వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ కావాలా..మేం కావాలా: జాతీయ పార్టీల‌కు టీఆర్‌య‌స్‌..వైసీపీ అల్టిమేటం: ఏం జ‌రుగుతోంది...!

|
Google Oneindia TeluguNews

Recommended Video

టీడీపీ కావాలా..మేం కావాలా..?? జాతీయ పార్టీల‌కు TRS..YCP.. అల్టిమేటం..!! || Oneindia Telugu

జాతీయ రాజ‌కీయాల్లో కొత్త స‌మీక‌ర‌ణాలు తెర మీద‌కు వ‌స్తున్నాయి. తెలుగు పార్టీలు మ‌ద్ద‌తు కీల‌కం అవుతున్నాయి. దీంతో..అటు తెలంగాణ‌లో టీఆర్‌య‌స్‌..ఇటు ఏపీలో వైసీపీతో జాతీయ పార్టీల నేత‌లు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కాంగ్రెస్ అధినేత‌కు మ‌ద్ద‌తు ఇస్తూ..మోదీ వ్య‌తిరేక రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువుగా మారుతున్నారు. అదే స‌మ‌యంలో స‌ర్వేల ఆధారంగా టిఆర్‌య‌స్‌..వైసీపీల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు కొంద‌రు నేత‌లు రంగంలోకి దిగారు. అయితే..ఈ రెండు పార్టీల నుండి వ‌చ్చిన స‌మాధానంతో వారు ఖంగుతిన్నారు.

స‌మావేశానికి రండి..మ‌ద్ద‌తివ్వండి..
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌రో రెండు విడ‌త‌ల పోలింగ్ మాత్ర‌మే మిగిలి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అయిదు విడ‌త‌ల పోలింగ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఓట‌రు నాడి ప‌ట్టుకోవ‌టంతో జాతీయ పార్టీలు సైతం విఫ‌ల‌మ‌య్యాయి. ఎవ‌రికి ఎన్ని సీట్లు వ‌స్తాయో చెప్ప‌లేని స్థితిలో ఉన్నారు. ఎవ‌రికి వారు త‌మ‌దే విజ‌యం అంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో..బీజేపీయ‌త‌ర పార్టీల నేత‌లు ఒక్క‌ట‌వుతున్నారు.

ఫ‌లితాలు మ‌రో 6రోజులు ఆగితే ఏమ‌వుతుంది: మోదీ ఓట‌మి ఖాయం: చ‌ంద్ర‌బాబు ట్విట్ట‌ర్ వార్..!ఫ‌లితాలు మ‌రో 6రోజులు ఆగితే ఏమ‌వుతుంది: మోదీ ఓట‌మి ఖాయం: చ‌ంద్ర‌బాబు ట్విట్ట‌ర్ వార్..!

ఎలాగైనా మోదీ తిరిగి ప్ర‌ధాని కాకుండా చూడ‌ట‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. ఇందు కోసం ప్రాంతీయ పార్టీల నేత‌లతో సంప్ర‌దింపులు ప్రారంభించారు. దీనిలో భాగంగానే దక్షిణాదిన తెలుగు పార్టీల ముఖ్యుల‌తో వారికి స‌న్నిహితంగా ఉండే నేత‌ల‌తో రాయ‌బారాలు న‌డుతున్నారు. బీజేపి అధికారంలో రాకుండా నిరోధించేందుకు త‌మ‌కు స‌హ‌రించాల‌ని అభ్య‌ర్దిస్తున్నారు. టిఆర్‌య‌స్ .. వైసీపీ ముఖ్య నేత‌ల‌తో ఈ మేర‌కు సంప్ర‌దింపులు జ‌రిగిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే, వారు మాత్రం ఎటువంటి హామీ ఇవ్వ‌కుండా ఒక అంశం మాత్రం ప్ర‌స్తావించిన‌ట్లు తెలుస్తోంది.

TRS..YCP ultimatum to national parties : if TDP three we cant support..!

టీడీపీ కావాలా..మేం కావాలా..
బీజేపీయ‌త‌ర పార్టీలు ఒక్క తాటి పైకి వ‌చ్చినా..అక్క‌డ చంద్ర‌బాబు ఉంటే తాము ఆ కూట‌మిలో చేర‌లేమ‌ని..క‌నీసం మ‌ద్ద‌తు కూడా ఇవ్వ‌లేమ‌ని టీఆర్‌యస్‌..వైసీపీ నేత‌లు స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. కూట‌మిలో టీడీపీ కావాలా లేక మా రెండు పార్టీలు కావాలో తేల్చుకోవాల‌ని ఒక విధంగా అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. కేర‌ళ‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత వైసీపీ నేత‌ల‌తో సంప్ర‌దింపులు చేయ‌గా.. మ‌హారాష్ట్రకు చెందిన మ‌రో నేత అభ్య‌ర్ద‌న మేర‌కు టీఆర్‌స్‌లోని ముఖ్య నేత మంత‌నాలు చేసిన‌ట్లు చెబుతున్నారు.

అయితే,తెలంగాణ‌లో క్షేత్ర స్థాయిలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను వివ‌రించిన‌ట్లు చెబుతున్నారు. తాము ఫ‌లితాల త‌రువాత‌నే ఎవ‌రికి మ‌ద్ద‌తివ్వాల‌నే అంశం పైన నిర్ణ‌యానికి వ‌స్తామ‌ని..ఇప్పుడే హామీ ఇవ్వ‌లేమ‌ని ఈ రెండు పార్టీలు తేల్చి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దీంతో.. జాతీయ పార్టీలు సైతం ఎవ‌రికి సీట్లు వ‌స్తే వారి డిమాండ్ల మేర‌కు వ్య‌వ‌హ‌రించే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

English summary
National parties leaders in touch with TRS and YCP for support after results. Both parties leaders clearly say that if TDP is that ally they cant support and do not attend the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X