వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాన్స్ జెండర్లకు ఎపి ప్రభుత్వం వరాల వర్షం...పండగ చేసుకుంటున్న హిజ్రాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి:సమాజంలో అంతులేని వివక్షకు గురవుతున్న హిజ్రాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరాల వర్షం కురిపించింది. హిజ్రాలకు పెన్షన్ తో పాటు వివిధ సంక్షేమ పథకాలని వర్తింపచేసే నిర్ణయాన్నిఎపి కేబినెట్ ఆమోదించింది.దీంతో దేశవ్యాప్తంగా హిజ్రాలు సంబరాలు జరుపుకుంటున్నారు.

హిజ్రాలను ఆదుకుంటానన్న ఎపి సిఎం చంద్రబాబు తన మాట నిలబెట్టుకున్నారు. మూడు నెలల క్రితం తనను కలసి కష్టాలు వెళ్లబోసుకున్న హిజ్రాల జీవిత స్థితిగతులపై సీఎం చంద్రబాబు చలించిపోయారు. హిజ్రాలుగా పుట్టడం వారి తప్పు కాదని, హిజ్రాలను కుటుంబం నుంచి వెలివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వారికి అన్ని విధాలా న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్నమాట ప్రకారం వారిపై వరాల వర్షం కురిపించడమే కాదు అవి ఆచరణలోకి వచ్చేలా శ్రధ్ద కూడా తీసుకున్నారు. ఫలితంగా హిజ్రాలకు సిఎం ఏఏ వరాలయితే ఇచ్చారో వాటన్నింటికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

 హిజ్రాలపై వరాల వర్షం...

హిజ్రాలపై వరాల వర్షం...

దీంతో హిజ్రాలకు నెలకు పదిహేను వందల రూపాయల పెన్షన్ ఇవ్వడంతో పాటు వారికి
ఇళ్ళ స్థలాలు , రేషన్ కార్డులు సమకూరనున్నాయి. వాటితో పాటు చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వారికి రుణాలు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు బడుగు బలహీనులకు ఏఏ సంక్షేమ పథకాలు అందచేస్తున్నారో అవన్నీ హిజ్రాలకు కూడా వర్తింపచెయ్యాలని నిర్ణయం జరిగింది.దీంతో రాష్ట్రంలో ఉన్న సుమారు 26 వేలమంది ట్రాన్స్ జెండర్ లకు న్యాయం బెనిఫిట్ పొందుతారని అంచనా.

రాష్ట్రంలో హిజ్రాలకు పండుగే...

రాష్ట్రంలో హిజ్రాలకు పండుగే...

తమపై ఆంధ్రప్రదేశ్ కురిపించిన వరాల వర్షంతో రాష్ట్రంలోని హిజ్రాలు పండుగ చేసుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లు సంబరాలు జరుపుకున్నారు.తిరుపతిలో చంద్రబాబు ఫ్లెక్సీకి హిజ్రాలు పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని చాటుకున్నారు. రంగులు చల్లుతూ, డ్యాన్సులు చేస్తూ వేడుక జరుపుకున్నారు. ఎపి ప్రభుత్వం నూతన నిర్ణయాలతో తమ జీవితాల్లో వెలుగులు ప్రవేశిస్తాయని, అందుకు చంద్రబాబే కారణమంటున్నారు హిజ్రాలు. అందుకే ఆయనకు జీవితాంతం రుణపడి ఉండటమే కాదు ముందే ప్రకటించినట్లు ఆయనకు గుడి కట్టితీరతామని స్పష్టం చేస్తున్నారు.

దేశ రాజధానిలోనూ...

దేశ రాజధానిలోనూ...

మరోవైపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ట్రాన్స్ జెండర్ 2016 బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు ఎపి, తెలంగాణాల నుంచి పెద్ద సంఖ్యలో హిజ్రాలు ఢిల్లీకి తరలివెళ్లారు. అక్కడ ప్రదర్శనలో పాల్గొంటున్న తరుణంలో తమపై ఎపి ప్రభుత్వం కురిపించిన వరాల వర్షం గురించి తెలిసి ట్రాన్స్ జెండర్లు సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబుకు జేజేలు పలికారు. ప్రతి ప్రభుత్వం ఎపి ప్రభుత్వంలాగానే స్పందిస్తే తాము కూడా సమాజంలో అందరిలా జీవించగలుగుతామని అన్నారు.

 ట్రాన్స్ జెండర్ బిల్లుపై నిరసన...

ట్రాన్స్ జెండర్ బిల్లుపై నిరసన...

మరోవైపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ట్రాన్స్ జెండర్ 2016 బిల్లు పట్ల హిజ్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఈ బిల్లును నిరసిస్తూ దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన ట్రాన్స్ జెండర్ లు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్ స్ట్రీట్ లో ధర్నా చేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసలు హిజ్రాల అభిప్రాయాలను పట్టించుకోకుండానే బిల్లును రూపొందించారని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమానికి ఏపీ, తెలంగాణల నుంచి భారీ సంఖ్యలో హిజ్రాలు తరలివెళ్లడం విశేషం.

English summary
The Andhra Pradesh cabinet on Saturday approved a policy for the social upliftment of transgenders in the state by offering them pensions, ration cards, housing sites and other financial assistance for business activities. As per the transgender policy, the government will provide an amount of Rs 1,500 per month to each transgender above 18 years of age towards social security pension. The scheme will benefit an estimated 26,000 transgenders in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X