వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై యుద్ధంలో టీటీడీ సైతం .. వెంటిలేటర్లు , వైద్య పరికరాల కొనుగోలుకు రూ.19 కోట్ల భారీ విరాళం

|
Google Oneindia TeluguNews

కరోనాపై యావత్ ప్రపంచం యుద్ధం చేస్తుంది . ఇక మనదేశంలోనూ కరోనాపై పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతుంది. ఇక ప్రభుత్వాలు చేస్తోన్న పోరుకు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు. ఆధ్యాత్మిక సంస్థలు సైతం కరోనాపై పోరుకు మేము సైతం అంటూ తమ వంతు సహకారం అందిస్తున్నాయి. తెలుగురాష్ట్రాల ఖ్యాతికి కారణమైన , ప్రపంచదేశాల వాళ్ళు ఇష్ట దైవంగా కొలిచే కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువైన ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానం ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తమ వంతు సాయం అందిస్తుంది .

తిరుమలలో శ్రీవారి అఖండ దీపం కొండెక్కిందని ప్రచారం ... టీటీడీ క్లారిటీతిరుమలలో శ్రీవారి అఖండ దీపం కొండెక్కిందని ప్రచారం ... టీటీడీ క్లారిటీ

 పద్మావతి నిలయం ఆస్పత్రిగా .. ఉదారత చాటుకుంటున్న టీటీడీ

పద్మావతి నిలయం ఆస్పత్రిగా .. ఉదారత చాటుకుంటున్న టీటీడీ

ఇప్పటికే చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ బాధితుల కోసం పద్మావతి నిలయాన్ని ఆస్పత్రిగా మార్చేందుకు ఇచ్చిన టీటీడీ కరోనా బాధితుల కోసం వెంటిలేటర్లు , మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలు కోసం భారీ విరాళాన్ని ప్రకటించింది. టీటీడీ తరఫున రూ. 19కోట్లు కరోనా బాధితులకు కావాల్సిన మెడికల్ కిట్లు , వెంటిలేటర్ల కొనుగోలు కోసం ఇస్తున్నట్లు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. ఇప్పటికే చిత్తూరు కలెక్టర్ కోరిన మేరకు రూ.8కోట్లు చిత్తూరు జిల్లా అధికారులకు ఇచ్చామని చెప్పిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మరో రూ.11కోట్లను త్వరలో అందజేస్తామని పేర్కొన్నారు

అన్నార్థుల ఆకలి తీరుస్తూ .. నిత్యం లక్షా 20వేల ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ

అన్నార్థుల ఆకలి తీరుస్తూ .. నిత్యం లక్షా 20వేల ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ

ఇక అంతేకాదు టీటీడీ భక్తులకు దర్శనాలు కరోనా వ్యాప్తి జరుగుతుందనే భావనతో నిలిపివేసినప్పటికీ చాలా మంది అన్నార్ధుల ఆకలి తీరుస్తుంది. లాక్ డౌన్ నేపధ్యంలో తిరుమలలో చాలా మంది నిరాశ్రయులు అయ్యారు. ఎటూ వెళ్ళలేక అక్కడే చిక్కుకుపోయారు. ఇక వారిని ఆదుకునేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. వలస కూలీలతో పాటు యాచకులను ఆదుకునేందుకు రోజుకు లక్షా 20వేల ఫుడ్ ప్యాకెట్లను టీటీడీ పంపిణీ చేస్తుంది . మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజన ప్యాకెట్లను అందిస్తూ అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు .
తిరుమల కొండపై ఉన్న విశ్రాంతి గదుల్లో కొందరికి ఆశ్రయం ఇచ్చారు.

Recommended Video

US Seeks India Help: Trump Open Request To PM Modi | Oneindia Telugu
లాక్ డౌన్ ముగిసే వరకు అవసరమైన సేవలు చెయ్యాలని టీటీడీ నిర్ణయం

లాక్ డౌన్ ముగిసే వరకు అవసరమైన సేవలు చెయ్యాలని టీటీడీ నిర్ణయం

ఇక వారికి సైతం రోజూ ఆహారం అందిస్తున్నారు. ఆకలితో అలమటిస్తోన్న వారి జీవితాలను టీటీడీ అధికారులు తమ ఉదారత చూపి కాపాడుతున్నారు.లాక్‌డౌన్ ముగిసేవరకు తాము భోజన ప్యాకెట్లను నిత్యం పంపిణీ చేస్తామని టీటీడీ అధికారులు చెప్తున్నారు. ఇక అంతే కాదు తిరుమల శ్రీవారికి నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయని, కేవలం భక్తుల దర్శనాలు మాత్రమే నిలిపివేశామని అధికారులు చెప్తున్నారు. తిరుమలపై జరిగే దుష్ప్రచారాలు నమ్మవద్దని వారంటున్నారు.

English summary
TTD has given a huge donation for the purchase of ventilators and medical equipment for the corona victims in Chittore district. On behalf of TTD, Rs. 19 crores announced Anil Kumar Singhal, an executive officer of TTD, said that 19 crore corona sufferers would be provided with medical kits and ventilators..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X