కు హ్యాట్సప్. మీ ప్రసంగం కోట్లాది తెలుగు ప్రజల భావాలను ప్రతిధ్వనించింది' అని ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల అన్నారు.

 సమంత

సమంత

పవన్ ప్రసంగం విన్నాక ఆయన మీదున్న గౌరవం మరింత పెరిగిందని సమంత అన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా స్ఫూర్తివంతమైన ప్రసంగాన్ని ఇచ్చారని రఘు కుంచె స్పందించారు. పవన్ కళ్యాణ్‌కు ఏ ఇతర రాజకీయ నాయకుల కంటే ఎక్కువ పరిజ్ఞానం ఉందని మధుర శ్రీధర్ చెప్పారు.

 వరుణ్ తేజ్

వరుణ్ తేజ్

పవన్ రాజకీయ ప్రసంగంపై నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ట్విట్టర్లో స్పందించారు. 'బాబాయ్ తన ప్రసంగంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు' అని వరుణ్ తేజ పేర్కొన్నారు.

మంచు లక్ష్మీ

మంచు లక్ష్మీ

పవన్ స్పీచ్ హృదయానికి హత్తుకునేలా ఉందని మంచు లక్ష్మీ అంటే, ప్రజల మాట పవన్ నోట వెలువడిందని మంచు మనోజ్ అన్నారు. మెగా, మోహన్ బాబుల కుటుంబానికి పడదనే వాదన ఉన్న విషయం తెలిసిందే. అయితే, పవన్ స్పీచ్‌పై మంచు కుటుంబం పొగడ్తలు కురిపించింది.

వరుణ్ సందేశ్

వరుణ్ సందేశ్

పవన్ స్పీచ్ అదరగొట్టిందని వరుణ్ సందేశ్ అన్నారు. తాను ఇలాంటి ప్రసంగం ఇంతకుముందు వినలేదన్నారు. స్పీచ్ అద్భుతమని నాని పేర్కొన్నారు.

నిఖిల్

నిఖిల్

తన మనసులో ఉన్న ప్రతి మాట.. పవన్ కళ్యాణ్ ప్రసంగం ద్వారా బయటకు వచ్చిందని నిఖిల్ పేర్కొన్నారు. పవన్ స్పీచ్ చారిత్రకమైనదన్నారు. తాను పవన్‌ను నమ్ముతున్నానని, తాను జనసేన ఐడియాకు మద్దతిస్తున్నానన్నారు.

నితిన్

నితిన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సామాన్యుడి మనసులోని మాట చెప్పారని స్మిత అన్నారు. తాను కూడా పవన్ కళ్యాణ్ లాగే ఫీల్ అయ్యానని చెప్పారు. పవన్ అభిమాని అయిన నితిన్ ఫిదా అయిపోయారు.

బ్రహ్మాజీ

బ్రహ్మాజీ

తన కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్నారంటే నిజంగా సేవ చేసేందుకేనని అర్థమవుతోందని బ్రహ్మాజీ పేర్కొన్నారు. తాను పవన్ అభిమానిని కాదని.. కానీ స్పీచ్ విన్నాక అభిమానిగా మారానని మహేష్ బాబు బావ సుధీర్ అన్నారు.

English summary
Pawan Kalyan's heartfelt speech at the launch of his newly formed 'Jana Sena' has struck the right chord with his fans and admirers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X