• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నారా లోకేష్‌ వైరస్‌- తారక్‌ వ్యాక్సిన్‌- వర్మ ట్వీట్‌కు దివ్యవాణి స్ట్రాంగ్‌ కౌంటర్‌

|

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లోకి టాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తరచుగా ఎంటర్‌ కావడం, నేతలపై విమర్శలు చేయడం, ప్రతి విమర్శలు ఎదుర్కోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇదే కోవలో టీడీపీనీ, నారాలోకేష్‌నీ, జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి రామ్‌గోపాల్‌ వర్మ పెట్టిన ట్వీట్‌ పచ్చ పార్టీలో చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన టీడీపీ నేత దివ్యవాణి వర్మకు ట్విట్టర్‌లో ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. వైసీపీని ప్రస్తావిస్తూ మరీ వర్మను ఆమె ఆడుకున్నారు. దీంతో వీరిద్దరి ట్వీట్ వార్‌ తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌ అవుతోంది.

 టీడీపీని కెలికిన రామ్‌గోపాల్‌ వర్మ

టీడీపీని కెలికిన రామ్‌గోపాల్‌ వర్మ

ఏపీలో విపక్ష పార్టీగా ఉన్న టీడీపీ ఈ మధ్య ఎన్నికల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో టీడీపీని ఉద్దేశిస్తూ టాలీవుడ్‌ వివాదాస్పద నిర్మాత, దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు. నారా లోకేష్‌ను టార్గెట్‌ చేస్తూ పెట్టిన ఈ ట్వీట్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తావన కూడా చేశారు. తద్వారా వీరిద్దరి మధ్య పోలిక తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. అసలే లోకేష్ స్ధానంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తీసుకురావాలని అభిమానుల నుంచి డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో వర్మ ట్వీట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

 టీడీపీకి నారా లోకేష్‌ వైరస్‌

టీడీపీకి నారా లోకేష్‌ వైరస్‌

టీడీపీని, ఆ పార్టీ నేతల్ని ఉద్దేశించి చేసిన ట్వీట్‌లో దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ను ప్రధానంగా టార్గెట్‌ చేశారు. లోకేష్‌ను వైరస్‌గా అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్‌ అనే ప్రాణాంతక వైరస్‌ సోకిందని తన ట్వీట్‌లో రామ్‌ గోపాల్‌ వర్మ పేర్కొన్నారు. దీంతో టీడీపీ ఇబ్బందులు ఎదుర్కోంటోందనే అర్దం వచ్చేలా వర్మ ట్వీట్‌ ఉంది. దీన్ని చూసిన టీడీపీ అభిమానులు రామ్‌ గోపాల్‌ వర్మ తీరుపై మండిపడుతున్నారు. గతంలోనూ టీడీపీని పలుమార్లు టార్గెట్ చేసిన వర్మపై వారు దుమ్మెత్తిపోస్తున్నారు.

లోకేష్‌ వైరస్‌కు వ్యాక్సిన్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌

టీడీపీకి ప్రాణాంతక నారా లోకేష్‌ వైరస్‌ సోకిందని ట్వీట్‌ పెట్టిన రామ్ గోపాల్‌ వర్మ దానికి ఒకే ఒక్క వ్యాక్సిన్ ఉందని కూడా ట్వీట్‌లో పేర్కొన్నారు. అది తారక్‌ (జూనియర్‌ ఎన్టీఆర్‌) మాత్రమేనని వర్మ ట్వీట్ చేశారు. అంతే కాదు టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. స్మార్ట్‌గా ఆలోచించాలని, తక్షణం జూనియర్‌ ఎన్టీఆర్ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని కోరారు. లేకపోతే మీరు చచ్చిపోతారంటూ లాస్ట్‌ పంచ్‌ కూడా వేసేశారు. దీంతో వర్మ ట్వీట్‌ టీడీపీ అధిష్టానానికి, చంద్రబాబు, లోకేష్‌కూ ఇబ్బందికరంగా మారింది.

వర్మ ట్వీట్‌కు దివ్యవాణి ఘాటు కౌంటర్

టీడీపీ బతకాలంటే లోకేష్‌కు బదులుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ను తెచ్చుకోవాలంటూ ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌ వర్మ పెట్టిన ట్వీట్‌కు టీడీపీ నేత దివ్యవాణి ఘాటుగా బదులిచ్చారు. నారా లోకేష్ సత్తా ఏంటో, గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డ్స్ వచ్చాయో చూస్తే తెలుస్తుంది. నీలా, నీవు వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డి లాగ 420 పనులేవీ చేయట్ల. నీకు Paytm అనే పిచ్చికుక్క కరిసినట్లుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడో చెప్పారు అంటూ దివ్యవాణి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఒక్క ట్వీట్‌లోనే వర్మతో పాటు ఆయన సమర్ధిస్తున్న వైసీపీకీ, వర్మ ఆహ్వానిస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌కీ దివ్యవాణి క్లారిటీ ఇచ్చేశారు.

  Vijaysai Reddy MP అయ్యి ఉండి ఇలా మాట్లాడటం బాలేదు - నెటిజన్లు || Oneindia Telugu
  English summary
  tdp leader divya vani on today gives strong counter to tollywood director ramgopal varma's vaccine comments on mlc nara lokesh
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X