వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ ను కడిగిపారేసిన బండ్ల గణేశ్... జగన్, కేటీఆర్, ఎన్టీఆర్, రాంచరణ్ తో పోలుస్తూ...

|
Google Oneindia TeluguNews

గతంలో తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మరోసారి జూలు విదిల్చాడు. అయితే ఈసారి టీడీపీ యువనేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్లపై విమర్శల వర్షం కురిపించాడు. లోకేష్ తాజా ట్వీట్లు ఆయన అభిమానుల్లో సైతం అసంతృప్తి నింపుతున్నాయని చెబుతూ దాదాపు డజను కౌంటర్ ట్వీట్లు చేశాడు. వీటిలో చంద్రబాబు, కేసీఆర్, కేటీఆర్ లను ప్రత్యక్షంగా ప్రస్తావించిన గణేశ్.. ఏపీ సీఎం జగన్ ను పరోక్షంగా గుర్తుచేశాడు.

Recommended Video

:Bandla Ganesh Slams Nara Lokesh And Advised Him To Learn Poltics From AP CM YS Jagan
లోకేష్ ట్వీట్లపై బండ్ల గణేశ్ పైర్‌...

లోకేష్ ట్వీట్లపై బండ్ల గణేశ్ పైర్‌...

కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలను, వాటి అధినేతలను ఉద్దేశించి నారా లోకేష్ చేస్తున్న ట్వీట్లపై బండ్ల గణేశ్ మండిపడ్డాడు. ఈ క్రమంలో ఓవైపు తన ఆవేదనను వెళ్లగక్కుతూనే మరోవైపు లోకేష్ కు పలు సూచనలు చేశాడు. లోకేష్ ను ట్యాగ్ చేస్తూ రాజకీయాల్లో వారసత్వం కాదు దమ్ము, ధైర్యం, ప్రజల్లో పోరాడతాడు అన్న నమ్మకం ప్రజల్లో కల్పించడం రాజకీయ నాయకుడి లక్షణమని లోకేష్ కు గుర్తు చేశాడు. రాజకీయాలంటే తనకు చాలా ఇష్టమని, కానీ చాలా కష్టమని వదిలేసినట్లు గణేశ్ చెప్పుకొచ్చాడు. నారా లోకేష్ కు ప్రేమతో అని మొదలుపెట్టి టీడీపీ యువనేతను ఓ రేంజ్ లో కడిగి పారేశాడు.

లోకేష్ మీరు అదృష్టవంతులంటూనే...

లోకేష్ మీరు అదృష్టవంతులంటూనే...

ఈ మధ్య ట్విట్టర్ లో మీరు చేస్తున్న కామెంట్లను చూసి మిమ్మల్ని ఇష్టపడే చాలా మంది బాధపడుతున్నారని, మీ తండ్రి మీ గురించి ఆలోచిస్తూ గర్వంగా నిద్రపోయే రోజులు రావాలని బండ్ల సూచించారు. రాజకీయ పార్టీ అంటే సాఫ్ట్ వేర్ కంపెనీ కాదని, పార్టీ నాయకులంతా ఉద్యోగులు కాదని, వారిని ప్రేమించి, ప్రేమను పంచి, మనలో ఒకరిగా చేసుకుని ప్రజలకు సేవ చేయాలని అనుకుంటానన్నారు. ఈ ప్రపంచంలో అతి కొద్ది మందికే దక్కే అదృష్టం చంద్రబాబు కుమారుడి రూపంలో మీకు దక్కిందని లోకేష్ ను ఉద్దేశించి బండ్ల సైటైర్లు వేశారు.

కేసీఆర్, కేటీఆర్ తో పోలుస్తూ...

కేసీఆర్, కేటీఆర్ తో పోలుస్తూ...

