వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖండ ఓకే.. నెక్స్ట్ ఎఫెక్ట్ వాటిపైనే -ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ : నిర్మాతల ఓపెన్ కామెంట్స్...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం వర్సెస్ సినీ ఇండస్ట్రీ అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. పైకి అటు ప్రభుత్వం..ఇటు సినీ పరిశ్రమ మధ్య ఎటువంటి సమస్య లేదని చెబుతున్నప్పటికీ..కొందరు టాలీవుడ్ పెద్దలు మాత్రం ఓపెన్ గానే ప్రభుత్వ నిర్ణయం పైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు నిర్మాతలు నేరుగా అమరావతికి వెళ్లి మంత్రులతో మంతనాలు సాగిస్తున్నారు. ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారం పైన వారంతా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నా... టిక్కెట్ల ధరల విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాలేకపోతున్నామని చెబుతున్నారు.

సీఎం జగన్ నిర్ణయం మారుతుందా

సీఎం జగన్ నిర్ణయం మారుతుందా

ఇదే అంశం పైన ఇప్పటికే పలువురు టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వానికి నివేదించారు. చిరంజీవి ట్వీట్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ కు అప్పీల్ చేసారు. దీని పైన స్పందించిన మంత్రి పేర్ని నాని తాను సినీ ప్రముఖలు వినతులను ముఖ్యమంత్రికి నివేదిస్తామని.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు తాజాగా ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. టికెట్‌ ధరలను తగ్గించడం వల్ల ప్రజలకు మేలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం భావించవచ్చని... కానీ నిర్మాతగా నా ఉత్పత్తికి నేను ధర నిర్ణయించుకునే వెసులుబాటు ఉండాలని వ్యాఖ్యానించారు.

చిత్ర పరిశ్రమ సంతోషంగా లేదు

చిత్ర పరిశ్రమ సంతోషంగా లేదు


ధరలు భారీగా తగ్గించడం వల్ల చిత్ర పరిశ్రమ పురోగతి కుంటుపడుతుందని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో చిత్ర పరిశ్రమ సంతోషంగా లేదన్నారు. టికెట్‌ ధరలు ఇంతలా తగ్గించడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేసారు. మేం అంతా కలసి ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి రిక్వెస్ట్‌ చేస్తామని చెప్పారు. ఈ సమస్య త్వరలోనే సమసిపోతుందనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రముఖ నిర్మాత నారాయణ్‌ దాస్‌ కే. నారంగ్‌ సైతం దీని పైన స్పందించారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ మంచిదేనని చెబుతూనే.. దానివల్ల సమస్య లేదన్నారు. టికెట్‌ ధరలు తగ్గించడం వల్లే ఇబ్బందేనని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో టికెట్‌ ధరలు బాగున్నాయంటూ

తెలంగాణలో టికెట్‌ ధరలు బాగున్నాయంటూ

తెలంగాణలో టికెట్‌ ధరలు బాగున్నాయని చెప్పుకొచ్చారు. కానీ ఏపీలో పరిస్థితి బాగాలేదని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామని చెబుతూనే... త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నామంటూ నిర్మాతలు నారాయణ్‌ దాస్‌ కే. నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు ఆశాభావం వ్యక్తం చేసారు. తాజాగా విడుదలైన అఖండ సినిమా బెనిఫిట్ షో లు ప్రదర్శించిన రెండు ధియేటర్ల పైన చర్యలు తీసుకున్నారు. అయితే, అఖండ మాత్రం వీటిని అధిగమిస్తూ దూసుకుపోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక, మరో నెల రోజుల్లో సంక్రాంతి సందర్బంగా ప్రముఖ హీరోల పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి.

ఆచార్య..ఆర్ఆర్ఆర్..భీమ్లా నాయక్.. కోసం

ఆచార్య..ఆర్ఆర్ఆర్..భీమ్లా నాయక్.. కోసం

అందులో చిరంజీవి నటించిన ఆచార్య.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ వంటివి సైతం ఉన్నాయి. ఈ లోగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావాలని టాలీవుడ్ ప్రముఖులు కోరుకుంటున్నారు. కానీ, ప్రభుత్వం నుంచి మాత్రం ప్రేక్షకుల కోణంలో ఆలోచన ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వంతో చర్చల కోసం సినీ పెద్దలు నిరీక్షిస్తున్నారు. కానీ, వారు కోరుకుంటున్నట్లుగా టిక్కెట్ల ధరల పెంపు పైన ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయం మార్చుకొని.. ధరల పెంపుకు అనుమతి ఇస్తారనేది అంత సులువుగా అయ్యే పని కాదని ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక, చాలా రోజులుగా సీఎం జగన్ తోనే నేరుగా చర్చించేందుకు సీనీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Recommended Video

Chandrababu Cried Issue : Vallabhaneni Vamsi Apologizes || Oneindia Telugu
సీఎంతో చర్చల కోసం ప్రయత్నాలు

సీఎంతో చర్చల కోసం ప్రయత్నాలు


కానీ, వారికి ఇప్పటి వరకు దానికి సంబంధించి అప్పాయింట్ మెంట్ ఖరారు కాలేదని తెలుస్తోంది. దీంతో..కొంత మంది నిర్మాతలు నేరుగా మంత్రి పేర్ని నాని ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నెలాఖరులోగా టిక్కెట్ల ధరల పెంపుకు అనుమతి ఇవ్వక పోతే..పెద్ద బడ్జెట్ తో సిద్దమైన ప్రముఖ హీరోల సినిమాల పైన ఎటువంటి ప్రభావం ఉంటుందనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తోంది. మరి..ముఖ్యమంత్రి జగన్ దీని పైన ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Tollywood Producers asking govt to permit to enchance ticket rates as implementing in Telangana state. But, AP govt not willing to producers proposals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X