రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపటితో ముగియనున్న గోదావరి పుష్కరాలు: పెరిగిన భక్తుల రద్దీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: గోదావరి పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో పుష్కర ఘాట్లకు భక్తులు పెద్దఎత్తున గోదావరి తీరానికి తరలివస్తున్నారు. రేపటితో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో శుక్రవారం వేకువజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు చేయడం ఆరంభించారు.

ఏపీలోని రాజమండ్రి, నర్సాపురం, కొవ్వూరులలో భక్తుల రద్దీ పెరిగింది. అటు తెలంగాణలోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, రామన్నగూడెంలలో భక్తుల కోలాహలం కనిపించింది. ఉభయగోదావరి జిల్లాల్లో గురువారం ఒక్క రోజే 48 లక్షలమంది పుణ్యస్నానాలుచేశారు.

 రేపటితో ముగియనున్న గోదావరి పుష్కరాలు

రేపటితో ముగియనున్న గోదావరి పుష్కరాలు


శుక్ర, శనివారాల్లో రద్దీ మరింతగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒడిస్సా, కలకత్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలనుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పుష్కరాలకు వచ్చిన భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం కృషి చేస్తోంది.

రేపటితో ముగియనున్న గోదావరి పుష్కరాలు

రేపటితో ముగియనున్న గోదావరి పుష్కరాలు


ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పుష్కరాల్లో సౌకర్యాలపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తుండటంతో అధికారులూ అప్రమత్తంగా ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రేపటితో ముగియనున్న గోదావరి పుష్కరాలు

రేపటితో ముగియనున్న గోదావరి పుష్కరాలు


గురువారం రాజమండ్రిలో భారీగా వర్షం కురిసింది. వర్షంతో పారిశుధ్య ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన యంత్రాంగం ఈ మేరకు చర్యలు చేపట్టింది. గురువారం సీఎం చంద్రబాబు ఏరియల్‌ సర్వే ద్వారా పుష్కర ఘాట్లను పరిశీలించారు.

రేపటితో ముగియనున్న గోదావరి పుష్కరాలు

రేపటితో ముగియనున్న గోదావరి పుష్కరాలు


గోదావరి మహాపుష్కరాల ముగింపు సందర్భంగా ఈనెల 25వ తేదీ రాత్రి ఏడుగంటల నుంచి స్వచ్ఛందంగా ఇంటింటా పుష్కరజ్యోతిని వెలిగించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ అరుణకుమార్‌ తెలిపారు.

రేపటితో ముగియనున్న గోదావరి పుష్కరాలు

రేపటితో ముగియనున్న గోదావరి పుష్కరాలు


తెలుగు రాష్ట్రాలలో గోదావరి పుష్కరాలు పదో రోజుకు చేరుకున్నాయి. భారీగా తరలి వస్తున్న భక్తులతోటి గోదావరి నిండుకుండలా కనిపిస్తోంది. అధికార యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పుష్కర ఘాట్లలో వసతులు కల్పిస్తున్నప్పటికీ భక్తులు వర్షాలకు ఇబ్బంది పడుతున్నారు.

రేపటితో ముగియనున్న గోదావరి పుష్కరాలు

రేపటితో ముగియనున్న గోదావరి పుష్కరాలు


ఉభయ గోదావరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండడంవల్ల నగరంలోకి ప్రైవేట్ వాహనాల ప్రవేశాన్ని పోలీసులు నిషేధించారు. రాజమండ్రిలోని కోటిలింగాల రేవు, పుష్కరఘాట్, సరస్వతి ఘాట్లలో తెల్లవారుజామునుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

 రేపటితో ముగియనున్న గోదావరి పుష్కరాలు

రేపటితో ముగియనున్న గోదావరి పుష్కరాలు


పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, నరసాపురం, పెరవలి మండలం తీపర్రు స్నానాల ఘట్టాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా వుంది. అలాగే, అంతర్వేది, కొవ్వూరు, ద్వారాకాతిరుమల ఆలయాలు యాత్రికులతో కిటకిటలాడుతున్నారు.

English summary
Tomorrow will be the last day for godavari pushkaralu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X