ఉదాహరణకు చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసిన కేసీఆర్ కుమారుడు కేటీఆర్ లా లోకేష్ ఉండాలని తాను కోరుకుంటునన్నాడు బండ్ల గణేశ్. మీరు అద్భుతంగా పనిచేసి లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు అని చెప్పుకునే విధంగా మీ రాజకీయం ఉండాలని కోరుకుంటున్నట్లు మరో ట్వీట్ లో బండ్ల వ్యాఖ్యానించారు.
చంద్రబాబు కుమారుడిగా తప్ప మీకు ఏ రాజకీయ అర్హతా లేదని, ఎందుకంటే తనకు తెలిసి లోకేష్ ఓ ఫెయిల్యూర్ నాయకుడు అని గణేశ్ తీవ్ర విమర్శలు గుప్పించాడు.

 జూనియర్ ఎన్టీఆర్ తోనూ పోల్చి...

జూనియర్ ఎన్టీఆర్ తోనూ పోల్చి...

ఎవరూ ఏ సపోర్ట్ చేయకపోయినా నంబర్ వన్ పొజిషన్ కి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లా లోకేష్ ఉండాలని మరో ట్వీట్ లో బండ్ల గణేశ్ చురకలు అంటించాడు. లోకేష్ కోసమే చంద్రబాబు ఎన్టీఆర్ ను దూరం పెట్టారని గతంలో జరిగిన ప్రచారం నేపథ్యంలో బండ్ల తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, మీ తండ్రి చంద్రబాబు, తాత ఎన్టీఆర్ అంటే గౌరవమని లోకేష్ కు చెప్పుకొచ్చారు.

 నేతలపై నమ్మకం, వైవీ సుబ్బారెడ్డిపై ట్వీట్..

నేతలపై నమ్మకం, వైవీ సుబ్బారెడ్డిపై ట్వీట్..

ప్రతీ రాజకీయ నాయకుడికీ మూడు లక్షణాలు కావాలని, ఒకటి వాళ్లపై నమ్మకం, రెండు వారి వద్దకు వచ్చే ప్రతీ వారు నమ్మి రావడం, అలాగే దగ్గరికి వచ్చిన వారిని వీళ్లు నమ్మడం అంటూ లోకేష్ కు గట్టిగానే చురకలంటించాడు. మొన్నీ మధ్య టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దర్శనం చేసుకున్న వ్యవహారంపై లోకేష్ ట్వీట్ మీ దిగజారుడుతనానికి నిదర్శమని గణేశ్ విమర్శించారు.

మెగాస్టార్, చెర్రీలతో పోలుస్తూ...

మెగాస్టార్, చెర్రీలతో పోలుస్తూ...

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తోనూ లోకేష్ ను పోలుస్తూ గణేశ్ ఓ ఆటాడుకున్నాడు. రాంచరణ్ తరహాలో తండ్రికి పోటీ ఇచ్చే విధంగా మీరు కూడా తయారవ్వాలని కోరుకుంటున్నట్లు మరో ట్వీట్ లో బండ్ల... లోకేష్ కు సూచించాడు. మిమ్మల్ని చూస్తుంటే రాజకీయాల్లో పట్టు సాధించలేరేమోనని భయమోస్తోందని, కానీ నంబర్ వన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపాడు.

జగన్ తోనూ పోలుస్తూ...

జగన్ తోనూ పోలుస్తూ...

తండ్రి చనిపోయిన తర్వాత ప్రత్యర్దులంతా ఏకమై అణచివేయాలని చూసినా అందరినీ ఎదిరించి తొమ్మిదేళ్లపాటు సుదీర్ఘంగా పోరాడి ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిలా లోకేష్ ఉండాలని కోరుకుంటున్నట్లు మరో ట్వీట్ లో బండ్ల గణేశ్ తెలిపాడు. నా కిష్టమైన రాజకీయ నాయకుడు చంద్రబాబునాయుడు తన 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో విజయాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొని పోరాడుతూ ఉంటారని బండ్ల గణేశ్ గుర్తు చేశాడు.

English summary
tollywood actor and producer bandla ganesh has criticized andhra's tdp mlc and former minister nara lokesh over his reent tweets. ganesh suggest him to learn from his telangana counter part ktr and his father kcr on leadership qualities rather than heriditary politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X