విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కు చింతమనేని ఛాలెంజ్ పై మండిపడ్డ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి:నీ స్థాయికి నేను చాలు!

|
Google Oneindia TeluguNews

విజయవాడ:తనపై విమర్శలకు ప్రతిగా పవన్ కల్యాణ్ నుద్దేశించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన ఛాలెంజ్ పై ట్రాన్స్ జెండర్ తమన్నా సింహద్రీ మండిపడ్డారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై చింత‌మ‌నేని శ్రుతి త‌ప్పిన ఆరోప‌ణ‌లు..! ల‌య త‌ప్పిన సవాళ్లు..!! <br>ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై చింత‌మ‌నేని శ్రుతి త‌ప్పిన ఆరోప‌ణ‌లు..! ల‌య త‌ప్పిన సవాళ్లు..!!

చింతమనేని ని ఉద్దేశించి మాట్లాడుతూ నీకు పవన్ కళ్యాణ్ కు పోలికేమిటని...అసలు నీ స్థాయికి పవన్ కళ్యాణ్ అవసరం లేదని...తాను చాలని...నేను నీ మీద పోటీ చేస్తా...నన్ను గెలువు చాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే ఎమ్మెల్యే చింతమనేని తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. చింతమనేని బంధువుల మంటూ కొందరు వ్యక్తులు విజయవాడలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది.

Transgender Tamamma Simhadri challenged MLA Chintamaneni over Pawan Kalyan issue!

పవన్ కళ్యాణ్ ని సవాలు చేసిన చింతమనేనిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..."రౌడియిజం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే నీకు, కొట్లాది మంది అభిమానుల గుండెల్లో స్దిరస్దాయిగా నిలిచి పోయే పవన్ కల్యాణ్ కు పోలికా...

నీ రౌడియిజంకు భయపడి నీ నియోజకవర్గంలో ఎవరూ నీపై మాట్లాడరేమో....మాకు అటువంటి భయం లేదు...

నీకు పవన్ కల్యాణ్ కు పోటీనా?... నీ స్దాయికి నేను చాలు..పవన్ కల్యాణ్ ఆదేశిస్తే దెందులూరులో నీపై నేను పోటి చేస్తా..
.నువ్వు నామీద గెలిచి మాట్లాడు..

.

ఒకవైపే చూడు రెండో వైపు చూడలేదు అంటున్నావ్..

.ఏం చేస్తావ్...బెదిరిస్తున్నావా...చంపేస్తావా...

నీ ఉడత చప్పుళ్ళుకు జనసైనికులు భయపడరు!"...అని దుయ్యబట్టింది.

ఇదిలా వుంటే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. విజయవాడలోని బందరు లాకుల దగ్గర ఓ కారు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోతుండగా అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ కారును ఆపాడు. దీంతో ఆగ్రహానికి లోనైన అందులో ఉన్న వ్యక్తులు కారు దిగి కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. మేము ఎమ్మెల్యే చింతమనేన ప్రభాకర్ బంధువులమని, మా కారే ఆపుతావా...అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడి చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

దాడికి పాల్పడ్డవారిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా దాడి చేసిన వారి కారుపై చింతమనేని పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ వివాదంపై ఎమ్మెల్యే చింతమనేని స్పందించారు. నాపేరు వాడుకుని అరాచకాలు సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. విజయవాడలో తన బంధువులంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డ వారికి నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇకమీదట నా పేరు వాడుకొని దాడులు చేస్తూ అరాచకాలు సృష్టించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ శాఖ ఉన్నతాధికారులను కోరారు.

English summary
Vijayawada:Transgender Tamanna Simhadri responded angrily over the challenge of MLA Chintamaneni against Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X