వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్ ప్లీనరీ: పరిశీలించిన పద్మ, కెటిఆర్..(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక నిర్వహించనున్న తొలి ప్లీనరీ ఏర్పాట్లపై డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు కెటి రామారావు, ఈటెల రాజేందర్‌, పద్మారావు, ఎంపీలు జితేందర్‌రెడ్డి, బాల్కసుమన్‌ తదితరులు ఎల్బీస్టేడియంలో ఏర్పాట్లను సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. పార్టీ అధికార పగ్గాలు చేపట్టాక ఇదే తొలి ఉత్సవమని, మొదటి విజయోత్సవ సభ కూడా అని అన్నారు.

ఇంతకు ముందెన్నడూ నిర్వహించని రీతిలో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 11న ఉదయం నుంచి రాత్రి వరకు సాగనున్న ఈ ప్లీనరీకి ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది ప్రతినిధుల చొప్పున ఆహ్వానించామని, మొత్తం 30 వేల మంది హాజరవుతారని తెలిపారు. ఏర్పాట్లపై ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ప్లీనరీ నిర్వహించే ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పార్టీ తరఫున ప్రత్యేకంగా వాలంటీర్లను ఏర్పాట్లు చేస్తున్నామని కేటీఆర్‌ వివరించారు.

మరుసటి రోజైన 12న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగసభ కోసమూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్లీనరీ విజయవంతానికి మంగళవారం జిల్లా స్థాయిలో, బుధవారం నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్లీనరీలో ప్రత్యేక ఎజెండాలు, ఊహించని రీతిలో తీర్మానాలు ఉంటాయని మంత్రి కెటిఆర్‌ వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం సవ్యసాచి మాదిరిగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.

భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీని పునాది నుంచి పటిష్ఠం చేసేందుకు, ప్రభుత్వాన్ని మరింత ఉత్తమంగా నడిపేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజల్ని కూడా భాగస్వాములను చేసేలా కార్యక్రమాలు ఉండబోతున్నాయని తెలిపారు. కార్యకర్తలను గౌరవించుకునే విధంగా, వారిని ఆదుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికలు ఉంటాయని కేటీఆర్‌ వివరించారు. ప్లీనరీలో ప్రతినిధులందరికీ తెలంగాణ రుచుల విందు ఇవ్వనున్నట్టు ఆహార కమిటీ చైర్మన్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు.

ఏర్పాట్ల పరిశీలన

ఏర్పాట్ల పరిశీలన

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక నిర్వహించనున్న మొట్ట మొదటి ప్లీనరీ ఏర్పాట్లపై డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు కెటి రామారావు, ఈటెల రాజేందర్‌, పద్మారావు, ఎంపీలు జితేందర్‌రెడ్డి, బాల్కసుమన్‌ తదితరులు ఎల్బీస్టేడియంలో ఏర్పాట్లను సోమవారం సమీక్షించారు.

ఏర్పాట్ల పరిశీలన

ఏర్పాట్ల పరిశీలన

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. పార్టీ అధికార పగ్గాలు చేపట్టాక ఇదే తొలి ఉత్సవమని, మొదటి విజయోత్సవ సభ కూడా అని అన్నారు.

ఏర్పాట్ల పరిశీలన

ఏర్పాట్ల పరిశీలన

ఇంతకు ముందెన్నడూ నిర్వహించని రీతిలో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 11న ఉదయం నుంచి రాత్రి వరకు సాగనున్న ఈ ప్లీనరీకి ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది ప్రతినిధుల చొప్పున ఆహ్వానించామని, మొత్తం 30 వేల మంది హాజరవుతారని తెలిపారు.

ఏర్పాట్ల పరిశీలన

ఏర్పాట్ల పరిశీలన

ఏర్పాట్లపై ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ప్లీనరీ నిర్వహించే ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పార్టీ తరఫున ప్రత్యేకంగా వాలంటీర్లను ఏర్పాట్లు చేస్తున్నామని కేటీఆర్‌ వివరించారు.

ఏర్పాట్ల పరిశీలన

ఏర్పాట్ల పరిశీలన

మరుసటి రోజైన 12న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగసభ కోసమూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఏర్పాట్ల పరిశీలన

ఏర్పాట్ల పరిశీలన

ప్లీనరీ విజయవంతానికి మంగళవారం జిల్లా స్థాయిలో, బుధవారం నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.

English summary
Panchayat Raj & IT minister K. Taraka Ramarao (KTR) has said TRS plenary will be held in the Lal Bahadur Stadium here on October 11. Speaking to mediapersons here on Monday, KTR said some 30,000 party activists would attend the plenary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X