• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ సేఫ్- అందరి టార్గెట్ సజ్జలే-ఉద్యోగుల పోరుకూ కారణమన్న అపవాదు-వైసీపీ వాదన ఇదే

|
Google Oneindia TeluguNews

ఏపీలో ప్రభుత్వాన్ని నడుపుతోంది వైఎస్ జగనా లేక సజ్జల రామకృష్ణారెడ్డా ? నిన్న ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమాన్ని దగ్గరి నుంచి గమనించిన వారికి పదే్ పదే వినిపించిన ప్రశ్న ఇది. అంతలా ఉద్యోగుల్ని చిర్రెత్తించారా అంటే వారి నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటివరకూ విపక్ష పార్టీలతో పాటు ఆయన ప్రత్యర్ధులు మాత్రమే సంధించిన ప్రశ్నల్ని ఇప్పుడు ఉద్యోగులు కూడా ఎక్కుపెడుతున్నారు. దీనిపై వైసీపీ మాత్రం భిన్నంగా స్పందిస్తోంది.

AP PRC: Chalo Vijayawada ఆత్మరక్షణలో AP Govt సమ్మెను అడ్డుకునేదెలా? | Andhra Pradesh| OneindiaTelugu
 సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర

సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర


ఏపీలో ఒకప్పుడు సీనియర్ జర్నలిస్టుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా మారిపోయారు. గతంలో మాజీ సీఎం వైఎస్ కూ, ఆ తర్వాత ఆయన కుమారుడు, ప్రస్తుత సీఎం జగన్ కూ అండగా నిలిచారు. ఆ క్రమంలో గతంలో వైసీపీ కుటుంబ అభిమానులకు, వైసీపీ నేతలకు మాత్రమే ఎక్కువగా పరిచయం ఉన్న సజ్జల ఇప్పుడు రాష్ట్రంలో ముందుగా విపక్షాలకూ, ఆ తర్వాత ఉద్యోగులందరికీ సుపరిచతం అయిపోయారు. ఇందుకు ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వంలో ఆయన పోషిస్తున్న పాత్రే.

జగన్ తర్వాత నంబర్ టూ

జగన్ తర్వాత నంబర్ టూ

రాష్ట్రంలో సీఎం జగన్ ను కలవాలనుకునే వారంతా ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తీరాల్సిందే. జగన్ కు చెప్పాలనుకున్న విషయాన్ని ముందుగా సజ్జలకు చెప్పి తీరాల్సిందే. అంతగా ప్రభుత్వంలో పేరు తెచ్చుకున్నారు సజ్జల. ఇప్పుడు జగన్ తర్వాత ప్రభుత్వంలో నంబర్ టూ ఎవరంటే తడుముకోకుండా సజ్జల పేరు చెప్పుకోవాల్సిన పరిస్ధితి. మంత్రులు, అధికార గణం చేయాల్సిన పనుల్ని, ప్రకటనల్ని అంతా సజ్జలే చేసేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ సలహాదారుగా ఉండాల్సిన వ్యక్తి కాస్తా.. డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా, మంత్రులకే మంత్రిగా మారిపోయారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. ఆయన కారణంగానే ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యారని ఇప్పటివరకూ అంతా భావిస్తుండగా.. ఆయన వల్లే ఈ సమస్యలన్నీ అంటూ ఉద్యోగులు వాపోతున్నారు.

ఉద్యోగుల కంట్లో నలుసుగా

ఉద్యోగుల కంట్లో నలుసుగా

ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారాన్ని ముందునుంచీ పర్యవేక్షించింది సజ్జలే. ఉద్యోగులతో ముందుగా తానే సమావేశాలు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో సీఎం జగన్ దగ్గరికి నేతల్ని తీసుకెళ్లి పీఆర్సీపై ఒప్పించామని ఆనిపించారు. కానీ జగన్ దగ్గర ఒప్పుకున్న ఉద్యోగులు.. ఆ తర్వాత బయటికి వచ్చి మాత్రం పోరుబాట పట్టారు. దీనికి కూడా కారణం సజ్జలే అన్నది వారి ఆరోపణ. జగన్ కూ, తమకూ మధ్య గ్యాప్ పెరగడానికి సజ్జలే కారణమవుతున్నారని ఉద్యోగులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. తాజాగా ఛలో విజయవాడలోనూ ప్రతీ ఉద్యోగి నుంచి సజ్జల వంటి సలహాదారుల వల్లే ఇలాంటి పరిస్ధితి వచ్చిందన్న ఆరోపణలు వినిపించాయి. సీఎం జగన్ మంచివారైనా, సజ్జల వంటి సలహాదారుల సలహాలు తీసుకోవడం వల్లే తమకు అన్యాయం జరుగుతోందన్న ఆక్రోశం కనిపించింది.

భిన్నంగా వైసీపీ స్పందన

భిన్నంగా వైసీపీ స్పందన


కానీ వైసీపీ వర్గాలు మాత్రం సజ్జలను పూర్తిగా వెనకేసుకొస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రత్యర్ధులు సజ్జలను టార్గెట్ చేస్తుంటే అనుచరులు, వైసీపీ కార్యకర్తలు మాత్రం సజ్జల వైసీపీని బతికిస్తున్న కర్త, కర్మ, క్రియ అంటూ పోస్టులు పెడుతున్నారు. వైసీపీకి ముందునుంచీ వీరాభిమానిగా ఉన్న పొలిటికల్ పంచ్ ఇంటూరి కూడా సజ్జల గురించి తాజాగా పెట్టిన పోస్టులు చూస్తే సజ్జలపై పెరుగుతన్న వ్యతిరేకత, దానికి వైసీపీ అభిమానుల నుంచి కౌంటర్ అటాక్ అర్ధమవుతుంది. అంతే కాదు వైసీపీ నేతలు సైతం సజ్జలకు అనుకూలంగా పోస్టులు పెడుతూ పార్టీకి ఆయన ఊపిరిపోస్తున్నారని, పదేళ్లలో పార్టీ అధికారంలోకి రావడానికి, జగన్ ఇంటి నుంచి కదలకపోయినా స్ధానిక ఎన్నికల్లో వైసీపీ వరుస విజయాలు సాధించడానికీ కారణం సజ్జలే అన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఉద్యోగుల విషయంలోనూ ఆయన తీరును సమర్ధిస్తున్నారు.

నిండుకుండలా సజ్జల

నిండుకుండలా సజ్జల

తనపై ఎవరెన్ని పాజిటివ్, నెగెటివ్ వ్యాఖ్యలు చేస్తున్నా సజ్జల మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. ప్రభుత్వంపై ఈగ వాలకుండా చూసుకోవడంలో ఇన్నాళ్లూ పోషించిన పాత్రనే కొనసాగించడానికి ఆయన మొగ్గు చూపుతున్నారు. ఇన్నాళ్లూ విపక్షాల నుంచి, ఇప్పుడు ఉద్యోగుల నుంచి ఎదురవుతున్న విమర్శలకు స్పందించేందుకు ఆయన సిద్ధపడటం లేదు. జగన్ తనకు అప్పగించిన పాత్రను సమర్ధవంతంగా నిర్వహించేందుకే ఆయన ఇష్టపడుతున్నారు. ఉద్యోగుల పోరుకు తానే కారణమన్న విమర్శలు వస్తున్నా.. తన ఎదురుదాడి మంత్రాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో ఆయనపై విమర్శలు చేస్తున్న వారే ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్ధితి.

English summary
andhrapradesh government advisor sajjala ramakrishna reddy's role become controverial amid employees fight against prc announced by the govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X