• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంచలనం: జనసేనాని అమ్ముడుపోతాడా? ప్యాకేజీలకు లొంగే రకమా? తేల్చేసిన భరద్వాజ

By Ramesh Babu
|

అమరావతి: నాలుగేళ్ల క్రితం 'ప్రశ్నిస్తా..' అంటూ రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించిన నటుడు పవన్ కళ్యాణ్.. ఈ నాలుగేళ్లూ ఎక్కువగా ట్విట్టర్‌కే పరిమితం అయ్యారు. అప్పుడప్పుడూ ప్రభుత్వ చర్యలను, విధానాలను ప్రశ్నించే ప్రయత్నం చేసినా.. 2014 ఎన్నికల్లో పార్టీ గెలుపునకు సాయపడిన పవన్ పట్ల అధికార టీడీపీ సానుకూల ధోరణితోనే స్పందించేది.

రాజధాని భూములు, ఉద్దానం విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేనాని పవన్ సలహాలను కూడా తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో పవన్ తెలుగుదేశం నాయకులపై విమర్శలు గుప్పించినా.. సైలెంట్‌గా ఉండాలంటూ చంద్రబాబు హెచ్చరించే వారు. ఫలితంగా జనసేన- టీడీపీ మైత్రి మొన్నమొన్నటి వరకూ బాగానే సాగింది.

నష్టం జరిగింది జనసేనకే...

నష్టం జరిగింది జనసేనకే...

జనసేన-టీడీపీ దోస్తీ కారణంగా ఎక్కువ లాభపడింది టీడీపీనే.. అయినప్పటికీ జనసేన పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చంద్రబాబు కనుసన్నల్లోనే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని.. ఆయన డైరెక్షన్‌లోనే జనసేన నడుస్తోందంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లే.. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కాదు. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా అలాంటి సందర్భాలు చాలా తక్కువే. మొన్న తెలంగాణలో పవన్ చేపట్టిన యాత్ర కూడా బాబు డైరెక్ష‌న్‌లో జరిగిందే అంటూ ప్రచారం జరిగింది.

వైసీపీ నుంచి విమర్శలు...

వైసీపీ నుంచి విమర్శలు...

ఇక జనసేన-టీడీపీ మైత్రీ బంధం గురించి అవకాశం దొరికినప్పుడల్లా ప్రతిపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తూనే ఉండేది. వైసీపీ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం కూడా పవన్ చేయకపోవడంతో పవన్ కళ్యాణ్ టీడీపీతో ఏదో రహస్య ఒప్పందం కుదర్చుకున్నారంటూ.. పవన్ కళ్యాణ్‌ని ప్యాకేజ్‌ కళ్యాణ్, పావలా కళ్యాణ్ అంటూ పలు రకాలుగా విమర్శల దాడిని కొనసాగించింది వైసీపీ.

ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏ టైపు?

ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏ టైపు?

అయితే నిజంగా పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయే వ్యక్తా? ప్యాకేజీలకు లొంగే నైజం జనసైనికుడిలో ఉందా? అనేవి ఇప్పటి వరకు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి తప్ప వీటికి సమాధానం దొరకలేదు. ప్రజల్లో ఉన్న ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. పవన్ కళ్యాణ్‌ను తాను చాలా దగ్గర నుండి చూశానని, ఆయన వ్యక్తిత్వం ఏంటో.. ఎలా ఉంటారో తనకు బాగా తెలుసంటూ మీడియాకు వివరించే ప్రయత్నం చేశారాయన.

పవన్ మూడీ, ఆయన లోకం ఆయనది...

పవన్ మూడీ, ఆయన లోకం ఆయనది...

పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఎలాంటిదన్న ప్రశ్నకు.. ఆయనొక మూడీ మనిషి, ఏ మూడ్ వస్తే అది చేస్తాడు, ఆయన లోకంలో ఆయనుంటాడు. అప్పడు టీడీపీతో పడింది.. ఇప్పుడు పడడం లేదు.. అంతే, అని చెప్పారు తమ్మారెడ్డి భరద్వాజ. ఇక ఆయన ప్యాకేజీలకు లొంగుతాడా అన్న ప్రశ్నకు ‘చచ్చినా అలాంటివాడు కాడు..' అన్న సమాధానమే వచ్చింది.

పవన్ వెనక నిజంగా మోడీ ఉన్నారా?

పవన్ వెనక నిజంగా మోడీ ఉన్నారా?

మరి తాజా పరిణామాలు చూస్తోంటే జనసేనాని ప్రధాని మోడీవైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది కదా? ఒకవేళ మోడీ పవన్‌ని రహస్యంగా పిలిచి ఏవైనా మంతనాలు సాగించి ఉంటారా అన్న ప్రశ్నకు తమ్మారెడ్డి భరద్వాజ కుండబద్దలు కొట్టారు. ‘ఏంటి రహస్యంగా పిలిచేది? అలాంటిదేమీ ఉండదు. నాలుగేళ్లపాటు పవన్‌తో టీడీపీ నాయకులు దోస్తా చేశారు. అప్పట్లో పవన్ టీడీపీకి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడబోతే చంద్రబాబు వెంటనే ‘సంయమనం' అనేవారు. ఒకసారి అసెంబ్లీలో సైతం ఇలాగే అన్నారాయన. ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆఫ్ట్రాల్ పవన్ ఎంత అన్నట్లు రెచ్చిపోతున్నారు అని భరద్వాజ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ ఉన్నది పర్సనల్ విషయాల కోసమా?

అసెంబ్లీ ఉన్నది పర్సనల్ విషయాల కోసమా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‌గురించి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. ‘ఎందుకు పవన్ గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు? ఇది అసెంబ్లీలో చర్చించాల్సిన విషయమా? అసెంబ్లీ అనేది పబ్లిక్.. అంటే ప్రజల కోసం, వారి సమస్యలను చర్చించాల్సిన వేదిక.. అంతేకానీ వీళ్ల పర్సనల్ గొడవల గురించి కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, అసెంబ్లీ ఉన్నది నలభై ఏళ్ల రాజకీయ జీవిత చరిత్ర చెప్పుకునేందుకు కాదు, ప్రతి నిమిషం ప్రజల కోసం వెచ్చించాలని, ఒకవేళ పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా చెప్పాల్సి వస్తే... పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పొచ్చంటూ ఆయన హితవు పలికారు.

English summary
Tollywood Producer Tammareddy Bharadwaja speak about Pawan Kalyan and his attitude. He told that he is the person who observed Pawan Kalyan from very near. According to Tammareddy Janasena Chief Pawan is a moody fellow. Pawan Kalyan helped TDP in 2014 elections in their victory. Sometimes he questioned TDP in various points. More over Tamareddy Bharadwaja answered lot of questions about Pawan Kalyans Character and Attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X