వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో ప‌దో వంతు న‌గ‌దు ఏపీలోనే : ఎన్నిక‌ల వేల ప‌ట్టుబ‌డిన సొమ్ము: మ‌ద్యం..వ‌స్తువుల్లోనూ అంతే..!

|
Google Oneindia TeluguNews

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన ఓటింగ్ ప్ర‌క్రియ మాత్ర‌మే మిగిలి ఉంది. ఇక‌, ఎన్నిక‌ల వేళ దేశ వ్యాప్తంగా మొత్తంగా 2,628 కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. అయితే, అందులో ప‌దో వంతు న‌గ‌దు ఏపీలోనే దొరికింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీలో 216.34 కోట్లు ప‌ట్టుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 141.13 కోట్లు ప‌ట్టుకోగా ఈ సారి దాటి పోయింది. దీంతో పాటుగా మ‌ద్యం..ఇత‌ర వ‌స్తువుల విష‌యంలోనూ ఏపీలో ఇదే ప‌రిస్థితి క‌నిపించింది.

దేశంలోనే ప‌దో వంతు ఇక్క‌డే..
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా ఎన్నిక‌ల సంఘం అధికారులు..పోలీసులు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న న‌గ‌దును మొత్తంగా రూ.2,628 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. న‌గ‌దుతో పాటుగా మ‌ద్యం..బంగారం..ఇత‌ర సామాగ్రిని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇక ఏపీలో ప‌రిస్థితి గ‌మ‌నిస్తే..ఇక్క‌డ ప‌ట్టుబ‌డిన న‌గ‌దు..మ‌ద్యం విలువ రూ.216.34 కోట్లుగా తేల్చారు. దేశవ్యాప్తంగా పట్టుబడిన మొత్తం విలువలో ఇది పది శాతం. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయకముందే దేశంలో అత్యంత అధికంగా ధన ప్రభావం ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. అయితే, ఎన్నిక‌ల సంఘం అధికారులు..పోలీసులు ఇంకా పెద్ద మొత్తం న‌గ‌దును ప‌ట్టుకోవ‌టంలో విఫ‌ల‌మ‌య్యార‌ని..వేలాది కోట్ల రూపాయాలు ఏపీలో విచ్చ‌ల‌విడిగా పంపిణీ చేసార‌ని ఎన్నిక‌ల నిఘా వేదిక ప్ర‌తినిదులు ఆరోపిస్తున్నారు.

Total worth of 141.13 cr cash and liquor traced by EC and police in AP..

ద‌క్షిణాదిన త‌మిళ‌నాడుతో పోటీ..
దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడుతో పోటీగా ఏపీలో భారీగా సొమ్ము పట్టుబడింది. తమిళనాడులో రూ.514 కోట్లు పట్టుబడగా, ఏపీలో రూ.216.34 కోట్లు సీజ్‌ చేశారు. తెలంగాణలో అన్నీ కలిపి రూ.77.49 కోట్లు సీజ్‌ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో రూ.141.13 కోట్ల ధనం, మద్యం, ఇతర సామగ్రిని సీజ్‌ చేశారు. ఇప్పుడు రూ.216.34 కోట్ల విలువైన ధనం, వస్తువులు సీజ్ చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇక‌, ఏపీలో మ‌ద్యం సైతం ఏరులై పాడింది.
2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో రూ.12.92 కోట్ల విలువైన మద్యం పట్టుబడగా.. ఈ దఫా రూ.26.31 కోట్ల విలువైన 6.70 లక్షల లీటర్ల మద్యం సీజ్‌ చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి తరలిస్తున్న రూ.50 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాదీనం చేసుకున్న న‌గ‌దు..మ‌ద్యం..బంగారం ఆధారంగా బాధ్యుల‌ను గుర్తించి..వారి పైన కేసులు న‌మెదు చేసామ‌ని అధికారులు స్ప‌ష్టం చేసారు.

English summary
Elections staff and police traced huge amount in AP in Elections time. Nearly rs 216.34 cr cash and liquor seized by police. In Last Elections time it was rs 141.13 cr. Filed cases and started investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X