వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కౌంటింగ్ పై ఎన్నిక‌ల సంఘం శిక్ష‌ణ : స‌ందేహాల నివృత్తి : ఆర్వోల‌కు ఆహ్వానం..!

|
Google Oneindia TeluguNews

ఓట్ల లెక్కింపు తేదీ ద‌గ్గ‌ర ప‌డుతోంది. దీంతో..ఓట్ల లెక్కింపు పైన కేంద్ర ఎన్నిక‌ల సంఘం శిక్ష‌ణ ఇవ్వ‌నుంది. దీని కోసం ఈనెల 17వ తేదీన విజ‌య‌వాడ‌లో శిబిరం ఏర్పాటు చేసింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌తినిధులు ఈ శిబిరానికి హాజ‌రై ఈవీఎంలు, వివిపాట్ లపై శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.

రాష్ట్ర స్థాయి కౌంటింగ్ శిక్ష‌ణ‌..
ఓట్ల లెక్కింపులో ఈవీఎంలు...వివిప్యాట్ ల‌పై శిక్ష‌ణ ఇచ్చేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌తినిధులు విజ‌య‌వాడ కు వ‌స్తున్నారు. శుక్ర‌వారం రాష్ట్ర స్థాయి శిక్ష‌ణ ఏర్పాటు చేసారు. మొత్తం 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గం ఆర్వో లు హాజ‌రు కావాల‌ని సూచించారు. మే 17 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి విజయవాడలో ని గురునానక్ కాలనీ ఎన్ ఏ సి కళ్యాణమండపం నందు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో శిక్షణ జ‌ర‌గ‌నుంది.

23వ తేదీ ఎఫెక్ట్ : ఏపీలో రాజ‌కీయ క్యాంపులు త‌ప్ప‌వా: రెండు పార్టీల్లోనూ సీనియ‌ర్ల‌కు బాధ్యులు..!23వ తేదీ ఎఫెక్ట్ : ఏపీలో రాజ‌కీయ క్యాంపులు త‌ప్ప‌వా: రెండు పార్టీల్లోనూ సీనియ‌ర్ల‌కు బాధ్యులు..!

Training camp for AP Election counting officers by CEC..

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది , అదనపు ప్రధాన ఎన్నికల అధికారి సుజాత శర్మ, తదితరులు పొల్గొని అధికారులు సూచ‌న‌లు చేస్తారు. ఇందులో ప్ర‌ధానంగా ఇవియంల లెక్కింపు తో పాటుగా స‌మానంగా వివిప్యాట్‌ల లెక్కింపు గురించి ప్రాక్టిక‌ల్‌గా వివ‌రించ‌నున్నారు.

ఒక్క రోజు శిక్ష‌ణా కార్య‌క్ర‌మం..
ఒక్క రోజు శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో భాగంగా.. ఉదయం 10.30 నుంచి 11.30 వరకు ఓట్ల లెక్కింపు పై శిక్షణ.. డైరెక్టర్ నిఖిల్ కుమార్, అండర్ సెక్రెటరీ మధుసూదన్ గుప్తా శిక్ష‌ణ ఇస్తారు. దీనికి కొన‌సాగింపుగా ఉ.11.30 నుంచి 12 వరకు ఇటిపీబిఎస్ (electronically transmitted postal ballot system) పై శిక్షణ ఐటీ డైరెక్టర్ విఎన్ శూఖ్ల ద్వారా ఇప్పించ‌నున్నారు. ఇక‌, మ. 12 నుంచి 12.30 వరకు సందేహాలు నివృత్తి చేస్తారు. ఇందు కోసం మ.12.30 నుంచి సమావేశ ప్రాంగణంలో మోడల్ కౌంటింగ్ కేంద్రం సందర్శన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సంబంధిత ఆర్వో , జిల్లాలలో కౌంటర్ ఏర్పాట్లు చేసే అధికారి హాజరుకానున్నారు.

English summary
Central election commission conducting counting training camp for AP staff on 17th may in vijayawada. CEC representatives and state officers participate in this training camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X