వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విప్ జారీ చేయండి, అడ్డుకోండి: మమత-రాహుల్ గాంధీలకు చంద్రబాబు ఫోన్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేశారు.

<strong>కేసీఆర్! ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కున్నప్పుడు పక్కనే ఉన్నావ్, జగన్‌తో కలువ్: బాబు సంచలన వ్యాఖ్యలు</strong>కేసీఆర్! ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కున్నప్పుడు పక్కనే ఉన్నావ్, జగన్‌తో కలువ్: బాబు సంచలన వ్యాఖ్యలు

ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరంగా పరిగణించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తీసుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వారికి ఫోన్ చేశారు. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును అడ్డుకోవాలని వారికి సూచించారు. చంద్రబాబు ఏపీలో తన నివాసంలో ఉన్నారు.

బిల్లును అడ్డుకునేందుకు ఏకం చేయండి

బిల్లును అడ్డుకునేందుకు ఏకం చేయండి

ముస్లీంల పైన వేధింపులను అడ్డుకోవాలని, వారి హక్కులను కాపాడేందుకు కృషి చేయాలని రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలకు చంద్రబాబు చెప్పారు. ట్రిపుల్ తలాక్ బిల్లును అడ్డుకునేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీయేతర) యేతర పార్టీలను ఏకం చేయాలని సూచించారు. బీజేపీ ముస్లీం వ్యతిరేక చర్యలను అందరు కలిసి అడ్డుకోవాలన్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరు కూడా రాజ్యసభకు హాజరయ్యేలా విప్ జారీ చేయాలని చంద్రబాబు వారికి సూచించారు.

ట్రిపుల్ తలాక్ బిల్లుపై సుజనా చౌదరి

ట్రిపుల్ తలాక్ బిల్లుపై సుజనా చౌదరి

ట్రిపుల్ తలాక్‌ బిల్లును రాజ్యసభలో పాస్‌ కానిచ్చేది లేదని టీడీపీ ఎంపీలు వేరుగా స్పష్టం చేశారు. బిల్లులో కొన్ని సవరణలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఒకేసారి ట్రిపుల్ తలాక్‌ చెప్పి విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణించేందుకు ఉద్దేశించిన నూతన బిల్లు సోమవారం రాజ్యసభ పరిశీలనకు రానుంది. ఇప్పటికే ఈ బిల్లుకు లోకసభలో ఆమోదం లభించింది. ఇప్పుడు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడారు.

సెలక్ట్ కమిటీకి పంపించాలి

సెలక్ట్ కమిటీకి పంపించాలి

తమ పార్టీ రాజ్యసభ ఎంపీలు అందరు సభకు రావాలని విప్‌ జారీ చేశామని సుజనా చౌదరి తెలిపారు. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని పట్టుబడతామన్నారు. ట్రిపుల్ తలాక్‌ బిల్లును చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. సెలెక్ట్‌ కమిటీకి పంపాలని చెబుతున్నా పట్టించుకోవట్లేదని లోకసభ ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. రాజ్యసభలో ఈ బిల్లును అడ్డుకుని తీరుతామన్నారు.

 ట్రిపుల్ తలాక్ బిల్లు

ట్రిపుల్ తలాక్ బిల్లు

బిల్లులో కొన్ని సవరణలు చేయాల్సిందేనని లోకసభ సభ్యులు కొనకళ్ల నారాయణ అన్నారు. మహిళళకు న్యాయం చేయడం కోసం పురుషులకు అన్యాయం చేయొద్దని, స్త్రీ, పురుషులకు సమాన న్యాయం జరిగేలా బిల్లు ఉండాలన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభకు వస్తున్న నేపథ్యంలో ఈ బిల్లును అనుమతించేది లేదని కాంగ్రెస్‌ సహా పది విపక్షాలు చెప్పాయి. ట్రిపుల్ తలాక్‌తో ముస్లిం మహిళలు ఎంతగానో నష్టపోతున్నారని బీజేపీ, ఎన్డీయే వర్గాలు చెబుతున్నాయి.

English summary
Andhra Pradesh chief minister Chandrababu Naidu calls AICC president Rahul Gandhi and West Bengal CM Mamatha Banerjee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X