వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవగాహన లేకుండా పరువు తీయొద్దు, బాబు హుందాగానే: లోకేష్‌పై తమ్మారెడ్డి సంచలనం

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై వివాదాలు కొనసాగుతున్నాయి. నంది అవార్డులపై సినీ ప్రముఖుల నుండి విమర్శల జడివాన కొనసాగుతూనే ఉంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

నారా లోకేష్‌కి తమ్మారెడ్ది సంచలన సమాధానం

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై వివాదాలు కొనసాగుతున్నాయి. నంది అవార్డులపై సినీ ప్రముఖుల నుండి విమర్శల జడివాన కొనసాగుతూనే ఉంది. అయితే ఈ విమర్శలపై ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన విమర్శలపై టాలీవుడ్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. అవగాహన లేకుండా మాట్లాడి మీ పరువు, రాష్ట్రం పరువు తీయకూడదని తమ్మారెడ్డి భరద్వాజ లోకేష్‌కు సూచించారు. అంతేకాదు తాను సలహ మాత్రమే ఇస్తున్నానని తప్పైతే క్షమించాలని, ఒప్పైతే స్వీకరించాలని తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు.

హైద్రాబాద్‌లో కూర్చొని విమర్శలా, ఏపీలో ఆధార్, ఓటరు కార్డుల్లేవ్: లోకేష్ సంచలనంహైద్రాబాద్‌లో కూర్చొని విమర్శలా, ఏపీలో ఆధార్, ఓటరు కార్డుల్లేవ్: లోకేష్ సంచలనం

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ళకు నంది అవార్డులను ప్రకటించింది. అయితే ఈ అవార్డుల విషయంలో వివాదాలు చోటు చేసుకొన్నాయి. రుద్రమదేవి సినిమాకు అవార్డులు దక్కకపోవడం పట్ల ఆ సినిమా దర్శకుడు గుణశేఖర్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు బహిరంగలేఖ రాశారు.

కులాన్ని అంటగడుతారా, ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే, జ్యూరీ నిర్ణయమే: బాబు సంచలనంకులాన్ని అంటగడుతారా, ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే, జ్యూరీ నిర్ణయమే: బాబు సంచలనం

బన్నీ వాసు కూడ ఈ అవార్డులపై పెదవి విరిచారు. కొందరు కులాల ప్రస్తావన తెచ్చారు. అయితే జ్యూరీ నిర్ణయిచిన ప్రకారంగానే తాము వ్యవహరించాల్సి వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అయితే నంది అవార్డుల విషయమై సినీ పరిశ్రమకు చెందిన కొందరి విమర్శలపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. ఏపీలో ఆధార్, ఓటరు కార్డు కూడ లేనివారు విమర్శలు గుప్పిస్తున్నారని సంచలన కామెంట్లు చేశారు.

లోకేష్‌పై రెచ్చిన పోసాని: నంది అవార్డు తీసుకోను, కెసిఆర్‌ను చూసి, విమర్శించొద్దా?లోకేష్‌పై రెచ్చిన పోసాని: నంది అవార్డు తీసుకోను, కెసిఆర్‌ను చూసి, విమర్శించొద్దా?

 అవగాహన లేకుండా మాట్లాడొద్దని లోకేష్‌కు సూచన

అవగాహన లేకుండా మాట్లాడొద్దని లోకేష్‌కు సూచన

నంది అవార్డులు తెలుగు సినిమాలకు ఇస్తున్న అవార్డులని సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గుర్తు చేశారు. కానీ, ఈ అవార్డులు ఆధార్ ఆధార్ కార్డులకు ఇస్తున్న అవార్డులు కాదని చెప్పారు. ఆధార్ కార్డులకు ఇచ్చే అవార్డులను పెడితే అప్పుడు ఎవరైనా మాట్లాడితే అది తప్పని తమ్మారెడ్డి అన్నారు. అవగాహన లేకుండా మాట్లాడి మీ పరువు, మీ నాన్న పరువు, రాష్ట్రం పరువు తీయవద్దని తమ్మారెడ్డి భరద్వాజ లోకేష్‌కు సూచించారు. చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని, ఆయనతో కలసి పని చేశానని చెప్పారు. లోకేష్ ను చిన్నప్పటి నుంచి చూశానని... అందుకే తన మనసులోని ఆలోచనను ఓ సలహా రూపంలో లోకేష్ కు ఇస్తున్నానని చెప్పారు. తప్పు అనిపిస్తే తనను క్షమించాలని, ఒప్పైతే స్వీకరించాలని తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు.

 చంద్రబాబు హుందాగా వ్యవహరించారు

చంద్రబాబు హుందాగా వ్యవహరించారు

నంది అవార్డుల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హుందాగా వ్యవహరించారని దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు.అవార్డుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారని తమ్మారెడ్డి చెప్పారు. అవార్డులను కులాలకు, మతాలకు, పార్టీలకు ఆపాదించవద్దని మొన్ననే చెప్పానని తెలిపారు. చంద్రబాబు వరకు అంతా బాగానే ఉందని... మంత్రి లోకేష్ ఈ అంశంపై స్పందించిన తీరు మాత్రం బాగోలేదని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.

 బాధ కలిగించిందన్న తమ్మారెడ్డి భరద్వాజ

బాధ కలిగించిందన్న తమ్మారెడ్డి భరద్వాజ

మంత్రి లోకేష్ నంది అవార్డులపై స్పందించిన తీరు మాత్రం బాగోలేదని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేనివారు కూడా ఈ అంశంపై విమర్శలు చేస్తున్నారంటూ లోకేష్ మాట్లాడారని... ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి, సాక్షాత్తు ముఖ్యమంత్రి అబ్బాయి ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం తనకు బాధను కలిగించిందని భరద్వాజ చెప్పారు.

 హైద్రాబాద్‌లోనే ఉంటున్నారు కదా

హైద్రాబాద్‌లోనే ఉంటున్నారు కదా

మొన్నటి దాకా మీకు ఆధార్ కార్డులు ఎక్కడున్నాయి? మీరు ఇప్పటికీ హైదరాబాదులోనే ఉంటున్నారు, మీకు మాట్లాడే అర్హత ఉందా? అని తాము అడిగితే బాగోదని అంటూనే తమ్మారెడ్డి భరద్వాజ లోకేష్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలా అడిగితే చాలా అసహ్యంగా ఉంటుందని అంటూనే తాను చెప్పాలనుకొన్న అంశాలను చెప్పేశారు.

English summary
Tollywood Tammareddy Bharadwaj on AP IT Minister Nara Lokesh Comments on Aadhaar Card. Tammareddy Bharadwaj Talks about Nandi Awards and the way Nara Lokesh Commented about People without Aadhar Card in AP state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X