వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమలలో పిడుగులు పడొచ్చన్న ఆర్టీజిఎస్:భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమ‌ల‌, తిరుపతిలో పిడుగులు పడే అవకాశం ఉందన్న ఆర్టీజీఎస్‌ హెచ్చరికలతో టిటిడి అప్రమప్తమైంది. వెంటనే భక్తులకు రక్షణ గురించిన హెచ్చరికలు జారీ చేసింది.

పిడుగుల గురించిన హెచ్చరికల నేపథ్యంలో భక్తులు బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని టిటిడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దగ్గరే ఉన్న పక్కా భవనాల్లో తలదాచుకోవాలని ఆర్టీజీఎస్ సూచనలు భక్తులకు తెలియజెప్పారు.

TTD alerts Devotees about Thunderbolts in Tirupathi...

ఆంధ్రప్రదేశ్ లో పిడుగుపాటును ముందే పసిగట్టే టెక్నాలజీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా ఎర్త్ నెట్ నుంచి ఈ టెక్నాలజీని ఎపి ప్రభుత్వం సమకూర్చుకోవడం విశేషం. ఈ టెక్నాలజీ ద్వారా ఏ ప్రాంతంలో పిడుగు పడుతుందో అరగంట ముందే హెచ్చరికలు జారీ చేయడం సాద్యపడుతుంది. ఈ తరహా టెక్నాలజీ దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే ఏర్పాటు కావడం గమనార్హం.

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో భారీ సంఖ్యలో పిడుగులు పడుతున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీ కారణంగానే మరింత నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడే అవకాశం లభిస్తోంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదటి సారిగా కర్నూలు జిల్లా నంద్యాల మండలంలో పిడుగు పడుతుందని ముందే అధికారుల పసిగట్టి మండలంలోని పలు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా నివారించగలిగారు. అయితే కొన్ని సందర్భాల్లో అధికారులు హెచ్చరించినా ప్రజలు రక్ష

పిడుగు పడుతుందనే హెచ్చరిక జారీ కాగానే ప్రజలు వెంటనే ఫోన్ ఆపేయాలి...చెట్లు, ఎలక్ట్రికల్‌ స్తంభాలకు దూరంగా వెళ్లాలి...దగ్గర్లోని ఏదేని ఇంట్లోకి వెళ్లి తలదాచుకునే ప్రయత్నం చేయాలి. ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు ఆఫ్ చేయాలి. ఎర్త్‌వైర్‌ ఉంటే ఇంటిపై పిడుగు పడినా ప్రమాదం ఉందడంటున్నారు అధికారులు.

English summary
Tirupati: TTD is alarmed by the RTGS alerts that there is a possibility of thunderbolts down in Tirumala and Tirupati.Immediate warnings have been issued to devotees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X