వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్ర వ్యాఖ్యలు: పాల్వాయిపై వేటుకు సిఫార్సు

By Pratap
|
Google Oneindia TeluguNews

TPCC recommends to expel Palwai Govardhan Reddy
హైదరాబాద్: సొంత పార్టీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని తెలంగాణ పిసిసి క్రమశిక్షణా సంఘం ఎఐసిసికి సిఫార్సు చేసింది. గాంధీ భవన్‌లో సోమవారం జరిగిన టిపిసిసి క్రమశిక్షణ సంఘం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికల్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. పాల్వాయికి ఇంతకు ముందే కాంగ్రెసు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభా స్థానం నుంచి కాంగ్రెసు తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన తన కూతురు స్రవంతికి ఆయన ప్రచారం చేశారు.

దానికితోడు, ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమికి కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్, టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత జానారెడ్డి కారణమని ఆనయ ఆరోపించారు కెసిఆర్‌తో పొత్తు పెట్టుకోవాలని, తెలంగాణ బిల్లు వ్యవహారంలో కెసిఆర్‌ను భాగస్వామిని చేయాలని చెప్పినా వారు వినలేదని, కెసిఆర్ కాంగ్రెసులోకి వస్తే తమకు సిఎం పదవి దక్కదని వారు దురాశతో వ్యతిరేకించారని ఆయన విమర్శించారు.

పొత్తులో భాగంగా మునుగోడు శాసనసభా స్థానాన్ని కాంగ్రెసు సిపిఐకి కేటాయించింది. దాన్ని వ్యతిరేకిస్తూ స్రవంతి రెడ్డి పోటీకి దిగారు. పోటీ నుంచి విరమించుకోవాలని పార్టీ అధిష్టానం సూచించినా ఆమె వెనక్కి తగ్గలేదు.

English summary
Telangana PCC has recommended for the expulsion of Nalgonda district leader and Rajyasabha member Palwai govardhan Reddy for crossing the limits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X