వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావో డిప్యూటీ కమాండర్ లొంగుబాటు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: కోరుకొండ ఏరియా కమిటీలో డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్న మావోయిస్టు నేత మల్లేష్(40) శుక్రవారం విశాఖపట్నం రేంజ్ డిఐజి రవిచంద్ర ఎదుట లొంగిపోయారు. మల్లేష్ 41 కేసులలో నిందితుడిగా ఉన్నాడు.

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను డీఐజీ వెల్లడించారు. చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని కిష్టవరం గ్రామానికి చెందిన మల్లేష్‌పై రూ. లక్ష రివార్డు ఉందని, ప్రస్తుతం రూ.4 లక్షలు రివార్డు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు.

కోరుకొండ కమిటీలో దళ కమాండర్‌గా నవీన్‌, డిప్యుటీ కమాండర్‌గా మల్లేష్ పనిచేస్తున్నారని.. వీరితోపాటు 15 మంది ఈ దళంలో ఉన్నట్లు చెప్పారు. 303 తుపాకీ, పిస్టల్‌తో 2008 నుంచి మావోయిస్టు పార్టీలో తిరుగుతూ పలు విధ్వంసాల్లో మల్లేసు పాల్గొన్నాడని వెల్లడించారు.

సింద్రీ కార్ల, వంతల రాంబాబు హత్యల్లో, వీరవరం, గుధలం వీధిలో జరిగిన వివిధ సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడని వివరించారు. కాగా, మల్లేష్ ఆరోగ్య సమస్యలతోనే లొంగిపోయినట్లు తెలుస్తోంది.

లొంగుబాటు

లొంగుబాటు

కోరుకొండ ఏరియా కమిటీలో డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్న మావోయిస్టు నేత మల్లేష్(40) శుక్రవారం విశాఖపట్నం రేంజ్ డిఐజి రవిచంద్ర ఎదుట లొంగిపోయారు.

లొంగుబాటు

లొంగుబాటు

మల్లేష్ 41 కేసులలో నిందితుడిగా ఉన్నాడు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను డీఐజీ వెల్లడించారు.

లొంగుబాటు

లొంగుబాటు

చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని కిష్టవరం గ్రామానికి చెందిన మల్లేష్‌పై రూ. లక్ష రివార్డు ఉందని, ప్రస్తుతం రూ.4 లక్షలు రివార్డు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు.

లొంగుబాటు

లొంగుబాటు

కోరుకొండ కమిటీలో దళ కమాండర్‌గా నవీన్‌, డిప్యుటీ కమాండర్‌గా మల్లేష్ పనిచేస్తున్నారని.. వీరితోపాటు 15 మంది ఈ దళంలో ఉన్నట్లు చెప్పారు.

English summary
Deputy commander of Korukonda Area Committee of the banned CPI(Maoist) Vanthala Mallesh has surrendered to DIG of Police (Visakha Range) A. Ravi Chandra here on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X