ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు ఖమ్మం జిల్లా బంద్‌: ఆర్డినెన్స్ బాధాకరమన్న జానా

|
Google Oneindia TeluguNews

Tomorrow Khammam district bandh
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపే ఆర్డినెన్స్‌ బిల్లుకు శుక్రవారం లోకసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అఖిలపక్షం నేతలు శనివారం ఖమ్మం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. ఇప్పటికే జిల్లాకు చెందిన అఖిలపక్షం నాయకులు ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపిలో కలపే ఆర్డినెన్స్‌కు లోకసభ ఆమోదం తెలపడం పట్ల జిల్లా అఖిలపక్షం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జులై 14న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన, ధర్నా చేసేందుకు కూడా ఖమ్మం జిల్లా అఖిలపక్షం నాయకులు ఇప్పటికే నిర్ణయించారు.

పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపే ఆర్డినెన్స్‌కు లోకసభ ఆమోదం తెలపడం బాధాకరమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, ఏపి ముఖ్యమంత్రులు చర్చించుకుని ముంపు మండలాల ప్రజల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూడాలని కోరారు.

పోలవరం డిజైన్ మార్చాల్సిన అవసరం ఉందని జానారెడ్డి అన్నారు. పోలవరం వల్ల తెలంగాణలోని ప్రాంతాలకు ముంపు వాటిల్లకుండా పోలవరం డిజైన్‌ను మార్చాల్సిందేనని చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రభావిత నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చించిన తర్వాతే ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని జానారెడ్డి అన్నారు. లోకసభలో ఎంపీలు వ్యతిరేకిస్తుండగా ఆర్డినెన్స్‌పై ఓటింగ్ నిర్వహించడం తప్పని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ అన్నారు.

English summary
All party leaders on friday called tomorrow Khammam district bandh, against Polavaram
 ordinance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X