అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరు జిల్లాలో భూప్రకంపనలు, భయాందోళనకు గురైన ప్రజలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో శావల్యాపురం మండలంలో సోమవారం భూప్రకంపనలు సంభవించాయి. కారుమంచి, కొత్తలూరు, మతుకుపల్లి, శానంపూడి, కనమర్లపూడి గ్రామాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు.

ప్రజలకు బయటకు పరుగెత్తుకు వచ్చారు. రెండు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. భూప్రకంపన దాటికి నష్టం జరగలేదని తెలుస్తోంది.

అదుపుతప్పి బస్సు బోల్తా

Tremors in Guntur district

అదుపు తప్పి బస్సు బోల్తా పడిన సంఘటన కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం సంతజూటురు, పెద్దదేవాలపురం గ్రామాల మధ్య సోమవారం ఉదయం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా గడివేములకు మండలానికి చెందిన కొంతమంది భక్తులు రాజమండ్రి పుష్కరాలకు వెళ్లి తిరిగి స్వస్థలానికి వస్తున్నారు.

ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదమూడు మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Mild tremors were felt in Guntur district for nearly two seconds this morning, triggering panic as people rushed out of the houses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X