వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ పార్టీ ఖమ్మం అభ్యర్థి నాగార్జునపై తెరాస దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

TRS attack on JSP candidate
ఖమ్మం/హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని మధిరలో జై సమైక్యాంధ్ర పార్టీ (జెఏస్పీ) లోకసభ అభ్యర్థి నాగార్జున వాహనంపై తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం జెఏస్పీ తరపున ఖమ్మం పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న చెరుకూరి నాగార్జున వాహనంపై మధిర శివారులో అడ్డుకుని రాళ్లతో దాడి చేశారు.

తనను వదిలిపెట్టాలంటూ నాగార్జున వారిని ప్రాధేయపడినప్పటికీ తెరాస కార్యకర్తలు వినిపించుకోలేదు. రాళ్లతో చేయడంతో వాహనం ధ్వంసమైంది.

నాగార్జునకు కూడా స్వల్పగాయాలయ్యాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అడ్డుకున్నారు. అనంతరం నాగార్జునసాగర్ వేరే కారులో నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరారు. తమ అభ్యర్థిపై దాడిని జెఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండించింది.

గోషా మహల్లో నాకు తిరుగు లేదు: ముఖేష్

గోషా మహల్ నియోజకవర్గంలో తనకు తిరుగు లేదని మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ అన్నారు. బిజెపి ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదంటే అర్తం చేసుకోవచ్చునన్నారు. 25 ఏళ్లుగా తాను గోషామహల్ ప్రజల కోసం కృషి చేస్తున్నానన్నారు. తన తనయుడు ముషీరాబాద్ నుండి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటే విరమించుకోమని చెప్పానని తెలిపారు.

English summary
Telangana Rastra Samithi activists attacked on JSP candidate Nagarjuna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X